News
News
X

Tollywood: ఈ వారం థియేట్రికల్-ఓటీటీ రిలీజెస్ ఇవే!

ఈ వారం కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

FOLLOW US: 

గత వారం విడుదలైన సినిమాలేవీ కూడా వర్కవుట్ కాలేదు. ఏ సినిమాకి కూడా కనీసపు కలెక్షన్స్ రాలేదు. ఇదిలా ఉండగా.. ఈ వారం కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

కృష్ణ వ్రింద విహారి:

యువ హీరో నాగశౌర్య (Naga Shourya) నటించిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari). షెర్లియా సేతి (Shirley Setia) హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి అనీష్ ఆర్. కృష్ణ దర్శకుడు. గతంలో ఆయన 'అలా ఎలా?' వంటి ఎంటర్టైనర్ తీశారు. 'లవర్', 'గాలి సంపత్' సినిమాలకూ ఆయనే దర్శకుడు. ఐరా క్రియేషన్స్ సంస్థ సినిమాను తెరకెక్కించింది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్ ఐరా క్రియేషన్స్‌లో నాగశౌర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 'ఛలో', 'అశ్వథ్థామ' వంటి హిట్స్ ఉన్నాయి. 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari Release Date) సినిమా ప్రచార చిత్రాలు చూస్తుంటే మరో కలర్ ఫుల్ ఎంటర్టైనర్ వస్తున్నట్టు అనిపిస్తోంది. సెప్టెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అల్లూరి:

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా 'అల్లూరి' (Alluri). నిజాయితీకి మారు పేరు... అనేది ఉపశీర్షిక. ఇదొక ఫిక్షనల్ పోలీస్ ఆఫీసర్ బయోపిక్. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకుడు. ఈ సినిమాలో నిజాయతీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజు పాత్రలో శ్రీ విష్ణు కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కయ్యదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో సుమన్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృథ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, 'వెన్నెల' రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు కీలకపాత్ర పోషించారు. 

దొంగలున్నారు జాగ్రత్త:

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు శ్రీసింహ.. దొంగలున్నారు జాగ్రత్త' అనే మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో సతీష్ త్రిపుర అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మాతృదేవోభవ:

తల్లి విలువ తెలియజెప్పేలా దర్శకుడు హరనాధ్ రెడ్డి ఈ సినిమాను రూపొందించారు. సెప్టెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

పగ పగ పగ:

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటిసారిగా ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తోన్న సినిమా 'పగ పగ పగ'. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను తెరకెక్కించారు. వినోదాత్మకంగా సాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ రిలీజెస్:

బబ్లీ బౌన్సర్:

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ దర్శకత్వంలో 'బబ్లీ బౌన్సర్‌' అనే సినిమా చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. బాక్స‌ర్స్ టౌన్ గా గుర్తింపు తెచ్చుకున్న అసోలా ఫ‌తైపూర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 23న నేరుగా డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. 

ఫస్ట్ డే ఫస్ట్ షో:

'జాతిరత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ అందించిన కథతో 'ఫస్ట్ డే ఫస్ట్ షో' (First Day First Show Movie) అనే సినిమా రూపొందింది. దీనికి ఇద్దరు యువకులు.. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. పూర్ణోదయా పిక్చర్స్ ఏడిద నాగేశ్వరరావు వారసులు ఈ సినిమాకు నిర్మాతలు. సెప్టెంబర్ 2న థియేటర్లో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 23 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. 

ఈ సినిమాతో పాటు 'ఆహా'లో 'డైరీ' అనే తమిళ సినిమా కూడా రిలీజ్ కానుంది.

'డ్యూడ్' అనే హిందీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలానే 'హుష్ హుష్' అనే మరో హిందీ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. 

నెట్ ఫ్లిక్స్ లో 'జాంతారా' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Also read: మూడేళ్ల నుంచి పుట్టనిది ఇప్పుడు పుడుతుందా - సూర్య గురించి ఆరోహి, ప్రేమ ఉందన్న అభినయ

Also read: అభినయశ్రీ ఎలిమినేషన్ - రేవంత్ కన్నింగ్ అంటూ కామెంట్స్, టాప్ 5లో ఆ ఇద్దరు!

 

Published at : 19 Sep 2022 03:23 PM (IST) Tags: Babli Bouncer Alluri Naga Shourya krishna vridha vihari dongalunnaru jagrattha

సంబంధిత కథనాలు

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!

Chiranjeevi: మెగా నిర్మాతల నిర్ణయం - 'గాడ్ ఫాదర్'ని మలయాళంలో రిలీజ్ చేస్తారా?

Chiranjeevi: మెగా నిర్మాతల నిర్ణయం - 'గాడ్ ఫాదర్'ని మలయాళంలో రిలీజ్ చేస్తారా?

Nayanthara: నయనతార ప్రెగ్నెంట్? విఘ్నేష్ శివన్ పోస్ట్ వైరల్

Nayanthara: నయనతార ప్రెగ్నెంట్? విఘ్నేష్ శివన్ పోస్ట్ వైరల్

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

టాప్ స్టోరీస్

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

MS Dhoni: ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

MS Dhoni:  ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం