Pawan Kalyan: అక్టోబర్ నుంచి పవన్ ప్లాన్ ఇదే - నిర్మాతలు ఖుషీ!
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
![Pawan Kalyan: అక్టోబర్ నుంచి పవన్ ప్లాన్ ఇదే - నిర్మాతలు ఖుషీ! Pawan Kalyan's perfect plan from October Pawan Kalyan: అక్టోబర్ నుంచి పవన్ ప్లాన్ ఇదే - నిర్మాతలు ఖుషీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/e593946da2868e487f1ce883d2f679af1663586376751205_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వచ్చే నెల అక్టోబర్ 2 నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అది వాయిదా పడింది. ప్రజా సమస్యలపై మరింత అవగాహన కోసం సమయం అవసరం కావడంతో ఆయన ఈ యాత్రను పోస్ట్ పోన్ చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. రాజకీయాల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి పక్కా ప్లానింగ్ ప్రకారం సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు.
అక్టోబర్ నుంచి సుజీత్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టనున్నారు. నెల మొత్తం డేట్స్ సుజీత్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. డీవీవీ దానయ్య, త్రివిక్రమ్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాతో పాటు 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నారు. నవంబర్ లో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోమని నిర్మాతలకు చెప్పారట పవన్ కళ్యాణ్. ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ నడుస్తున్నాయి.
ఇవన్నీ క్లియర్ చేసుకొని పవన్ చెప్పిన టైంకి రెడీగా ఉండాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 'హరిహర వీరమల్లు' మేజర్ షెడ్యూల్ ను ఈసారి పూర్తి చేయడం గ్యారెంటీ. ఆ తరువాత డిసెంబర్ నెలలో మళ్లీ సుజీత్ సినిమా సెట్స్ పైకి వెళ్తారు పవన్ కళ్యాణ్. ఇవి కాకూండా.. 'వినోదయ సీతం' రీమేక్ ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో క్లారిటీ రావాల్సివుంది!
ఈ సినిమాలతో పాటు 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా కమిట్ అయ్యారు పవన్. ఈ సినిమా స్క్రిప్ట్ చేతిలో పట్టుకొని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు హరీష్ శంకర్. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తక్కువ డేట్స్ ఇచ్చినా.. షూటింగ్ పూర్తి చేస్తానని ఇప్పటికే హారీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ కి వెల్లడించారు. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి పవన్ ఆలోచిస్తున్నట్లుగా లేరు.
ఇక 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా రిలీజ్ అప్డేట్:
మొదట ఈ దసరాకి సినిమా వస్తుందన్నారు. ఆ తరువాత 2023 సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను 2023 మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam) రిలీజ్ డేట్ విషయాన్ని బయటపెట్టారు.
Also Read : ఈ వారం థియేట్రికల్ - ఓటీటీ రిలీజెస్ ఇవే!
Also Read : ‘జైలర్’ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం! నిజంగానే రజనీ మూవీ నుంచి తప్పుకుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)