Bihar Election 2025 Results | నితీశ్ చాణక్యం పనిచేస్తుందా...తేజస్వి ఉడుకు రక్తం గద్దెనెక్కుతుందా.? | ABP Desam
ఈసారి బీహార్ ఎన్నికల ఫలితాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. ఎప్పుడూ క్యాస్ట్ ఈక్వేషన్స్ కి దేశంలో పెద్ద పొలిటికల్ ల్యాబొరేటరీలా పనిచేసే బీహార్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్...డెవలప్మెంట్ వర్సెస్ యంగ్ స్టర్స్ అన్నట్లుగా తయారైంది. రెండుదశల్లో 243 అసెంబ్లీ స్థానాలకు ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించేసుకున్నారు. కానీ బిహారీల తీర్పు ఎవరివైపు నిలబడిందన్నది ఆసక్తికరంగా మారింది. బీహార్ పీఠాన్ని అధిష్ఠించాలంటే కావాల్సిన మ్యాజిక్ నెంబర్ అయిన 122 సీట్లు ఏ కూటమి సాధిస్తుందనేది ఇంట్రెస్టింగ్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి సీఎం నితీశ్ కుమార్ జేడీయూ పార్టీ లోక్ జన శక్తి లాంటి పార్టీలను కలుపుకుని ఎన్డీయే గా బరిలోకి దిగితే విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ లాంటి లోకల్ పవర్ హౌస్, సీపీఐ సీపీఎం లాంటి వామపక్షాలతో కలిసి మహా ఘట్ బంధన్ గా ఎన్నికల్లో పోటీకి దిగింది. సర్వేలన్నీ మరోసారి ఎన్డీయే కూటమికే ఓటర్లు పట్టం కట్టారని చెబుతున్నాయి. బీహార్ లో గతంలో ఎన్నడూ కనపడనంత విజుబుల్ డెవలప్మెంట్ ఈ మూడు నాలుగేళ్లలో కనపడిందని...బీజేపీతో కలిసి దోస్తీ చేస్తుంన్నందు వల్లే ఇది సాధ్యపడిందని సీఎం నితీశ్ కుమార్ తన చాణక్య నీతిని ఎన్నికల ప్రచారంలో ప్రదర్శించారు. సో మరో సారి బీహార్ లో ఎన్డీయే నెగ్గితే పదోసారి ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు రాహుల్ తో కలిసి ఆర్జేడీ యువసేనాధిపతి తేజస్వీ యాదవ్ జోరుగా ప్రచారం చేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ తేజస్వీ-రాహుల్ కాంబో యంగ్ బ్లడ్ అయినా ఈసారి నిరాశ తప్పదని చెబుతున్నాయి. మరో వైపు ప్రశాంత్ కిశోర్ లాంటి నేతలు జనసురాజ్ పార్టీతో ఎన్నికల్లో పోటీ చేశారు. వాళ్లెంత వరకూ ఇంపాక్ట్ చూపిస్తారో చూడాలి. మొత్తంగా బిహార్ లో గెలుపు సంబరాలు చేసుకోవటానికి అన్ని పార్టీలు జిలేబీలు, రసగుల్లాలు, బొబ్బట్లు లాంటి బిహారీ ట్రెడీషన్ వంటకాలతో రెడీ అయిపోయింది...కానీ ప్రజల మనసు గెలిచి గద్దెనెక్కే నేత ఎవరో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.





















