OTT: ఓ మై గాడ్.. అద్దాల డోమ్‌లో బందీలైన జనాలు ఎటూ పోలేరు, అసలు అది ఎలా జరిగింది? సస్పెన్స్‌తో పిచ్చెక్కించే సీరిస్ ఇది
సైన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘అండర్ ది డోమ్’. సడెన్ గా ఓ పట్టణాన్ని కప్పేసిన ఓ డోమ్ తో జనాలు ఎలా ఇబ్బందులు పడ్డారో ఇందులో చూపించారు. ఇంతకీ ఆ డోమ్ నుంచి టౌన్ ప్రజలు బయటపడతారా?
Best Web Series on OTT: బ్రియాన్ కె వాఘన్ తెరకెక్కించిన సైన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అండర్ ది డోమ్’ మూడు సీజన్లు, 39 ఎపిసోడ్లుగా ప్రసారం అయ్యింది. CBS నెట్ వర్క్ ఈ సిరీస్ కు సంబంధించిన తొలి భాగాన్ని జూన్ 24, 2013లో విడుదల చేసింది, మూడో సీజన్ ను సెప్టెంబర్ 10, 2015న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. స్టీఫెన్ కింగ్ రచించిన ‘అండర్ ది డోమ్’ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఇందులో తొలి భాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకాశం నుంచి కిందికి భూమ్మిదికి వచ్చిన డోమ్
సిరీస్ ప్రారంభంలో బార్బీ అనే వ్యక్తిని చూపిస్తారు. అతడు ఓ అడవిలో ఓ మనిషి డెడ్ బాడీని పాతిపెడుతూ కనిపిస్తాడు. అతడికి కూడా చాలా గాయాలుంటాయి. చనిపోయిన వ్యక్తి, బార్బీ ఇద్దరు కొట్టుకుని ఉంటారు. ఇంతకీ బార్బీ అతడిని ఎందుకు చంపాడు? అనేది తెలియాల్సి ఉంటుంది. బార్బీ ఆ బాడీని పాతేసి.. చెస్టర్స్ మిల్ అనే టౌన్‌కు వెళ్తాడు. అయితే బార్బీది ఆ టౌన్ కాదు. అతడు శవాన్ని పాతేసి వెళ్తుంటే కొన్ని ఆవులు అతడి కారుకు అడ్డుగా వస్తాయి. వాటిని తప్పించబోయి. పశువుల షెడ్ లోకి కారు పోనిస్తాడు. కారుకు కాస్త డ్యామేజ్ అవుతుంది. ఈ సంఘటన జరిగిన కాసేపటికే చెస్టర్స్ మిల్ లో పెద్ద భూకంపం వస్తుంది. అక్కడి జనాలు చాలా భయపడతారు. అదే సమయంలో ఏదో గుర్తు తెలియని అబ్జెక్ట్ ఆకాశం నుంచి భూమ్మిదికి వస్తుంది. దాన్ని బార్బీ కూడా చూస్తాడు. ఆ వస్తువు భూమ్మీదకు వచ్చిన కాసేపటికి భూకంపం తగ్గిపోతుంది.
అయితే, ఆ వస్తువు అక్కడున్న ఆవు మీద పడటంతో అది రెండు ముక్కలు అవుతుంది. అది చూసి బార్బీకి బాగా భయం వేస్తుంది. ఇంతకీ అదేంటో చూడాలని ఆవు దగ్గరికి వెళ్లాలి అనుకుంటాడు. అయితే, అక్కడికి వెళ్లకుండా ఓ కనిపించని వస్తువు ఏదో అడ్డుకుంటుంది. అది చాలా షార్ఫ్ గా ఉంటుంది. ఇంటిని కూడా రెండు ముక్కలు చేస్తుంది. బార్బీ ఎలా ఉన్నాడో చూసేందుకు జో అనే కుర్రాడు వస్తాడు. అతడు కూడా ఇన్ విజుబుల్ వాల్ ను చూసి షాక్ అవుతాడు. అదే సమయంలో చెస్టర్స్ మిల్ లో కరెంటు, ఫోన్లు, ఇంటర్నెట్ పని చేయవు. ఆ టౌన్ కు రావాల్సిన శాటిలైట్ సిగ్నల్స్ ను ఆ ఇనివిజుబుల్ వాల్ అడుడకుంటుందని బార్బీకి అర్థం అవుతుంది.
అప్పుడు ఈ టౌన్ మీది నుంచి వెళ్తున్న ఓ విమానం ఆ వాల్‌కు తగిలి క్రాష్ అవుతుంది. నిజానికి అది వాల్ కాదు.. డోమ్. ప్లేన్ క్రాష్ చూసి అక్కడి జనాలు భయపడతారు. అక్కడ ఎఫ్ ఎమ్ స్టేషన్ లోని ఇద్దరు జాకీలు మాత్రం డోమ్ కి బయట ఉన్న వాళ్లతో కనెక్ట్ అయి ఉంటారు. వీళ్ల ద్వారా మాత్రమే బయట ఉన్న వాళ్లకు ఇక్కడి పరిస్థితులు తెలుస్తాయి. ప్లెయిన్ క్రాష్ అయిన దగ్గరికి ఓ ఫైర్ ఇంజిన్ వస్తుంది. దానిని డోమ్‌కు తగలకుండా బార్బీ ఆపుతాడు. అదే సమయంలో అక్కడికి పోలీసులు కూడా వస్తారు. అయితే చెస్టర్స్ మిల్ కు వచ్చే ప్రతి రోడ్డుకు అడ్డుగా ఈ డోమ్ ఉందని, దాని కారణంగా యాక్సిడెంట్స్ అవుతున్నాయని పోలీసులకు సమాచారం అందుతుంది. ఆ ప్రమాదాలను ఆపేందుకు వెంటనే అత్యవసర ప్రకటన ఇవ్వాలని అధికారులు భావిస్తారు.
మరోవైపు జూనియర్, యాంజీ అనే ఇద్దరు లవర్స్ ను చూపిస్తారు. యాంజీ ఓ వాలంటీర్ నర్సు. అదే సమయంలో జూనియర్ ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్తాడు. దానికి ఆమె ఒప్పుకోదు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. జూనియర్ చెంప మీద కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నోరే అనే అమ్మాయి తన ఇద్దరు అమ్మలతో కలిసి చెస్టర్స్ మిల్ చూసేందుకు వస్తుంది. డోమ్ కారణంగా టౌన్ కవర్ చేయబడిందని వారికి తెలియదు. అక్కడే జూలియా అనే ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ కూడా ఉంటుంది. అక్కడ ఓ లేడీ ఆమెకు ఇక్కడ ఏదో వింత వస్తువు వచ్చినట్లు చెప్తుంది.
అదే సమయంలో టౌన్ లోకి కొన్ని ప్రొపెన్ ట్యాంకర్స్ రావడాన్ని గమనిస్తారు. ఇంతకీ అవి ఎందుకు వస్తున్నాయో తెలుసుకునే పనిలో పడుతుంది. అటు అధికారులు ఎఫ్ ఎం స్టేషన్ కు వెళ్లి అత్యవసర పరిస్థితిని వివరిస్తారు. ఈ విషయాన్ని నోరే ఫ్యామిలీ కూడా వింటుంది. కానీ, అది అబద్దం అనుకుంటుంది. కానీ, ఎదురుగా వచ్చిన ట్రక్కు డోమ్ ను గుద్దుకుని ముక్కలు ముక్కలు అవుతుంది. వెంటనే నోరే ఫ్యామిలీ కారును ఆపేస్తారు.
కానీ, నోరేకు ఫిట్స్ వచ్చి అక్కడే పడిపోతుంది. పింక్ స్టార్స్ గురించి ఏదో చెప్తుంది. ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్తారు. అక్కడ మొత్తం యాక్సిడెంట్ అయిన వాళ్లే ఉంటారు. అటు రిపోర్టర్ జూలియా భర్త కూడా అక్కడే డాక్టర్ గా ఉంటాడు. అదే సమయంలో జూలియాను కలిసేందుకు హాస్పిటల్ కు వెళ్తుంది. కానీ, తను ఆ రోజు డ్యూటీకి రాలేదని చెప్తారు. హాస్పిటల్ బయట యాంజీ బార్బీని కలుస్తుంది. ఇద్దరూ సిగరెట్ కాల్చుతూ ఉంటారు. వీరిని చూసి జూనియర్ జెలస్ ఫీలవుతాడు. ప్రేమను కోపంగా మార్చుకుంటాడు.
ఇంతకీ ప్రొపైమ్ ట్యాంక్స్ ఎందుకు దాచాలి అనుకున్నారు?
అటు డోమ్ దగ్గరికి కొంత మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు వస్తారు. ఇంతకీ ఆ డోమ్ ఏంటి? అక్కడికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అని పరిశోధిస్తారు. కానీ, వారికి ఏమీ తెలియదు. టౌన్ మేయర్ బెంజిమ్, టౌన్ పోలీస్ ఆఫీసర్ చెర్రీస్ ను కలిసి ప్రొపైమ్ ట్యాంక్స్ గురించి అడుగుతాడు. వీళ్లే ఆ ట్యాంక్స్ ను టౌన్ లో దాయాలి అనుకుంటారు. అంటే వీళ్లకు ఆ డోమ్ గురించి ఏదో తెలిసే ఉంటుంది.
బార్బీ ఆ ఊరివాడు కాకపోవడంతో ఎక్కడ పడుకోవాలో తెలియక, తన కారు దగ్గరే ఉంటాడు. అప్పుడు జూనియర్ బార్బీ దగ్గరికి వచ్చి అతడితో మాట్లాడుతాడు. అదే సమయంలో బార్బీకి వార్నింగ్ ఇస్తాడు. కానీ, జూనియర్ దేని గురించి చెప్తున్నాడో అర్థం కాదు. అప్పుడే జూలియా అక్కడికి వస్తుంది. వెంటనే జూనియర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరికొంత మంది టీనేజర్స్ డోమ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అక్కడికి జో కూడా వస్తాడు. తనతో పాటు ఓ అమ్మాయిని కూడా తీసుకుని వస్తాడు. వీళ్లిద్దరు టౌన్ లోని పరిస్థితి గురించి మాట్లాడుకుంటారు. వెంటనే అతడికి ఫిట్స్ వస్తాయి. పింక్ స్టార్స్ గురించి ఏదో చెప్తాడు.
యాంజీ తిరిగి తన ఇంటికి వస్తుంది. జూనియర్ యాంజీ దగ్గరికి వచ్చి ఆమెను కిడ్నాప్ చేస్తాడు. తన డాడీ ఫామ్ హౌజ్ లోని బంకర్ కు తీసుకెళ్లి కట్టేస్తాడు. టౌన్ లో ఏం జరుగుతుందో నాకు తెలుసని చెప్తాడు. అప్పుడే బెంజిమ్ అక్కడికి వస్తాడు. అప్పుడే బెంజిమ్, జూనియర్ తండ్రీకొడుకు అని అర్థం అవుతుంది. అటు జూలియా బార్బీని ఇంటికి తీసుకొస్తుంది. రాత్రి ఇక్కడే పడుకోవాలని చెప్తుంది. ఆ ఇంట్లో జూలియా, ఆమె భర్త ఫోటో చూస్తాడు. ఆ ఫోటో చూసి వెంటనే షాక్ అవుతాడు. నిజానికి అతడు చంపి పాతి పెట్టిన వ్యక్తి తనే. అదే సమయంలో టౌన్ లో పోలీస్ ఆఫీసర్ చెర్రీస్ పెట్రోలింగ్ చేస్తాడు. అతడు డోమ్ దగ్గరికి వెళ్తాడు. వెంటనే అతడి గుండె దగ్గర ఉన్న ఫేస్ మేకర్ పేలిపోయి చనిపోతాడు.
అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ రోజు ఉదయం బార్బీ, జూలియా భర్తను కలవడానికి ఆ టౌన్ కు వస్తాడు. ఏదో పేమెంట్ గురించి మాట్లాడేందుకు వస్తాడు. కానీ, తను పేమెంట్ ఇచ్చేది లేదని బార్బీని బెదిరిస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అనుకోకుండా బార్బీ అతడిని షూట్ చేస్తాడు. వెంటనే అతడు చనిపోతాడు. యాక్సిడెంటల్ గా జరిగినా కేసు అవుతుంది కాబట్టి, ఆతడి బాడీని పాతిపెడతాడు. మరోవైపు బెంజిమ్ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వెళ్తాడు. అక్కడికి పోలీస్ ఆఫీస్ లిండా వచ్చి, చెర్రీస్ చనిపోయాడని చెప్తుంది. వెంటనే ఆయన, మార్చురీ దగ్గరికి వెళ్తాడు. మరోవైపు యాంజీ ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తుంది. అప్పుడే జూనియర్ బంకర్ లోకి వచ్చి యాంజీని చైన్ తో కట్టేస్తాడు. ఈ డోమ్ రావడం వల్లే యాంజీ నన్ను రిజెక్ట్ చేస్తుంది. ఇది వెళ్లిపోతే మళ్లీ తను నన్ను ప్రేమిస్తుందని జూనియర్ భావిస్తాడు. నిజానికి జూనియర్ కు మెంటల్ హెల్త్ సమస్యలు ఉంటాయి.
ప్రొపైమ్ ఫైల్ లో ఏముంది?
అటు లెస్టర్ అనే మార్చురీ అధికారి చెర్రీస్ చనిపోయాడని తెలుసుకుని షాక్ అవుతాడు. వాళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్. అప్పుడే బెంజిమ్ లెస్టర్ తో ప్రొపైమ్ గురించి ఏదో మాట్లాడుతాడు. బెంజిమ్, లెస్టర్, చెర్రీస్ కలిసి ఏదో తప్పు చేస్తున్నారని అర్థం అవుతుంది. చెర్రీస్ చనిపోవడంతో వారి సీక్రెట్స్ బయటకు పడతాయేమోనని భయపడతారు. ఆ సమయంలో లిండా అనే పోలీసు అధికారి పీఎస్ కు వస్తుంది. అక్కడ బెంజిమ్ చెర్రీస్ ఆఫీస్ లో దేనికోసమో వెతుకుతూ కనిపిస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. చెర్రీస్ కు సంబంధించిన ఓ ఫైల్ ను తీసుకెళ్లేందుకు వచ్చానని చెప్తాడు. ఆమె అతడి మాటలు నమ్ముతుంది. కానీ, అతడు ప్రొపైమ్ కు సంబంధించిన పేపర్ వర్క్ కోసం అక్కడికి వస్తాడు. ఆ పేపర్ వర్క్ ఫైల్ ఎవరికైనా తొరికితే తనకు లెస్టర్ కు సమస్యలు వస్తాయని భావిస్తాడు. కానీ, అక్కడ ప్రొఫైమ్ కు సంబంధించిన పేపర్స్ లేకపోవడంతో అతడి ఇంట్లో ఉంటాయేమోనని అనుమానిస్తారు. వెంటనే వాళ్లు అతడి ఇంటికి వెళ్తారు.
మరోవైపు జూలియా FM ఆఫీస్ కు వెళ్తుంది. డోమ్ బయట ఉన్న పోలీసుల మాటలు వినవచ్చని తెలుసుకుంటుంది. సైనికులు డోమ్ కింద తవ్వకాలు జరిపి లోపలికి రావాలని ప్రయత్నించినట్లు తెలుసుకుంటుంది. కానీ కుదరలేదని అర్థం అవుతుంది. ఈ విషయాన్ని జూలియా టౌన్ లోని వారికి చెప్తుంది. పట్టణంలోని వాళ్లు బయపడుతారు. అదే సమయంలో పరిశోధకు డోమ్ ను పరిశీలిస్తుంటారు. దానిపై నీళ్లు పోసి ఏం జరుగుతుందో చూస్తారు. కానీ, ఏం గుర్తించరు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జో డోమ్ చాలా మందంగా ఉన్నట్లు గుర్తిస్తారు.
అటు లెస్టర్, చెర్రీస్ ఇంట్లోకి వెళ్లి ప్రొపైన్ దిగుమతికి సంబంధించిన ఫేపర్స్ కోసం వెతుకుతాడు. వాటిని ఓ డ్రాయర్ కింద కనిపెట్టి తగలబెడతాడు. అనుకోకుండా చెర్రీస్ ఇంటికి మంటలు అంటుకుంటాయి. వెంటనే అక్కడికి చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో బెంజిమ్ ఓ ప్రొక్లెయినర్ ను తీసుకొచ్చి చెర్రీస్ ఇంటిని పడగొడతాడు. అందరూ రిలాక్స్ అవుతారు. డోన్ గురించి మాత్రం ఎవరికీ ఏం తేలియదు. ఇంతకీ ఈ డోమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? అనేది మాత్రం తొలి సీజన్ లో చూపించారు.
Also Read: ‘జనక అయితే గనక’ టీజర్ - పిల్లల స్కూల్ ఫీజులపై సుహాస్ సెటైర్ - స్మశానానికి, ఎల్‌కేజీకి లింకేంటీ?