Chiranjeevi - Waltair Veerayya Update : 'మెగా'స్టార్ మాస్ రికార్డు - 'వాల్తేరు వీరయ్య' ఓటీటీ రైట్స్ ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి మాస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన కథానాయకుడిగా బాబీ (కె ఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న సినిమా డిజిటల్ రైట్స్ రికార్డు రేటుకు అమ్ముడైనట్లు ఇండస్ట్రీ టాక్.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా ఆయన వీరాభిమానుల్లో ఒకరైన కె.ఎస్. రవీంద్ర (బాబీ) ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అది చిరు 154వ సినిమా. సో... Mega 154 అనేది వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరిస్తున్నారు. దీనికి 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya Movie) టైటిల్ ఖరారు చేసినట్లు ఒకసారి చిరంజీవి స్వయంగా లీక్ చేశారు. అయితే... అధికారికంగా ప్రకటించలేదనుకోండి. ఇందులో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఈ సినిమా డిజిటల్ రైట్స్ రికార్డు రేటుకు అమ్మారట.
'వాల్తేరు వీరయ్య' ఓటీటీ రైట్స్ @ రూ. 50 కోట్లు
'వాల్తేరు వీరయ్య' డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఎక్స్‌క్లూజివ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం 50 కోట్ల రూపాయలను మెగాస్టార్ నిర్మాతలకు ఇవ్వడానికి ఆఫర్ చేశారట. ఆ అమౌంట్‌కు డీల్ క్లోజ్ అయినట్లు టాలీవుడ్ టాక్.
లుంగీ లుక్‌కు రెస్పాన్స్ అదిరింది!
'పూనకాలు లోడింగ్' అంటూ సినిమా ప్రారంభం నుంచి అభిమానుల్లో దర్శకుడు బాబీ అంచనాలు పెంచుతున్నారు. ఇదొక మాస్ ఫిల్మ్ అని ఆయన చెబుతూ వస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన లుంగీ లుక్, బీడీని లైటర్‌తో చిరంజీవి వెలిగించే లుక్‌కు సూపర్ రెస్పాన్స్ లభించింది.
'వాల్తేరు వీరయ్య' కథ ఏంటి?
ఈ సినిమాలో మెగాస్టార్ గ్యాంగ్‌స్టర్ రోల్ చేస్తున్నట్లు టాక్. విశాఖలోని వాల్తేరులో, జాలరిపేటలో హీరో ప్రయాణం మొదలు అవుతుందట. అక్కడ నుంచి విదేశాలు వెళుతుంది. పడవ వేసుకుని సముద్రంలో వేటకు వెళ్లే వీరయ్య... మలేషియా ఎందుకు వెళ్లారు? అనేది ట్విస్ట్ అట. గ్యాంగ్‌స్టర్స్‌కు ఎదురువెళ్ళే తరహాలో చిరు క్యారెక్టర్ ఉంటుందట. ఇంతకు ముందు చిరంజీవి మాఫియా రోల్స్ చేశారు. అయితే, ఆ సినిమాలకు 'వాల్తేరు వీరయ్య' చాలా డిఫరెంట్ గా ఉంటుందట. మాసీగా, అదే సమయంలో క్లాసీగా ఉంటుందట.
Also Read : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?
చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.
'వాల్తేరు వీరయ్య' సినిమాను పక్కన పెడితే... విజయ దశమికి 'గాడ్ ఫాదర్' సినిమాతో మెగాస్టార్ థియేటర్లలోకి వస్తున్నారు. అక్టోబర్ 5న ఆ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా రూపొందినప్పటికీ... పతాక సన్నివేశాలు వచ్చేసరికి చిరు మాఫియా డాన్, కనుసైగతో చీకటి ప్రపంచాన్ని శాసించే శక్తివంతమైన పాత్రలో ఆయన కనిపించనున్నారు.