By: ABP Desam | Updated at : 15 Apr 2022 08:35 PM (IST)
Image Credit: ahaTamil
తెలుగులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓటీటీ యాప్ ‘ఆహా’. ఇప్పుడు ‘ఆహా’ తమిళంలోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కేవలం ఏడాది వ్యవధిలో మిలియన్ పైగా సబ్‌స్క్రైబర్లను సాధించి ‘ఆహా’ అనిపించిన అల్లూవారి ఓటీటీలో వారానికో కొత్త చిత్రం లేదా వెబ్ సీరిస్ విడుదలవుతుంది. తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా మలయాళం, తమిళం, కన్నడలో మాంచి క్రేజ్ సంపాదించిన సినిమాలను కూడా తెలుగులోకి అనువాదిస్తూ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడం ఈ ఓటీటీ ఫార్ములా. ఇప్పుడు ఇదే ప్లాన్‌తో తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.
దక్షిణాదిలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీలతో పోటీని తట్టుకుంటూ నిలిచిన ‘ఆహా’.. బుధవారం నుంచి తమిళ ప్రేక్షకుల ఇంట్లో అడుగుపెట్టింది. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ‘ఆహా తమిళ్ ఓటీటీ’ని లాంఛనంగా ప్రారంభించారు నిర్వాహకులు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ చేతుల మీదుగా ‘ఆహా తమిళ్’ ఓటీటీని ప్రారంభించారు. ఈ ఓటీటీకి హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా శింబుతో ఓ యాడ్ కూడా ప్రమోట్ చేయించారు.
Also Read: 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?
Also Read: 'బీస్ట్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో
Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్
ఓటీటీలోకి ‘కణ్మని రాంబో ఖతీజా’, వెరైటీగా ప్రకటించిన విఘ్నేష్!
She-Hulk Trailer: హల్క్ చెల్లి ‘షి-హల్క్’ వచ్చేస్తోంది, తెలుగు ట్రైలర్ చూశారా?
Prey Teaser: ‘ప్రే’ టీజర్ చూశారా? మరింత భయానకంగా ప్రిడేటర్ ప్రీక్వెల్
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !