News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Beast Review- 'బీస్ట్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

Beast Movie Review In Telugu : తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన 'బీస్ట్' సినిమా ఈ రోజు విడుదలైంది. సినిమా ఎలా ఉంది?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ: 'బీస్ట్'
రేటింగ్: 2/5
నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్, యోగి బాబు తదితరులు
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస 
సంగీతం: అనిరుద్ రవిచందర్ 
నిర్మాత: కళానిధి మారన్ 
రచన, దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్ 
విడుదల తేదీ: ఏప్రిల్ 13, 2022

తమిళ హీరో విజయ్ (Vijay) నటించిన 'బీస్ట్' (Beast Movie) నేడు తెలుగులోనూ విడుదలైంది. 'అరబిక్ కుతు' సాంగ్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) పాటకు తోడు ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. మరి, సినిమా (Beast Review) ఎలా ఉంది? తెలుగులో విజయ్‌కు మరో విజయం అందించిందా? 'కో కో కోకిల', 'వరుణ్ డాక్టర్' సినిమాలతో తెలుగులోనూ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విజయాలు సొంతం చేసుకున్నారు. 'బీస్ట్'తో ఆయన హ్యాట్రిక్ (Beast Telugu Movie Review) అందుకున్నారా?

కథ: తీవ్రవాదులు చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్‌ను హైజాక్ చేస్తారు. ఆ సమయంలో కేంద్ర హోం మంత్రి భార్య, కుమార్తె సహా సుమారు 250 మంది సామాన్య ప్రజలు... మాజీ రా ఏజెంట్ వీర రాఘవ (విజయ్) కూడా మాల్‌లో ఉంటారు. జైల్లో ఉన్న తన సోదరుడు, తీవ్రవాద నాయకుడు ఒమర్ ఫరూఖ్‌ను విడుదల చేయమని హైజాక్ చేసిన టీమ్ లీడర్ డిమాండ్ చేస్తాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఫరూఖ్‌ను పట్టుకున్నది వీర రాఘవే. అతడు డేరింగ్ అండ్ డెవిల్ ఏజెంట్. మాల్‌లో వీర రాఘవ ఏం చేశాడు? ఫ‌రూఖ్‌ను విడుదల చేయబోతున్నారనే విషయం తెలిశాక... ఎటువంటి విధ్వంసం సృష్టించాడు? ప్రజలను ఎలా కాపాడాడు? ఆ తర్వాత ఏం చేశాడు? టోటల్ ఎపిసోడ్‌లో ప్రభుత్వం పాత్ర ఏమిటి? వీర రాఘవకు సపోర్ట్ ఏమైనా చేసిందా? లేదా? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ: స్టార్ ఇమేజ్ ఉన్న కమర్షియల్ కథానాయకుడితో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా తీయడం కత్తి మీద సాము లాంటి వ్యవహారం. అందులోనూ సీరియస్ ఇష్యూ తీసుకుని మధ్యలో నవ్వించడం అంత సులభమైన విషయం కాదు. ఈ రెండు సవాళ్లనూ దర్శకుడు నెల్సన్ ఒకేసారి టేకప్ చేశారు. విజయ్ లాంటి స్టార్ హీరోతో సింపుల్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా తీయాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఆయన పూర్తిగా విజయం సాధించారా? లేదా? అంటే.... 'లేదు' అని చెప్పాలి. 'తీవ్రవాదులు మాల్‌ను హైజాక్ చేశారు. అందులో మాజీ రా ఏజెంట్ ఉన్నాడు. తీవ్రవాదులను అంతం చేసి ప్రజలను అతడు ఎలా కాపాడాడు' అనేది 'బీస్ట్' కాన్సెప్ట్!

దర్శకుడు నెల్సన్‌కు మూడో చిత్రమిది. ఇంతకు ముందు రెండు సినిమాలు 'కో కో కోకిల', 'బీస్ట్' డార్క్ కామెడీ ఫిల్మ్స్. అతడు బలం నవ్వించడం! తీవ్రవాదులు, రా ఏజెంట్ వంటి సీరియస్ కాన్సెప్ట్ తీసుకోవడంతో నవ్వించే స్కోప్ తగ్గింది. పైగా, విజయ్ లాంటి స్టార్ హీరో ఉండటంతో కామెడీ కంటే హీరోయిజం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. దాంతో అటు యాక్షన్, ఇటు కామెడీ... రెండిటినీ బ్యాలెన్స్ చేయడంలోనూ, ఆకట్టుకునేలా కథను చెప్పడంలోనూ ఫెయిల్ అయ్యారు. 

నిజం చెప్పాలంటే... ఈ సినిమాకు హీరోయిన్ అవసరం లేదు. విజయ్, స్టార్ హీరో అంటే హీరోయిన్ కంపల్సరీ అని ఫిక్స్ అవ్వడంతో పూజా హెగ్డేను తీసుకున్నారు. సినిమాలో ఒక పాట, సినిమా అయ్యాక మరో పాట... రెండు మూడు సన్నివేశాల్లో కనిపించడం మినహా పూజా హెగ్డే పాత్రకు ఇంపార్టెన్స్ లేదు. స్టార్ హీరోని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయడంతో కొన్ని సన్నివేశాలు సినిమాలో ఇరికించారని తెలుస్తూ ఉంటుంది. అవి సినిమా నిడివి పెంచాయి తప్ప... ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ఇక, లాజిక్కుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దర్శకుడు వాటిని గాలికి వదిలేశారు. సినిమాలో సస్పెన్స్ లేదు, థ్రిల్ లేదు, ఎమోషన్ లేదు. 

ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా తీయడంలో దర్శకుడు ఫెయిలైనా... టెక్నికల్ టీమ్ నుంచి మంచి అవుట్‌పుట్‌ తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆల్రెడీ 'అరబిక్  కుతు' సాంగ్ పాపులర్. కథలో సందర్భానుసారంగా వచ్చిందా? లేదా? అనేది పక్కన పెడితే... ఆ పాటను చిత్రీకరించిన విధానం బావుంది. అనిరుద్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతమూ బావుంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ కూడా సూపర్! కొన్ని యాక్షన్ సీన్స్‌ను స్టయిలిష్‌గా డిజైన్ చేశారు. అనవసరపు సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే బావుండేది. ప్రొడక్షన్ డిజైన్, వేల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు రాజీ పడలేదని ప్రతి ఫ్రేమ్‌లోనూ కనపడింది.

నటీనటుల విషయానికి వస్తే, విజయ్ తన పాత్రకు న్యాయం చేశారు. మేనరిజమ్స్, యాటిట్యూడ్ చక్కగా చూపించారు. ఆయన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ సీన్స్ డిజైన్ చేయడంతో ఈజీగా చేసేశారు. యాక్షన్స్ సీన్స్‌లో 'బీస్ట్'గా ఉన్నారు. ఎటువంటి కనికరం లేకుండా తీవ్రవాదులను ఊచకోత కోశారు. ముందు చెప్పినట్టు... పూజా హెగ్డే పాత్రకు ఇంపార్టెన్స్ లేదు. తన పరిధి మేరకు చేశారు. విజయ్‌తో పాటు డ్యాన్స్‌లో గ్రేస్ చూపించారు. యోగిబాబు, వీటీవీ గణేష్, రెడిన్ కింగ్‌స్లే తదితరులు ఉన్నా ఆశించిన రీతిలో నవ్వులు లేవు. చాలా రోజుల తర్వాత అంకూర్ వికల్ సౌత్ స్క్రీన్ మీద కనిపించారు. తీవ్రవాదిగా కనిపించింది రెండు మూడు సన్నివేశాలైనా... మలయాళ నటుడు షైన్ టామ్ నటన ఆకట్టుకుంటుంది. తెలుగు నటుడు పృథ్వీ ప్రారంభంలో రెండు సన్నివేశాల్లో కనిపించారు. 

Also Read: 'గని' సినిమా రివ్యూ: బాక్సింగ్ పంచ్ అదిరిందా? లేదా?

'నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' - ఈ డైలాగ్ మహేష్ బాబు చెబితే తెలుగునాట థియేటర్లలో విజిల్స్ పడతాయి. ఒక లెవెల్ హీరోయిజం ఉంటుంది. మరి, విజయ్ చెబితే? 'పోకిరి'ని తమిళంలో విజయ్ రీమేక్ చేశారు కాబట్టి... అక్కడ ఆయన ఫ్యాన్స్‌కు నచ్చవచ్చు. ఇక్కడ కష్టమే. 'బీస్ట్' కూడా అంతే! స్టయిలిష్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో విజయ్ ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు ఎక్కువ. సగటు తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు తక్కువ. విజయ్ వీరాభిమానుల కోసమే 'బీస్ట్'. తెలుగు ప్రేక్షకులు సినిమా చూడటం కష్టమే.

Also Read: 'కథ కంచికి మనం ఇంటికి' రివ్యూ: చితకొట్టుడుతో త్రిగుణ్ మీద పడిన మచ్చ పోతుందా?

Published at : 13 Apr 2022 11:20 AM (IST) Tags: Pooja hegde Vijay ABPDesamReview Beast Review Beast Movie Review Beast Telugu Movie Review Beast Movie Review in Telugu Beast Review In Telugu Telugu Review Beast Vijay Beast Telugu Review

ఇవి కూడా చూడండి

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Hi Nanna Review - హాయ్ నాన్న ఆడియన్స్ రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా? 

Hi Nanna Review - హాయ్ నాన్న ఆడియన్స్ రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా? 

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

టాప్ స్టోరీస్

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!

Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!

Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!