Mr Bachchan Release Date: 'మిస్టర్ బచ్చన్' రిలీజ్ డేట్ ఫిక్స్ - బాక్సాఫీస్ బరిలో విక్రమ్ vs రవితేజ vs రామ్
Ravi Teja Mr Bachchan Update: మాస్ మహారాజా రవితేజ హీరోగా మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న 'మిస్టర్ బచ్చన్' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. పంద్రాగస్టు బరిలో సినిమా వస్తోంది.
Mr Bachchan worldwide release on August 15th: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'మిస్టర్ బచ్చన్'. నామ్ తో సునా హోగా (నా పేరు వినే ఉంటారు)... అనేది క్యాప్షన్. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. 'షాక్', 'మిరపకాయ్' తర్వాత రవితేజతో ఆయనకు హ్యాట్రిక్ సినిమా కూడా! లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ రోజు సినిమా విడుదల తేదీని అధికారికంగా వెల్లడించారు.
ఆగస్టు 14న 'మిస్టర్ బచ్చన్' విడుదల!
Mr Bachchan Movie Release Date: 'మిస్టర్ బచ్చన్' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా అనౌన్స్ చేశారు. పంద్రాగస్టు బరిలో మాస్ మహారాజా దిగుతున్నారని స్పష్టం చేశారు. ముందు రోజు... అంటే ఆగస్టు 14న స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలు వేయనున్నారు.
Also Read: కన్నడ నిర్మాతను మోసం చేసిన విశాఖ వాసి - 'మార్టిన్' టీమ్ కంప్లైంట్‌తో కటకటాల వెనక్కి!
Waqt pe pahuchneka apna purana aadat hai…😎#MrBachchan GRAND RELEASE WORLDWIDE ON AUGUST 15th ❤️🔥
— People Media Factory (@peoplemediafcy) July 21, 2024
Special premieres all over on August 14th 💥💥
Get ready for MASSive entertainment on the big screens 🤩#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl #BhagyashriBorse @harish2you… pic.twitter.com/AmPS3lrl3e
ఇండిపెండెన్స్ డే సందర్భంగా 2024లో విడుదల అయ్యే సినిమాల జాబితా ఈసారి చాలా ఎక్కువగా ఉంది. చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వం వహించిన 'తంగలాన్', ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కలయికలో 'డబుల్ ఇస్మార్ట్', మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటించిన 'ఆయ్', రానా దగ్గుబాటి సమర్పణలో నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి ప్రధాన తారాగణంగా రూపొందిన '35 - చిన్న కథ కాదు' సినిమాలు ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ సినిమాలతో పాటు రవితేజ 'మిస్టర్ బచ్చన్' కూడా అదే తేదీన వస్తోంది.
'మిస్టర్ బచ్చన్' చిత్రాన్ని పనోరమా స్టూడియోస్ & టీ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ సినిమాతో ఉత్తరాది భామ భాగ్య శ్రీ బోర్సే తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయం అవుతోంది.
Also Read: 'కల్కి 2898 ఏడీ'లో అదొక్కటే కాదు, మొత్తం ఏడు ఉన్నాయ్ - నాగ్ అశ్విన్ చాలా దాచేశాడుగా
'మిస్టర్ బచ్చన్' సినిమాలో జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఛాయాగ్రహణం: అయనంక బోస్, నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్ర సమర్పణ: పనోరమా స్టూడియోస్ & టి సిరీస్, సంగీతం: మిక్కీ జె మేయర్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణం: టీజీ విశ్వ ప్రసాద్, రచన - దర్శకత్వం: హరీష్ శంకర్.