Superman OTT Release Date: మనందరి 'సూపర్ మ్యాన్' వచ్చేస్తున్నాడు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Superman OTT Platform: డీసీ యూనివర్స్ ఫ్రాంచైజీ లేటెస్ట్ మూవీ 'సూపర్ మ్యాన్' త్వరలోనే ఓటీటీలోకిి రాబోతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ జేమ్స్ గన్ స్వయంగా వెల్లడించారు.

David Corenswet's Superman OTT Release On Amazon Prime Video: అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా పిల్లల నుంచి పెద్దల వరకూ 'సూపర్ మ్యాన్' మూవీస్, వెబ్ సిరీస్‌లు అంటే ఉండే క్రేజే వేరు. డీసీ యూనివర్స్ ఫ్రాంజైజీలో భాగంగా వస్తోన్న ఈ మూవీస్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేశాయి. 1978 నుంచి 'సూపర్ మ్యాన్' మూవీస్ ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది.
డైరెక్టర్ జేమ్స్ గన్ తెరకెక్కించిన 'సూపర్ మ్యాన్' మూవీ జులై 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, గత చిత్రాల మాదిరిగా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. భారత్‌లోనూ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.
ఆ ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ మూవీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ నెల 15 నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటే యాపిల్ టీవీ, ఫాండంగో ఓటీటీల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ జేమ్స్ గన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో వెల్లడించారు. 'ఈ శుక్రవారం సూపర్ మ్యాన్ మీ ఇళ్లకు వస్తున్నాడు. ఈలోపు థియేటర్లలో అందుబాటులో ఉంటే చూసేయండి.' అని పేర్కొన్నారు.
#Superman is coming to your homes this Friday, 8/15. Available now for pre-order. Or catch it while it's still in theaters! pic.twitter.com/xziRucg3xG
— James Gunn (@JamesGunn) August 12, 2025
Also Read: 'కూలీ' సినిమాకు క్లైమాక్స్ కీలకం... రజనీపై భారం వేసిన దర్శకుడు - దుబాయ్ రివ్యూ ఎలా ఉందంటే?
స్టోరీ ఏంటంటే?
జహ్రాన్ పూర్‌పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా సూపర్ మ్యాన్ (కొరెన్స్‍వెట్) దాన్ని సమర్థంగా అడ్డుకుంటాడు. టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్ (నికలస్ హోల్ట్) తయారుచేసిన హ్యామర్ ఆఫ్ బొరేవియా చేతిలో ఓడిపోతాడు. సూపర్ మ్యాన్ వల్ల ప్రజలకు ఆపద ఉందని... అతన్ని అడ్డుకోవాలంటూ ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తాడు లెక్స్ లూథర్. సూపర్ మ్యాన్ పుట్టుపూర్వోత్తరాలతో పాటు అతను భూమ్మీదకు రావడానికి గల కారణాలను ఓ వీడియో రూపంలో రిలీజ్ చేసి అందరికీ మాయమాటలు చెబుతాడు. దీంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అది నిజమేనని నమ్మి... సూపర్ మ్యాన్‌ను అసహ్యించుకుంటారు.
మరి లెక్స్ లూథర్‌ను సూపర్ మ్యాన్ ఎలా అడ్డుకున్నాడు? ప్రజల వద్ద తన విశ్వసనీయతను మళ్లీ ఎలా నిరూపించుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















