News
News
X

Bigg Boss Telugu 6: అభినయశ్రీ ఎలిమినేషన్ - రేవంత్ కన్నింగ్ అంటూ కామెంట్స్, టాప్ 5లో ఆ ఇద్దరు!

ఆదివారం నాడు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం!

FOLLOW US: 

సన్ డే.. ఫన్ డే రానే వచ్చింది. శనివారమే షానిని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్.. ఈరోజు మరొకరిని ఎలిమినేట్ చేయబోతున్నాడు. ఆదివారం ఎపిసోడ్ లో స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. ఆ తరువాత స్టేజ్ పైకి ముఖ్య అతిధిగా తమన్నాను ఇన్వైట్ చేశారు. ఆమె తన సినిమా 'బబ్లీ బౌన్సర్' సినిమా ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో కనిపించింది. ఆమెకి బిగ్ బాస్ కానుక ఇచ్చి హౌస్ లోకి పంపించారు నాగార్జున. 

హౌస్ లో తమన్నా: 
హౌస్ లోకి వెళ్లిన తమన్నా.. వారితో ఓ గేమ్ ఆడించింది. 'ఇక్కడ ఉన్న ప్రతి అబ్బాయి.. హౌస్‌లో ఉన్న ఒకమ్మాయిని తమ బౌన్సర్ గా ఎంచుకోవచ్చు' అని నాగార్జున చెప్పారు. ఎందుకు ఎన్నుకున్నారో కారణాలు చెప్పాలన్నారు. ముందుగా ఆదిరెడ్డి.. గీతూని బౌన్సర్ గా ఎన్నుకున్నారు. బాలాదిత్యతో ఫ్యూచర్ లో రైవల్రీ ఉండే ఛాన్స్ ఉందని.. దానికి గీతూ ప్రొటెక్షన్ కావాలన్నారు. బాలాదిత్య.. గీతూని బౌన్సర్ గా ఎన్నుకున్నారు. 
 
అర్జున్, శ్రీసత్యలను ఆడుకున్న నాగార్జున: 
అర్జున్ కళ్యాణ్ తన బౌన్సర్ గా శ్రీ సత్యను ఎంచుకున్నాడు. శ్రీ సత్య పేరు చెప్పగానే బయట ఉన్న ఆడియెన్స్ అరిచారు. దానికి నాగార్జున 'ఏమిటా స్పందన ఇక్కడ' అన్నారు. దానికి ఒక ప్రేక్షకురాలు 'ఏదో ఉంది' అంటూ  కామెంట్ చేసింది. దానికి నాగార్జున 'అర్జున్ కళ్యాణ్ విషయంలోనా' అని అడిగారు. దానికి అర్జున్ అదో రకంగా ముఖం పెట్టాడు. దానికి వెనుక ఉన్న మిగతా కంటెస్టెంట్లు 'కమల్ హాసన్' అని కామెంట్ చేశారు.

అర్జున్ మాట్లాడుతూ 'ఆమె నాకు మంచి ఫ్రెండ్ సర్ అంతే' అన్నాడు. దానికి నాగార్జున సెటైర్లు వేశారు. తమన్నా మాట్లాడుతూ 'సర్ మేం ఎన్ని సినిమాల్లో నటించాం... అందులో అన్నీ స్నేహంతోనే మొదలవుతాయి' అంది. '100% లవ్'లో కూడా హీరోహీరోయిన్లు బాగా కొట్టకున్నారు కదా, అందులో మహాలక్ష్మి క్యారెక్టర్‌కి చికెన్ అంటే చాలా ఇష్టం కదా అన్నారు నాగార్జున. 
 
శ్రీహాన్.. ఆరోహిని బౌన్సర్ గా ఎనుకున్నాడు. ఆ తరువాత మాట్లాడుతూ 'రాత్రి పడుకుని ఉదయం లేచేసరికి తన మెడ మీద చిన్న మార్కు కనిపిస్తోంది. పక్క బెడ్ లోకి అర్జున్ వచ్చాకే ఈ మార్కు కనిపిస్తోందని' అన్నాడు. దానికి ఆరోహి 'ఒకే దుప్పట్లో ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు, మార్కు రాక ఏం వస్తాయి' అంటూ పంచ్ వేసింది ఆరోహి. రేవంత్.. గీతూని బౌన్సర్ గా ఎన్నుకున్నాడు. '
 
ఆర్జే సూర్య బౌన్సర్ బ్యాండ్ ఆరోహికి కట్టడానికి వెళ్లేసరికి ఆడియన్స్ అంతా అరిచారు. నాగార్జున 'మళ్లీ ఈ స్పందనేంటి' అన్నారు. దానికి ఆరోహి 'మూడు సంవత్సరాల నుంచి ఏం పుట్టలేదు, ఇప్పుడేం పుడుతుంది సర్' అంది. దానికి నాగార్జున 'నిన్నేమైనా అడిగామా మేము' అన్నారు. దాంతో ఆరోహి ఏదొక కవర్ డ్రైవ్ కావాలి కదా అని డైలాగ్ వేసింది. అభినయ మాత్రం 'ప్రేమ ఉంది సర్ చాలా, మేము చూస్తున్నాం సార్' అంది. 
 
చంటి ఓ బౌన్సర్ బ్యాండేజ్ తీసి ఫైమాకి పెట్టాడు. 'ఫైమాకు ఎందుకు పెట్టానంటే నాకు రాజ్ అంటే భయం, రాత్రి పూట ఒక రకంగా పడుకుంటున్నాడు సర్, మధ్యమధ్యలో నా దిండు, దుప్పటి మాయమైపోతుంది సర్' అని నాగార్జునకు చెప్పాడు. 'ఫైమా ఏ విధంగా కాపాడుతుంది నిన్ను' అని నాగ్ ప్రశ్నిస్తే... 'వాడు భయపడేది ఫైమాకే సర్' అని చెప్పాడు చంటి. 

రాజ్.. నేహాని బౌన్సర్ గా ఎన్నుకున్నాడు. ఫైమా చేసే ర్యాగింగ్ నుంచి నేహా కాపాడుతుందని చెప్పారు. రోహిత్.. సుదీపాను బౌన్సర్ గా ఎన్నుకున్నాడు. లేడీ బౌన్సర్ గా అందరికంటే ఎక్కువ ఓట్లు గీతూకి వచ్చాయి. ఆ తరువాత మేల్ కంటెస్టెంట్స్ కి తమన్నాను ఇంప్రెస్ చేసే టాస్క్ ఇచ్చారు. ఇందులో ఆర్జే సూర్య గెలవడంతో అతడికి బిగ్ బాస్ కానుక ఇచ్చారు. 
 
గీతూ, రాజ్ సేఫ్:
నామినేషన్స్ లో ఉన్నవారికి బొమ్మల టాస్క్ ఇవ్వగా... అందులో ఆది,మెరీనా, రోహిత్, ఫైమా, అభినయలకు అన్ సేఫ్ వచ్చింది. ఈ టాస్క్ లో గీతూ, రాజ్ లు సేఫ్ అయ్యారు. 
 
ఆ తరువాత హౌస్ మేట్స్ ని రెండు గ్రూపులుగా విడగొట్టి 'గజిబికి గానా' అనే టాస్క్ ఆడించారు. రేవంత్ ఒక టీమ్ గా, చంటి ఒక టీమ్ గా గేమ్ ఆడారు. 
 
రేవంత్, ఫైమా సేఫ్: 
నామినేషన్స్ లో ఉన్నవారికి ఐస్ క్రీమ్ కోన్ టాస్క్ పెట్టగా.. అందులో మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి, అభినయలకు అన్ సేఫ్ వచ్చింది. సైమా, రేవంత్ లకు సేఫ్ వచ్చింది.   
 
మరో టాస్క్ లో మెరీనా, రోహిత్ లు సేఫ్ అని ప్రకటించారు. 
 
అభినయ శ్రీ ఎలిమినేషన్:
చివరకు అభినయశ్రీ, ఆదిరెడ్డిలను నామినేషన్స్ లో ఉంచి.. అభినయ శ్రీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగార్జున. ఆమె వెళ్లిపోవడంతో ఫైమా కొంచెం ఎమోషనల్ అయింది. అనంతరం స్టేజ్ పైకి వచ్చిన అభినయ శ్రీకి బిగ్ బాస్ లో తన జర్నీను చూపించారు. ఆ తరువాత హౌస్ లో ఎవరు హానెస్ట్, ఎవరు డిస్ హానెస్ట్ అనేది చెప్పమని అడిగారు నాగార్జున. ఫైమా, చంటి, శ్రీసత్య, బాలాదిత్య, ఆర్జే సూర్యలు హానెస్ట్ అని చెప్పింది అభినయ. శ్రీసత్య టాప్ 5లో ఉంటుందని, బాలాదిత్య మంచి మనిషి అని, ఆర్జే సూర్య తనకు బ్రదర్ లాంటి వాడని చెప్పింది. డిస్ హానెస్ట్.. లిస్ట్ లో రేవంత్ పేరు చెప్పి.. తను కన్నింగ్ అని అనిపిస్తుందని.. ఆ విషయాన్ని అతడికే నేరుగా చెప్పానని తెలిపింది. మిగిలిన హౌస్ మేట్స్ అందరూ చాలా బాగా ఉంటున్నారని వెల్లడించింది. గీతూ బ్రేవ్ గర్ల్ అని.. ఆమె టాప్ 3లో ఉంటుందని చెప్పింది.
  
Published at : 18 Sep 2022 10:30 PM (IST) Tags: nagarjuna Revanth Bigg Boss 6 Bigg Boss Telugu 6 Geetu Royal abhinaya sree sree satya

సంబంధిత కథనాలు

Chiranjeevi: 'దర్శకుడు చెప్పినట్లే చేశా' - 'ఆచార్య' ప్లాప్ పై చిరు కామెంట్స్!

Chiranjeevi: 'దర్శకుడు చెప్పినట్లే చేశా' - 'ఆచార్య' ప్లాప్ పై చిరు కామెంట్స్!

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Bandla Ganesh: వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

Bandla Ganesh: వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు