By: ABP Desam | Updated at : 26 Jun 2023 05:20 PM (IST)
Image Credit: DVV Entertainment/Twitter
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు. మరో వైపు వారాహి యాత్రతో రాజకీయాల్లో బిజీ అయిపోయారు. వచ్చే ఏడాదే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాల షూటింగ్ షెడ్యూల్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. అందుకోసం వీలు కుదిరినప్పుడల్లా షూటింగ్ కి డేట్ లు ఇస్తూ బ్యాలెన్స్డ్ గా వెళ్తున్నారు. తాజాగా దర్శకుడు సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ‘ఓజీ’(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాలను త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు. అందుకే కుదిరినప్పుడల్లా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఫ్యాన్ బాయ్ సుజీత్ దర్శకత్వంలో వస్తోన్న గ్యాంగస్టర్ బ్యాక్డ్రాప్ మూవీ ‘ఓజీ’ షూటింగ్ 50 శాతం పూర్తయింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. గతంలో హైదరాబాద్ లో మూడో షెడ్యూల్ ను ప్రారంభించారు. ఆ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఆన్ లొకేషన్ నుంచి మూవీ టీమ్ అంతా కలసి ఓ ఫోటో దిగి ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు రానున్న రోజులు చాలా ఎగ్జైటింగ్ ఉంటాయంటూ చెప్పుకొచ్చారు. చాలా వరకూ పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను షూట్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ తర్వాత షెడ్యూల్ ఉంటుందని అంటున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి, అర్జున్ దాస్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి చేస్తునున్నారు. తెలుగులో ఇమ్రాన్ కు ఇదే తొలి సినిమా కావడం విశేషం.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే సముద్రఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలసి ‘బ్రో’ సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో తెరెక్కుతోన్న పిరియాడికల్ డ్రామా మూవీ ‘హరి హర వీరమల్లు’ కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. ఇక పవన్ కు ‘గబ్బర్ సింగ్’ లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు పవన్. ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో మూవీపై అంచనాలు మరింత పెంచేసింది. ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలన్నిటినీ ఎప్పటికి పూర్తి చేస్తారో చూడాలి.
Also Read: షూటింగ్‌లో గాయపడ్డ పృథ్వీరాజ్ సుకుమారన్ - ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్
Action, Epicness & Drama…
— DVV Entertainment (@DVVMovies) June 26, 2023
A very productive three Schedules Done & Dusted. #OG Completes 50% of the shoot. Exciting weeks ahead 🤙🏻🔥#FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/x2wkRvLkgB
Prema Entha Madhuram December 4th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: భార్యని చూసిన ఆనందంలో ఆర్య - వాళ్లను చంపేందుకు ఆలయంలోకి ప్రవేశించిన రౌడీలు
Gruhalakshmi December 4th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్: దివ్యకు ప్రెగ్నెన్సీ రావడంతో షాకైన రాజ్యలక్ష్మీ - పెద్దమనసు చాటుకున్న జాహ్నవి
Krishna Mukunda Murari December 4th Episode - 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్: మురారితో తన మనసులో మాట చెప్పేసిన కృష్ణ!
Trinayani Serial December 4th Episode : 'త్రినయని' సీరియల్: తిలోత్తమ చేసిన పనికి మైకంలో విశాలాక్షి - పరుగు పరుగున వచ్చిన నాగయ్య పాము!
Brahmamudi December 4th episode: ‘బ్రహ్మముడి’ సీరియల్ : అరుణ్ ఇంటికెళ్లిన కావ్య, రాజ్ - స్వప్నను ఇంటికి తీసుకెళ్లమన్న రుద్రాణి
Women MLAs In Telangana: ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో కారు పంక్చర్- పదికి చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య
Bhadrachalam MLA: బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ వికెట్, కాంగ్రెస్ లో చేరనున్న భద్రాచలం ఎమ్మెల్యే! టచ్ లోకి మరో నలుగురు!
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
/body>