Balu Gani Talkies: బాలయ్య వీరాభిమానిగా 'బాలు గాని టాకీస్' హీరో - కొత్త సినిమా అనౌన్స్ చేసిన ఆహా
Aha Original Movie: ఆహా ఓటీటీ వేదిక కొత్త ఒరిజినల్ ఫిల్మ్ అనౌన్స్ చేసింది. ఆ పోస్టర్ చూస్తే... మూవీ టైటిల్ అంటే ముందు అందరి చూపు 'జై బాలయ్య' మీదకు వెళుతుంది.
Jai Balayya slogan on Aha Original film Balu Gani Talkies movie poster: జై బాలయ్య... తెలుగు పేక్షకులకు ఇప్పుడు ఇదొక ఎమోషన్. థియేటర్లు, పబ్బులతో పాటు పార్టీలు పబ్లిక్ మీటింగ్లు... ఎక్కడైనా సరే 'జై బాలయ్య' స్లోగన్ వినపడితే గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం జై కొడుతున్నారు. అందరితో శృతి కలుపుతున్నారు. ఇప్పుడు ఆ స్లోగన్ మన సినిమాల్లో కూడా వినబడుతోంది. ఆహా ఓటీటీ వేదిక అనౌన్స్ చేసిన కొత్త ఒరిజినల్ పోస్టర్ మీద సైతం అందరి చూపు ఆ స్లోగన్ మీదకు వెళ్లేలా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
'బాలు గాని టాకీస్' పోస్టర్ మీద 'జై బాలయ్య'
తెలుగు డిజిటల్ ఆడియన్స్ కోసం డిఫరెంట్ గేమ్ షోస్, రియాలిటీ షోస్, ఒరిజినల్ కంటెంట్ సినిమాలతో పాటు థియేట్రికల్ రిలీజ్స్ అందిస్తున్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ 'ఆహా'. ఇవాళ కొత్త సినిమా 'బాలు గాని టాకీస్' అనౌన్స్ చేసింది. ఆ పోస్టర్ మీద 'జై బాలయ్య' అని రాసి ఉంది. అదీ సంగతి!
సినిమాలో హీరో పేరు బాలు. అతడు బాలకృష్ణకు వీరాభిమాని. అతని థియేటర్ 'బాలు గాని టాకీస్'లో బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాలు ప్రదర్శిస్తూ ఉంటారు. థియేటర్ ఓనర్ బాలయ్య వీరాభిమాని, పైగా వేసేది అన్నీ బాలకృష్ణ సినిమాలే. అతడు ఫుల్ హ్యాపీ. మరి, అతని ప్రయాణంలో ఒడిదుడుకులు ఏమిటి? అనేది తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి.
Also Read: నితిన్, నాగ చైతన్య సినిమాలపై గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ - ఆ హీరోలు ఎప్పుడు ఏం చేస్తారో?
అతి త్వరలో, మీ అభిమాన 'బాలుగానీ టాకీస్' లో!
— ahavideoin (@ahavideoIN) July 22, 2024
అందరూ జై బాలయ్య అంటూ రెడీ అయిపోండి!!#BaluGaniTalkies #AnAhaOrginialFilm @riseeastcre @kuncheraghu @SaranyaSharma_ pic.twitter.com/it7ylr8VMT
'బాలు గాని టాకీస్'లో హీరో హీరోయిన్లు ఎవరంటే?
Balu Gani Talkies movie cast and crew: ఆహా ఒరిజినల్ ఫిల్మ్ 'బాలు గాని టాకీస్'కు విశ్వనాథన్ ప్రతాప్ దర్శకుడు. ఈ సినిమాను శ్రీనిధి సాగర్, పి రూపక్ ప్రణవ్ తేజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, హీరో హీరోయిన్ల విషయానికి వస్తే...
'బాలు గాని టాకీస్'లో శివ రామ చంద్రవరపు (Shiva Rama Chandravarapu) హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా యంగ్ హీరోయిన్ శ్రావ్య శర్మ (Saranya Sharma) ఎంపిక అయ్యారు. ఇంకా ఈ సినిమా రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి, శేఖర్ ఇతర ప్రధాన తారాగణం.
Also Read: మిస్టర్ బచ్చన్' రిలీజ్ డేట్ ఫిక్స్ - బాక్సాఫీస్ బరిలో విక్రమ్ vs రవితేజ vs రామ్
'బాలు గాని టాకీస్' సినిమాకు సమ్రన్ (Smaran) స్వరాలు అందిస్తుండగా... ఆదిత్య బీఎన్ నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. బాలూ శాండిల్యస ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్: అశ్వానాథ్ బైరి, స్క్రీన్ ప్లే: అశ్విత్ గౌతమ్.
Also Read: రవితేజ కొత్త సినిమా యంగ్ హీరోకి విలన్ ఛాన్స్