Family Star OTT: 'దిల్' రాజు సేఫ్ - ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ క్లోజ్, థియేట్రికల్ బ్యాలన్స్ అంతే!
Vijay Devarakonda's Famil Star Update: విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు తెలిసింది.
థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాదు... స్టార్ హీరోల సినిమాలకు ఇప్పుడు ఓటీటీ బిజినెస్ కూడా కీలకంగా మారింది. కోట్ల రూపాయల పెట్టుబడి వెనక్కి తిరిగి చిత్ర నిర్మాత చేతికి రావడంలో డిజిటల్ రైట్స్ వాటా ఎక్కువ ఉంటోంది. 'ఫ్యామిలీ స్టార్' విషయంలో అగ్ర నిర్మాత 'దిల్' రాజుకు ఆ వాటా వచ్చేసినట్లు తెలిసింది. ఆ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు తెలిసింది.
ప్రైమ్ వీడియో చేతికి 'ఫ్యామిలీ స్టార్'?
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'ఫ్యామిలీ స్టార్'. 'గీత గోవిందం' తర్వాత ఆయన హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. వీళ్లిద్దరికి తోడు 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ కూడా యాడ్ అయ్యారు. దాంతో ఓటీటీ రైట్స్ మంచి రేటు వచ్చిందట.
Amazon Prime Video bags Family Star digital streaming rights: 'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని సమాచారం. బహుశా... ఇవాళ ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
థియేట్రికల్ బిజినెస్ మీద 'దిల్' రాజు కాన్సంట్రేషన్!
ఓటీటీ డీల్ క్లోజ్ కావడంతో 'ఫ్యామిలీ స్టార్' థియేట్రికల్ బిజినెస్ మీద 'దిల్' రాజు దృష్టి పెట్టినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో తెరకెక్కుతున్న 54వ చిత్రమిది. సోదరుడు శిరీష్ (Shirish Producer)తో కలిసి నిర్మిస్తున్నారు.
'దిల్' రాజుకు పర్మినెంట్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. కొన్ని ఏరియాల్లో సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగతా ఏరియాలను రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తారు. 'ఫ్యామిలీ స్టార్' సినిమాకూ సేమ్ సిస్టమ్ ఫాలో అవుతున్నారట. థియేట్రికల్ బిజినెస్ ద్వారా సుమారు 50 కోట్లు రావాలని 'దిల్' రాజు ఆలోచిస్తున్నారట. 'గీత గోవిందం' 65 కోట్ల షేర్ రాబట్టడంతో అంత కలెక్ట్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాకపోవచ్చు.
Also Read: 'టిల్లు స్క్వేర్' రీ రికార్డింగ్ - బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో సినిమా
ఏప్రిల్ 5న థియేటర్లలో 'ఫ్యామిలీ స్టార్'
Family Star Release Date: ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్' థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను ముందు సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. పండగ బరిలో ఎక్కువ సినిమాలు ఉండటం, అందులో 'గుంటూరు కారం' వంటి భారీ సినిమాను 'దిల్' రాజు డిస్ట్రిబ్యూట్ చేయడంతో వాయిదా వేశారు. వాయిదా వేయడం వల్ల మంచి జరిగింది. ఎన్టీఆర్ 'దేవర' వెనక్కి వెళ్లడంతో ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్' థియేటర్లలోకి వస్తోంది.
ఆల్రెడీ విడుదలైన 'ఫ్యామిలీ స్టార్' టీజర్ సూపర్ హిట్ అయ్యింది. పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. గోపీసుందర్ మరోసారి 'గీత గోవిందం' మేజిక్ రిపీట్ చేసేలా ఉన్నారు. ఈ సినిమాలో 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ రెండో హీరోయిన్. 'రామారావు ఆన్ డ్యూటీ', 'మైఖేల్' తర్వాత ఆమె నటించిన చిత్రమిది.
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి#MaheshBabu𓃵 #Rajamouli #SSMB29#SSRajamouli #RRR #Japanhttps://t.co/s1W2h3ac8O
— ABP Desam (@ABPDesam) March 19, 2024