News
News
X

Mega154: రాజమండ్రిలో విలేజ్ సీక్వెన్స్ - చిరు, రవితేజ రెడీ!

MEGA154 షూటింగ్ కోసం చిరంజీవి, రవితేజ కలిసి రాజమండ్రి వెళ్లనున్నారట.  

FOLLOW US: 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), దర్శకుడు బాబీ(Bobby) కాంబినేషన్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా షూటింగ్ కోసం చిరంజీవి, రవితేజ కలిసి రాజమండ్రి వెళ్లనున్నారట. ఇప్పటికే వీరిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు విలేజ్ సీక్వెన్స్ ను రాజమండ్రిలో చిత్రీకరిస్తారట.సెప్టెంబర్ 21 నుంచి చిరు, రవితేజలు రాజమండ్రి జరగబోయే షూటింగ్ లో పాల్గోనున్నారు. 

చిరు సవతి సోదరుడిగా రవితేజ:
కథ ప్రకారం.. చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  

దేవిశ్రీప్రసాద్ మాస్ ట్యూన్స్:
ఈ సినిమా కోసం పాటలు పూర్తి చేశారట దేవిశ్రీప్రసాద్. మొత్తం నాలుగు మాస్ సాంగ్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాల్లో మాస్ సాంగ్స్ తో పాటు మెలోడీస్ కూడా ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం మెలోడీకి చోటు లేదట. కథ ప్రకారం.. నాలుగు పాటలు ఉంటే.. నాలుగూ కూడా మాస్ సాంగ్స్ అని తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ చాలా బాగా వచ్చిందని చెబుతున్నారు. రవితేజ, చిరంజీవి కాంబినేషన్ లో కూడా ఓ పాట ఉంటుందట. అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  

సినిమా బడ్జెట్:

ఈ సినిమా కోసం రూ.125 నుంచి రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రెమ్యునరేషన్లకే రూ.75 కోట్లు ఖర్చు అవుతుందట. చిరంజీవికి అటు ఇటుగా రూ.40 కోట్లకు పైగానే ఇస్తున్నారు. రవితేజకి రూ.18 కోట్లని టాక్. దర్శకుడు బాబీకి ఎలా లేదన్నా ఐదారు కోట్లు ఇస్తారు. మిగిలిన నటీనటులకు టెక్నీషియన్స్ కు కలుపుకొని రూ.75 కోట్లు దాటేస్తుందట.  

ఈ సినిమాలో మలయాళ నటుడు బిజూ మీనన్ ను విలన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ దాదాపు ఫైనల్ చేసినట్లే. ఈ సినిమాతో పాటు చిరు లిస్ట్ లో 'భోళాశంకర్', వెంకీ కుడుముల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా దసరా సీజన్ లో రిలీజ్ కానుంది. 

Also Read : ఈ వారం థియేట్రికల్ - ఓటీటీ రిలీజెస్ ఇవే!

Also Read : ‘జైలర్’ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం! నిజంగానే రజనీ మూవీ నుంచి తప్పుకుందా?

Published at : 19 Sep 2022 05:45 PM (IST) Tags: chiranjeevi Bobby Ravi Teja Mega154

సంబంధిత కథనాలు

Dil Raju: చరణ్, శంకర్ సినిమా - దిల్ రాజు లెక్క తప్పిందా?

Dil Raju: చరణ్, శంకర్ సినిమా - దిల్ రాజు లెక్క తప్పిందా?

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?

Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?

Rudrangi Motion Poster: “రుద్రంగి నాది బాంచత్” అంటూ గర్జిస్తున్న జగ్గూ భాయ్!

Rudrangi Motion Poster: “రుద్రంగి నాది బాంచత్” అంటూ గర్జిస్తున్న జగ్గూ భాయ్!

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం, సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం,  సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam