By: ABP Desam | Updated at : 11 Dec 2022 11:18 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@MythriOfficial/twitter
ఓవైపు ఎన్నికలకు రెడీ అవుతున్న జనసేననాని పవన్ కల్యాణ్.. మరోవైపు వరుస సినిమాలతోనూ దూసుకుపోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సినిమాల్లో ఫుల్ బిజీ అయ్యారు పవర్ స్టార్. ఎన్నికల వేడి మొదలయ్యే సరికి అన్ని సినిమాలను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన.. సుజిత్ తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో వస్తున్న తాజా సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.
ఇప్పటికే పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగించింది. పవన్ కల్యాణ్ ను మళ్లీ ఫుల్ స్వింగ్ లో నిలిపింది. అంతకు ముందు సరైన హిట్ లేక ఇబ్బంది పడిన పవన్ కు తన కెరీర్ లోనే దుమ్మురేపే హిట్ ఇచ్చింది. ‘గబ్బర్ సింగ్’ హిట్ తో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మళ్లీ జోష్ లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి మరో సినిమా చేయాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది వీరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సినిమా పేరు ‘ భవదీయుడు భగత్ సింగ్’ అనే ప్రచారం కూడా కొనసాగింది.
ఏడాది కిందట వచ్చిన ప్రకటన తర్వాత అప్పుడుప్పుడు చిన్న చిన్న అప్ డేట్స్ వచ్చాయి.. తప్ప మేజర్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒకానొక సమయంలో ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా ఈ సినిమా గురించి బ్రహ్మాండమైన ప్రకటన వచ్చింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ మేరకు టైటిల్ పోస్టర్ విడుదల చేసింది.
లేటెస్టుగా విడుదలైన టైటిల్ పోస్టర్ లో కీలక మార్పులు చేశారు. ఇంతకాలం‘ భవదీయుడు భగత్ సింగ్’ అనే పేరు ప్రచారం జరిగినా, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ కు తోడుగా ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ ట్యాగ్ లైన్ యాడ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో పవన్ కల్యాణ్ ఒక చేతిలో హార్లీ డేవిడ్సన్ బైక్, మరో చేతిలో ఛాయ్ గ్లాస్ పట్టుకుని అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో కరెంట్ వైర్లు సహా కరెంట్ తయారీ ఫ్యాక్టరీ కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు టైటిల్ పోస్టర్ ను చూసి ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు.
❤️🔥❤️🔥❤️🔥@PawanKalyan in and as #UstaadBhagatSingh 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) December 11, 2022
This time, it's beyond entertainment 😎🔥
Shoot begins soon 💥❤️🔥@harish2you @ThisIsDSP @DoP_Bose @MythriOfficial pic.twitter.com/F7EFDOW3F8
Read Also: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?
Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?
Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా
Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!
Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి
Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!