News
News
X

The Ghost Movie Update: ట్రైలర్ ఎఫెక్ట్ - నాగార్జున నిర్మాతల ప్లానింగ్‌లో భారీ మార్పులు

నాగార్జున, ప్రవీణ్ సత్తారు కలయికలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ 'ది ఘోస్ట్'. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ఎఫెక్ట్ సినిమాపై బలంగా పడుతోంది. దాంతో నిర్మాతల ప్లానింగ్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

FOLLOW US: 

కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్' (The Ghost). ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలోకి సినిమా రావడానికి మూడు వారాల క్రితమే... ఆగస్టు నెలాఖరులో ట్రైలర్ విడుదల చేశారు. దాని ఎఫెక్ట్ సినిమాపై బలంగా పడింది. అదీ ఎంతలా అంటే... నిర్మాతల ప్లానింగ్‌లో భారీ మార్పులు చోటు చేసుకునేలా!

'ది ఘోస్ట్' సినిమాను స్టార్ట్ చేసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అయితే... ట్రైలర్ విడుదలైన తర్వాత అన్ని భాషల నుంచి మంచి స్పందన లభించింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) స్టైలిష్ టేకింగ్, క్లాస్‌లో మాస్ చూపిస్తూ నాగార్జున చేసిన ఫైట్స్ భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తెలుగులో మాత్రమే కాదు... 
హిందీ, తమిళ్, మలయాళంలో కూడా!
The Ghost movie to release in Hindi, Tamil, Malayalam languages : 'ది ఘోస్ట్' ట్రైలర్ విడుదలైన రెండు వారాలకు థియేటర్లలోకి 'బ్రహ్మాస్త్ర' సినిమా వచ్చింది. అందులో నంది అస్త్రంగా నాగార్జున పాత్ర వీరోచితంగా ఉంది. ఉత్తరాది ప్రేక్షకులు సైతం ఆయన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు నాగార్జున హిందీ సినిమాలు చేయడంతో ఆయన గురించి కొంత మందికి తెలుసు. 'బ్రహ్మాస్త్ర'తో న్యూ జనరేషన్ ఆడియన్స్ కూడా అట్ట్రాక్ట్ అయ్యారు. 'ది ఘోస్ట్' స్టైలిష్ యాక్షన్ ట్రైలర్ వాళ్ళకు నచ్చింది.

ట్రైల‌ర్‌కు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూశాక... తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఒక విధంగా పాన్ ఇండియా రిలీజ్ అనుకోవాలి. దానికి సంబంధించిన వివరాలను ఈ వారంలో వెల్లడించే అవకాశం ఉంది. 

రీసెంట్‌గా రొమాంటిక్ సాంగ్ రిలీజ్
ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) నటించారు. వాళ్ళిద్దరి మీద తెరకెక్కించిన రొమాంటిక్ సాంగ్ 'వేగం...'ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. భరత్, సౌరబ్ ద్వయం ఆ పాటకు సంగీతం అందించగా... కపిల్ కపిలన్, రమ్య బెహరా ఆలపించారు.

'నీలి నీలి సంద్రం... నింగిలోని మేఘం!
నిన్ను చేరమంది... అంతులేని వేగం!
నిన్ను దాటి పోదే... కంటిపాప చూపే!
నీ నీలి కళ్ళు నాకే గాలం వేసే' అంటూ సాగే ఈ గీతానికి కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు. 'మనసే ఆగదు, వయసే ఓడదు' అంటూ పాటపై ఆసక్తి పెంచారు.

Also Read : రాజమండ్రిలో విలేజ్ సీక్వెన్స్ - చిరు, రవితేజ రెడీ!

'ది ఘోస్ట్'లో నాగార్జున మాజీ ఇంటర్ పోల్ ఆఫీసర్ రోల్ చేస్తుండగా... సోనాల్ చౌహాన్ కూడా ఏజెంట్ తరహా రోల్ చేస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో అక్టోబర్ 5న విడుదల చేస్తారా? లేదంటే... కొంచెం ఆగుతారా? అనేది చూడాలి. మ్యాగ్జిమమ్ ఒకే రోజు దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

Also Read : అక్టోబర్ నుంచి పవన్ ప్లాన్ ఇదే - నిర్మాతలు ఖుషీ!

Published at : 19 Sep 2022 06:13 PM (IST) Tags: nagarjuna Sonal Chauhan The Ghost Movie Nagarjuna Ghost Hindi Release Plan The Ghost Pan India Release

సంబంధిత కథనాలు

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Khushboo: హాస్పిటల్ లో ఖుష్బూ - ఫ్యాన్స్ ఆందోళన!

Khushboo: హాస్పిటల్ లో ఖుష్బూ - ఫ్యాన్స్ ఆందోళన!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్‌పై కంప్లైంట్ - ప్రభాస్, ఓం రౌత్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్‌పై కంప్లైంట్ - ప్రభాస్, ఓం రౌత్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్!

Sri Simha Koduri : భాగ్ సాలే - ప్రేమ, నేరం, పరుగు? కీరవాణి కుమారుడి కొత్త సినిమా లుక్

Sri Simha Koduri : భాగ్ సాలే - ప్రేమ, నేరం, పరుగు? కీరవాణి కుమారుడి కొత్త సినిమా లుక్

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల