Ind vs SA 1st Test Live Streaming: 5 ఏళ్ల తరువాత సిరీస్.. భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలి
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ ఈరోజు ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభం కానుంది. రెండు జట్లు 5 సంవత్సరాల తర్వాత తలపడనున్నాయి. సమయం, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.

IND vs SA 1st Test Live Streaming: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ నేడు మొదలువుతుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేడు కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. ఇది చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత 2 జట్లు భారత గడ్డపై టెస్ట్ క్రికెట్‌లో తలపడనున్నాయి. స్వదేశంలో వరుస విజయాలను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఈ సిరీస్‌ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది.
ఇంగ్లాండ్ పర్యటనను 2-2తో డ్రాగా ముగించిన తర్వాత, వెస్టిండీస్‌పై క్లీన్ స్వీప్ చేయడంతో భారత్ ఆత్మవిశ్వాసం పెరిగింది. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2027 ఫైనల్ రేసులో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. అదే సమయంలో ప్రస్తుత WTC ఛాంపియన్ దక్షిణాఫ్రికా (South Africa) జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. పాకిస్తాన్‌ను ఇటీవల 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఓడించిన జట్టు. దీనితో పాటు, కెప్టెన్ టెంబా బావుమా కూడా ఆస్ట్రేలియాతో జరిగిన WTC 2025 ఫైనల్ తర్వాత తొలిసారి టెస్ట్ కెప్టెన్సీ చేస్తున్నాడు.
మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
భారత్ vs సౌత్ ఆఫ్రికా మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 (శుక్రవారం) ప్రారంభమవుతుంది.
మ్యాచ్ ఎక్కడ ఆడతారు?
ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతుంది.
మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభం?
మొదటి టెస్ట్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 కు ప్రారంభమవుతుంది.
టీవీలో లైవ్ టెలికాస్ట్ ఎక్కడ చూడాలి?
భారత్ vs దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీతో సహా ఇతర ప్రాంతీయ ఛానెల్‌లలో టెస్ట్ మ్యాచ్ చూడవచ్చు.
ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్
మొబైల్‌లో మ్యాచ్ చూడటానికి JioCinema యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. క్రికెట్ ప్రేమికులు మొబైల్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీలలో జియో సినిమాలో, వెబ్ సైట్ లైవ్ స్ట్రీమింగ్, స్టార్ స్పోర్ట్స్ 1లో సులభంగా మ్యాచ్ చూడవచ్చు.
రెండు జట్ల స్క్వాడ్
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్-కెప్టెన్/వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్.
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), జుబైర్ హంజా, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, డెవాల్డ్ బ్రెవిస్, కార్బిన్ బాష్, టోనీ డి జోర్జీ, సెనురన్ ముత్తుసామి, వియాన్ ముల్డర్, రయాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), ఎయిడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెయిన్ (వికెట్ కీపర్), కేశవ్ మహారాజ్.





















