Nayanthara : భర్తకు నయనతార సర్‌ప్రైజ్
భర్త విఘ్నేష్ శివన్‌కు నయనతార సర్‌ప్రైజ్ ఇచ్చారు. అది ఏంటి? ఏమైంది? వంటి విషయాల్లోకి వెళితే...
![Nayanthara : భర్తకు నయనతార సర్‌ప్రైజ్ Nayanthara Surprise Birthday Party To Husband Vignesh Shivan At Burj Khalifa Nayanthara : భర్తకు నయనతార సర్‌ప్రైజ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/18/16be8498ac7af75f9d8ebab3adf933171663472837392313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సెప్టెంబర్ 18... ఈ రోజు తమిళ దర్శకుడు, రచయిత విఘ్నేష్ శివన్ పుట్టిన రోజు (Vignesh Shivan Birthday). సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) తో పెళ్లి తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజు. కొన్ని సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు విఘ్నేష్ బర్త్ డే వస్తే... నయనతార గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేవారు. పెళ్లి తర్వాత పుట్టిన రోజును స్పెషల్‌గా సెలబ్రేట్ చేశారు.
దుబాయ్‌లో... ఫ్యామిలీతో!
విఘ్నేష్ శివన్ ఈ ఏడాది దుబాయ్‌లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. భార్య నయన్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య! ఒకవైపు బుర్జ్ ఖలీఫా కనపడుతుంటే... మరో వైపు కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్ శివన్ కేక్ కట్ చేశారు.
''నన్ను ఎంతగానో ప్రేమించే కుటుంబ సభ్యుల నడుమ... స్వచ్ఛమైన ప్రేమతో నిండిన రోజు ఈ పుట్టిన రోజు. నా వైఫ్ (నయనతార) అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చింది. నా మనసుకు దగ్గరైన వ్యక్తులతో బుర్జ్ ఖలీఫా కింద బర్త్ డే సెలబ్రేషన్స్! ఇంత కంటే స్పెషల్ ఏమీ ఉండదు. నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను'' అని విఘ్నేష్ శివన్ తెలిపారు.
పెళ్లి తర్వాత కొత్త సినిమాలతో నయన్ బిజీ!
పెళ్లి తర్వాత నయనతార నటనకు ఫుల్ స్టాప్ పెడతారా? సినిమాల్లో నటించడం మానేస్తారా? అని చాలా మందికి సందేహం కలిగింది. ఎందుకంటే... ఆమెకు పెళ్లి తర్వాత నటించకూడదని అత్తగారు కండిషన్ పెట్టారని గుసగుసలు వినిపించాయి. నటనకు ఫుల్ స్టాప్ పెట్టి నిర్మాతగా మాత్రమే కంటిన్యూ అవుతారని కూడా చెన్నై సినీ వర్గాల్లో వినిపించింది. వాటన్నిటికీ చెక్ పెడుతూ... నయనతార 75వ సినిమా ప్రకటన వచ్చింది.
Also Read : నా కథలు దేశం దాటి వెళతాయనుకోలేదు - హాలీవుడ్‌లో 'ఆర్ఆర్ఆర్' సక్సెస్‌పై రాజమౌళి
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో ట్రైడెంట్ ఆర్ట్స్ ఆర్. రవీంద్రన్ సమర్పణలో జీ స్టూడియోస్, నాడ్ స్టూడియోస్ ఒక సినిమా నిర్మించనుంది. ఆమెకు 75వ సినిమా అది. అందులో సత్యరాజ్, జై ఇతర ప్రధాన తారాగణం. నీలేష్ కృష్ణ రచన, దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.
పెళ్లి తర్వాత హిందీ ప్రేక్షకుల ముందుకు...
పెళ్లికి ముందు నయనతార కొన్ని సినిమాలు అంగీకరించారు. అందులో షారుఖ్ ఖాన్ 'జవాన్' ఒకటి. హిందీలో నయనతారకు తొలి సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా 'గాడ్ ఫాదర్'. హీరో సోదరి పాత్రలో నయనతార నటిస్తున్నారు. ఆ సినిమా కూడా హిందీలో విడుదల కానుంది. పెళ్లి తర్వాత నయన్ హిందీ సినిమా ఇండస్ట్రీకి వెళుతున్నారు. విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 5న 'గాడ్ ఫాదర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
పెళ్లి తర్వాత నటించకూడదని రూలేమీ లేదు. హిందీలో చాలా మంది హీరోయిన్లు వివాహమైన తర్వాత సినిమాల్లో నటిస్తూ... ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి కథానాయికల జాబితాలో నయనతార కూడా చేరారు.
Also Read : మహేష్, త్రివిక్రమ్ లొకేషన్ మారింది గురూ - సూపర్ మాస్ ఫైట్ షురూ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)