Nishanth Paturi: మెడికల్ ఫీల్డులో పెద్ద పేరు, ఇంకా హాస్పిటల్స్ - వెంకటేష్ రెండో అల్లుడు, వియ్యంకుడి బ్యాగ్రౌండ్ తెలుసా?
Venkatesh son in law Nishanth Paturi background: విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని వివాహం నిశాంత్ పాతూరితో జరిగింది. ఇంతకీ, ఆయన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. తెలుగు చిత్రసీమలో ఆయనది పేరు ఉన్న ఫ్యామిలీ. తండ్రి రామానాయుడు, సోదరుడు డి సురేష్ బాబు అగ్ర నిర్మాతలు కాగా... అన్నయ్య కుమారుడు రానా దగ్గుబాటి పాన్ ఇండియా స్టార్. ఇటీవల వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని (Hayavahini Daggubati) వివాహం జరిగింది. ఆమె భర్త, మామగారు ఎవరో తెలుసా? వెంకీ రెండో అల్లుడు, వియ్యంకుడు ఎవరో తెలుసా?
తండ్రి కుమారులు ఇద్దరూ డాక్టర్లే!
హయ వాహిని భర్త, వెంకటేష్ రెండో అల్లుడు నిశాంత్ పాతూరి (Nishanth Paturi) డాక్టర్. మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ (Venkatesh Daggubati son in law Nishanth profession). చిన్న వయసులో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన తండ్రి పేరు పీవీ రామారావు. ఆయన కూడా డాక్టర్.
పీవీ రామారావు అంటే ప్రేక్షకులు గుర్తు పట్టడం కాస్త కష్టం కావచ్చు. ప్రజలకూ పెద్దగా తెలియదు. అయితే, ఆంధ్రా హాస్పిటల్స్ (విజయవాడ) డైరెక్టర్లలో ఒకరైన పీవీ రామారావు అంటే సామాన్యులతో పాటు సినీ పరిశ్రమ ప్రముఖులు సైతం వెంటనే గుర్తు పడతారు. ఆయన గొప్ప మనసును, ఆశయాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు.
వైద్య విద్యలో ఎండీ చేసిన పీవీ రామారావు... విదేశాల్లో పలు పీజీలు, పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. చిన్నారుల ప్రాణాలు కాపాడటం కోసం నిరంతరం ఆయన శ్రమిస్తున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్ (విజయవాడ)లో చిల్డ్రన్ సర్వీసెస్ విభాగం అధిపతిగా పీవీ రామారావు సేవలు అందిస్తున్నారు. నిరుపేద చిన్నారుల ఆరోగ్యంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సహాయ సహకారాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో 76 మంది చిన్నారులకు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించారు పీవీ రామారావు. ఈ విధంగా ఏడేళ్లలో సుమారు మూడు వేలకు పైగా ఆపరేషన్లు చేశారు. పీవీ రామారావు, ఆంధ్రా హాస్పిటల్స్ చేస్తున్న సేవలు మహేష్ బాబుకు తెలియడంతో వాళ్ళతో చేతులు కలిపారు.
పీవీ రామారావు ఫ్యామిలీకి పెద్దగా హంగు ఆర్భాటాలు నచ్చవు. అందుకని, కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో నిశాంత్ - హయ వాహిని వివాహాన్ని జరిపించారు. పేరున్న ఫ్యామిలీకి కోడలిగా వెంకటేష్ తన కుమార్తెను పంపించారు అన్నమాట.
Also Read: 'టిల్లు స్క్వేర్' రీ రికార్డింగ్ - బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో సినిమా
వెంకటేష్ ఫ్యామిలీ విషయానికి వస్తే... ఆయన భార్య పేరు నీరజ. ఆమె కూడా హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. వెంకటేష్, నీరజ దంపతులకు నలుగురు పిల్లలు. అందులో మొదట ముగ్గురు అమ్మాయిలు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం 2019లో జరిగింది. ఆమెకు ఫుడ్ బ్లాగర్. ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో సోషల్ మీడియా వేదికగా ఫుడ్ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. భర్తతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యారు. రెండో కుమార్తె హయ వాహిని పెళ్లి ఇటీవల జరిగింది. ఆఖరి అమ్మాయి పేరు భావన. ఏకైక కుమారుడి పేరు అర్జున్.
Also Read: డజను సినిమాలు, అరడజను వెబ్ సిరీస్‌లు - ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏం వస్తున్నాయంటే?