అన్వేషించండి

Game Changer: నితిన్, నాగ చైతన్య సినిమాలపై గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ - ఆ హీరోలు ఇప్పుడు ఏం చేస్తారో?

Thandel and Robin Hood Release Date: 'గేమ్ ఛేంజర్' విడుదలపై నిర్మాత 'దిల్' రాజు స్పష్టత ఇచ్చారు. దాంతో నితిన్, నాగ చైతన్య సినిమాలు ఇరకాటంలో పడ్డాయి. ఆ ఇద్దరూ కొత్త డేట్స్ వెతుక్కోవాలి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' ఈ ఏడాది థియేటర్లలోకి వస్తుందా? రాదా? అసలు ఆ సినిమా (Game Changer Release Date) విడుదల ఎప్పుడు? నిన్నటి వరకు ఇదొక సమాధానం లేని ప్రశ్న! కానీ, ఇప్పుడు కాదు. 'రాయన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో క్రిస్మస్ సీజన్‌లో సినిమా విడుదల చేస్తామని నిర్మాత 'దిల్' రాజు చెప్పారు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు నితిన్, అక్కినేని నాగ చైతన్య సినిమాల మీద పడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

క్రిస్మస్ టార్గెట్ చేసిన నితిన్, నాగ చైతన్య! కానీ...
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'తండేల్'. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పాన్ ఇండియా సక్సెస్ 'కార్తికేయ 2' తర్వాత చందూ మొండేటి తీస్తున్న చిత్రమిది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు 'దిల్‌' రాజు ప్రకటనతో క్రిస్మస్‌ సీజన్‌ త్యాగం చేయక తప్పదు.

Also Read: ధనుష్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే - ఆ ఛాన్స్ వస్తే తెలుగులో ఎన్టీఆర్‌తో!

క్రిస్మస్ సీజన్ టార్గెట్ చేస్తూ డిసెంబర్ 20న విడుదలకు రెడీ అయిన మరొక సినిమా నితిన్ 'రాబిన్ హుడ్'. ఆయనతో 'భీష్మ' వంటి హిట్ సినిమా తీసిన వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న సినిమా అది. అందులో శ్రీ లీల హీరోయిన్. ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' క్రిస్మస్ బరిలో దిగితే... ఈ రెండూ వేరే విడుదల తేదీలు వెతుక్కోక తప్పదు. 

సంక్రాంతి సీజన్ కూడా ఫుల్... ఫిబ్రవరికి నితిన్!
క్రిస్మస్ తర్వాత తెలుగు సినిమాలకు మంచి ఫెస్టివల్ సీజన్ అంటే పెద్ద పండగ సంక్రాంతి సమయమే. అయితే... ఆల్రెడీ సంక్రాంతి మీద పెద్ద సినిమాలకు కర్చీఫ్ వేశాయి. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 10న ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సైతం సంక్రాంతికి విడుదల కానున్న సినిమాయే. ఈ రెండూ కాకుండా మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అందువల్ల, వేరే రిలీజ్ డేట్స్ వైపు చూస్తున్నారు 'రాబిన్ హుడ్', 'తండేల్' నిర్మాతలు.

Also Readమిస్టర్ బచ్చన్' రిలీజ్ డేట్ ఫిక్స్ - బాక్సాఫీస్ బరిలో విక్రమ్ vs రవితేజ vs రామ్


'తండేల్' సినిమాను ఫిబ్రవరి 2025లో విడుదల చేయాలని ఆల్రెడీ ఓ నిర్ణయానికి వచ్చారట. 'రాబిన్ హుడ్' సైతం 2025కు వెళుతోంది. అయితే, విడుదల ఎప్పుడు? అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు. అదీ సంగతి!

Also Readమూఢ నమ్మకాలు, మాస్ మర్డర్స్, ఇన్వెస్టిగేషన్ - భయంతో కూడిన ఉత్కంఠ ఇచ్చేలా త్రిష సిరీస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget