DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
DGCA Committee Report: ఇండిగో విమానయాన సంస్థలో 5 డిసెంబర్ 2025న జరిగిన పరిణామాలపై DGCA కమిటీ విచారణ జరిపింది. నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.

DGCA Committee Report: ఇండిగో సమస్యపై DGCA ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వంకు తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీకి డిసెంబర్ 5, 2025న ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో జరిగిన ఆపరేషనల్ లోటుపాట్లు, విమానాల రద్దు పరిణామాలపై లోతుగా దర్యాప్తు చేసింది. ఒకేసారి వేల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో ఒక్కసారిగా విమానయాన రవాణా వ్యవస్థ గందరగోళానికి గురైంది. దీంతో DGCA విచారణ కోసం నలుగురు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది, ఇందులో జాయింట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కె. బ్రహ్మణే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కెప్టెన్ కపిల్ మంగ్లిక్ (SFOI) కెప్టెన్ లోకేష్ రాంపాల్ (FOI) ఉన్నారు.
నివేదిక ప్రస్తుతం గోప్యంగా ఉంది
డీజీసీఏ సమాచారం ప్రకారం, కమిటీ తన నివేదికను తయారు చేసి పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించింది. నివేదిక ప్రస్తుతం గోప్యంగా ఉంది. కమిటీ తన నివేదికను సమర్పించడానికి డిసెంబర్ 26, 2025 వరకు సమయం ఇచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో విమానాలు ప్రభావితం కావడానికి గల కారణాలు, వాటి మూల కారణాలను పరిశోధించమని ఈ కమిటీకి బాధ్యత అప్పగించారు.
కమిటీ నివేదిక ప్రధానంగా ఈ కింది ప్రశ్నలను ప్రస్తావిస్తుంది:
1. ఇంత పెద్ద సంఖ్యలో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ఎందుకు ఆలస్యం అయ్యాయి?
2. ఎయిర్‌లైన్ ప్రణాళిక, మ్యాన్‌పవర్ నిర్వహణ పేలవంగా ఉందా ?
3. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (FDTL) అమలులో నిర్లక్ష్యం ఉందా?
4. ఇండిగో క్రూ ప్లానింగ్, రోస్టర్ మేనేజ్‌మెంట్‌ను సకాలంలో అమలు చేయడంలో విఫలమైందా?
5. DGCA ఆదేశాలను సరిగ్గా పాటించారా?
6. ఆపరేషనల్ వైఫల్యాలకు ఎవరు బాధ్యులు?
ఇండిగో సంక్షోభం లక్షల మంది ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెట్టింది
భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగో, డిసెంబర్ 2025లో భారీ షెడ్యూల్ సంక్షోభాన్ని ఎదుర్కొంది, దీని కారణంగా వేలాది విమానాలు రద్దు అయ్యాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో లక్షల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. గందరగోళం నెలకొంది. ఇండిగో 60% కంటే ఎక్కువ దేశీయ విమానయాన సంస్థలను కలిగి ఉంది, దీనివల్ల విమాన ప్రయాణంపై గణనీయమైన ప్రభావం పడింది.
డిసెంబర్‌లో ఇండిగో సంక్షోభం చాలా రోజులు కొనసాగిన తర్వాత, ప్రభుత్వం విమానాలపై విధానం పరిశీలనలోకి వచ్చింది. ప్రభుత్వం గుత్తాధిపత్య విధానం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం విమానయాన రంగంలో బలమైన పర్యావరణ వ్యవస్థకు కట్టుబడి ఉందని తెలిపారు.
ఇండిగో డిసెంబర్ 2025లో భారీ షెడ్యూల్ సంక్షోభాన్ని ఎదుర్కొంది, దీని కారణంగా వేల విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. దాదాపు వారం రోజుల పాటు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ప్రయాణికులు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ అనేక విమానాలు రద్దు కావడంతో గందరగోళం నెలకొంది. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. దీని కారణంగా ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.





















