అన్వేషించండి

Dhanush: ధనుష్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే - ఆ ఛాన్స్ వస్తే తెలుగులో ఎన్టీఆర్‌తో!

Raayan Pre Release Event: ధనుష్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'రాయన్' ఈ నెల 26న విడుదల అవుతోంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో హైలైట్ ఏమిటంటే?

Dhanush is a fan of Pawan Kalyan: కోలీవుడ్ స్టార్, నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా - ఆదివారం రాత్రి నుంచి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో, డిజిటల్ మీడియాలో ఇదే డిస్కషన్. దీనికి ఓ కారణం ఉంది. అది ఏమిటి? అంటే... 

ధనుష్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'రాయన్' (Raayan Movie). ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ (Raayan Pre Release Event) నిర్వహించారు. అందులో తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు ధనుష్ ఏం చెప్పారో తెలుసా?

పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం! - ధనుష్
అవును... ధనుష్ చెప్పిన సమాధానం ఇదే! తెలుగులో తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పారు. దాంతో ఒక్కసారిగా ఈవెంట్ నిర్వహించిన పార్క్ హయత్ ఆడిటోరియం అంతా ఈలలు, చప్పట్లతో హోరెత్తింది. 

మల్టీస్టారర్ అయితే ఎన్టీఆర్ (Jr NTR)తో!ఒకవేళ తెలుగులో మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు? అని అడిగితే... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని చెప్పారు ధనుష్. ఆయన హీరోగా నటించకుండా కేవలం దర్శకత్వం మాత్రమే వహించాల్సి వస్తే... 'రాయన్'లో హీరోగా ఎవరిని ఎంపిక చేసుకుంటారు? ఆ పాత్ర చేయమని ఎవరి దగ్గరకు వెళతారు? అని అడిగితే మరో సందేహం లేకుండా 'సూపర్ స్టార్ రజనీకాంత్' అని సమాధానం ఇచ్చారు ధనుష్.

తెలుగులో 'రాయన్' విడుదల చేస్తున్న ఏషియన్ సురేష్!
Raayan Telugu Release Date: 'రాయన్' సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. ఏషియన్ సంస్థలో ధనుష్ హీరోగా పాన్ ఇండియా సినిమా 'కుబేర' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'రాయన్' ప్రీ రిలీజ్ వేడుకలో ఆ సినిమా అప్డేట్ గురించి అడగ్గా... నిర్మాత సునీల్ నారంగ్ చెప్పాలని ధనుష్ తెలిపారు.

Also Readమిస్టర్ బచ్చన్' రిలీజ్ డేట్ ఫిక్స్ - బాక్సాఫీస్ బరిలో విక్రమ్ vs రవితేజ vs రామ్


Raayan Movie Cast And Crew: 'రాయన్' సినిమాలో ధనుష్ తమ్ముడిగా సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ నటించారు. ఇందులో ఎస్.జె. సూర్య విలన్ రోల్ చేశారు. ఇంకా కీలక పాత్రల్లో సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్ నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ప్రచార చిత్రాల్లో ఆయన నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది.

Also Read: మూఢ నమ్మకాలు, మాస్ మర్డర్స్, ఇన్వెస్టిగేషన్ - భయంతో కూడిన ఉత్కంఠ ఇచ్చేలా త్రిష సిరీస్


'రాయన్' సినిమాకు రచన - దర్శకత్వం: ధనుష్, నిర్మాణం: సన్ పిక్చర్స్, తెలుగులో విడుదల: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, సంగీతం: ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్, కూర్పు: ప్రసన్న జీకే, ప్రొడక్షన్ డిజైనర్: జాకీ, యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
TGDSC Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
Constable Suicide: బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
Actor Raj Tarun Case: రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chandrababu Naidu Escape Train Accident |రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు చంద్రబాబు ఏం చేశారో చూడండిJainoor Tribal Woman Incident: ఆదివాసీ మహిళపై లైంగిక దాడి.. అట్టుడుకుతున్న జైనూర్ | ABP DesamFloods At Gabbarsingh Re Release Chilakaluripet |నడుం లోతు నీళ్లలోనూ సినిమా చూస్తున్న ఫ్యాన్స్ |ABPRobotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ - ఏఐసీసీ అధిష్టానం కీలక నిర్ణయం
TGDSC Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే?
Constable Suicide: బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య, కారణం ఏంటంటే!
Actor Raj Tarun Case: రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్‌- సహజీవనం నిజమని కోర్టుకు చెప్పిన పోలీసులు
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత- ఏబీవీపీ నేతల్ని అడ్డుకోవడంతో చినిగిన చొక్కాలు
బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత- ఏబీవీపీ నేతల్ని అడ్డుకోవడంతో చినిగిన చొక్కాలు
Ganesh Chaturthi 2024 Special: దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్
దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్
Uttar Pradesh : రూ.25 వేల జీతం కోసం అప్లయ్ చేసుకుంటే రూ. 250 కోట్ల జీఎస్టీ బిల్లొచ్చింది - ఈ నిరుద్యోగి కష్టం తీర్చేదెవరు  ?
రూ.25 వేల జీతం కోసం అప్లయ్ చేసుకుంటే రూ. 250 కోట్ల జీఎస్టీ బిల్లొచ్చింది - ఈ నిరుద్యోగి కష్టం తీర్చేదెవరు ?
Andra Pradesh Trains: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక- విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు- దసరా దీపావళికి ప్రత్యేక ట్రైన్స్‌
Embed widget