అన్వేషించండి

షూటింగ్‌‌లో గాయపడ్డ పృథ్వీరాజ్ సుకుమారన్ - ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్

జయన్ నంబియార్ దర్శకత్వం వహిస్తోన్న విలయత్ బుద్ధ షూటింగ్లో పృథ్వీరాజ్ సుకుమారన్ గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలికి గాయాలైనట్టు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ షూట్స్ చేస్తుండగా యాక్సిడెంట్ అయినట్టు సమాచారం

Prithviraj Sukumaran : మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ చిత్రం 'విలయత్ బుద్ధ' షూటింగ్‌లో చిన్న ప్రమాదానికి గురయ్యాడు. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పృథ్వీరాజ్ గాయాలు కావడంతో సోమవారం ఉదయం కొచ్చిన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కాలికి కీహోల్ శస్త్రచికిత్స చేయనున్నట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండనున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే పృథ్వీరాజ్ కుటుంబసభ్యులు లేదా సన్నిహితులు గానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా పృథ్వీరాజ్‌కు గాయమైందన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పృథ్వీరాజ్ సుకుమారన్ కు ప్రమాదం నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా పృథ్వీరాజ్ గాయపడడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాలార్' లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2023న రిలీజ్ కానుంది. అయితే పృథ్వీరాజ్ కు గాయం కావడం.. 'సాలార్' విడుదలపై ప్రభావం చూపుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే 'సాలార్' చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటన చేయాల్సిందేనని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు. 

పృథ్వీరాజ్ సుకుమారన్ చివరిగా 'షాజీ కైలాస్' దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం 'కాపా'లో కనిపించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్... 'ఆడుజీవితం', 'సాలార్', 'బడే మియాన్ చోటే మియాన్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా అవి ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న 'విలయత్ బుద్ధ' చిత్రానికి జయన్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరో వంద రోజుల్లో

ప్రభాస్, శృతి హాసన్ నటించిన 'సాలార్; చిత్రం కౌంట్ డౌన్ మొదలైంది. దాదాపు మరో వంద రోజులలో ఈ సినిమా విడుదల కాబోతుంది ఇటీవలే చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. ఇప్పటికే ప్రభాస్ సినిమా ఆదిపురుష్ వివాదాల్లో ఉండగా.. ఈ సినిమాను ఓం రౌత్ సరిగా తీయలేదని అందరూ ఆరోపిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రాజకీయ పార్టీ అనుబంధ సంస్థ అండగా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. 

Read Also : Samajavaragamana trailer: ఫ్యామిలీ మెంబర్స్ అంటే కేజీఎఫ్ లో బానిసలా? కడుపుబ్బా నవ్విస్తున్న 'సామజవరగమన' ట్రైలర్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Embed widget