అన్వేషించండి

Ravi Teja: రవితేజ కొత్త సినిమా యంగ్ హీరోకి విలన్ ఛాన్స్ - విక్రమ్ రాథోడ్ రేంజ్‌ రోల్‌తో!

RT75 Movie: మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఆర్‌టి 75కు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇది. అందులో విలన్ రోల్ ఓ యంగ్ హీరోకి దక్కింది.

Ravi Teja 75th Film Updates: ఒకరికి ఛాన్స్ ఇచ్చే ముందుకు సక్సెస్, ఫెయిల్యూర్ చూడటం అనేది రవితేజ డిక్షనరీలో లేదు. టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, దర్శక రచయితలకు ఆయన అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడూ అంతే... తన కెరీర్‌లో ల్యాండ్ మార్క్ ఫిల్మ్ RT75ను కొత్త దర్శకుడి చేతిలో పెట్టారు. ఆ సినిమా విలన్ రోల్ ఓ యంగ్ హీరోకి ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే... 

రవితేజ సినిమాలో నవీన్ చంద్రకు ఛాన్స్!
Actor Naveen Chandra plays antagonist in RT75: మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ సంస్థలు నిర్మిస్తున్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. దీనితో యువ రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంతకు ముందు 'సామజవరగమన'తో పాటు పలు హిట్ సినిమాలకు ఆయన రచనా విభాగంలో పని చేశారు. 'వాల్తేరు వీరయ్య'కు మాటలు రాశారు. బాలకృష్ణ - బాబీ కొల్లి సినిమాకూ సంభాషణలు అందిస్తున్నారు. ఇప్పుడీ రవితేజ సినిమా మీద పూర్తి దృష్టి పెట్టారు. ఈ సినిమాలో విలన్ ఎవరనేది కూడా ఫైనలైజ్ చేశారు. 

రవితేజ సినిమాలో విలన్ రోల్ చేసే ఛాన్స్ యంగ్ హీరో నవీన్ చంద్రకు దక్కింది. ఆయన నెగిటివ్ షేడ్ ఉన్న రోల్స్ చేయడం కొత్త కాదు. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ'లో చేశారు. ఇప్పుడు అటువంటి భారీ సినిమా మరొకటి ఆయనకు వచ్చింది. ప్రజెంట్ 'గేమ్ ఛేంజర్' సినిమాలోనూ నవీన్ చంద్ర నటిస్తున్నారు. అందులో ఆయన ఎటువంటి పాత్రలో కనిపించనున్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Also Read: నితిన్, నాగ చైతన్య సినిమాలపై గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ - ఆ హీరోలు ఎప్పుడు ఏం చేస్తారో?

View this post on Instagram
 
A post shared by Naveen Chandra (@naveenchandra212)

విక్రమ్ రాథోడ్ రేంజ్ పవర్ ఫుల్ రోల్!
తన 75వ సినిమాలో విక్రమ్ రాథోడ్ రేంజ్ పవర్ ఫుల్ రోల్ రవితేజ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. సీరియస్ సీన్లు మాత్రమే కాదు... 'కిక్' సినిమాలో నవ్వించినట్టు ఎంటర్‌టైన్ కూడా చేస్తారట.

Also Readమిస్టర్ బచ్చన్' రిలీజ్ డేట్ ఫిక్స్ - బాక్సాఫీస్ బరిలో విక్రమ్ vs రవితేజ vs రామ్

RT75 Movie Cast And Crew: రవితేజ 75వ సినిమాలో శ్రీ లీల హీరోయిన్. 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వాళ్లిద్దరూ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాతో 'ధమాకా' కాంబినేషన్ మరొకటి రిపీట్ అవుతోంది. ఆ సినిమాకు మ్యూజిక్ అందించిన, విజయంలో కీలక పాత్ర పోషించిన భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సైతం సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విధు అయ్యన్న, కళ: నాగేంద్ర తంగాల, సంభాషణలు: నందు సవిరిగాన, కూర్పు: జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, కథ - కథనం - దర్శకత్వం: భాను భోగవరపు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget