మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?
బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ దేశంలో కోర్టులు, పోలీసులు అనే వ్యవస్థలు కేవలం ఆడవాళ్ళ కోణం లోనే పని చేస్తున్నాయంటూ అతుల్ బలవన్మరణానికి పాల్పడటం వ్యవస్థలను అన్నిటిని ఒక్కసారిగా తట్టిలేపింది. అసలు ఎవరీ అతుల్ సుభాష్.. అతనికి జరిగిన అన్యాయం ఏంటి.. ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడు.. ఈ వీడియో లో చూడండి.
ఆత్మహత్య చేసుకున్న అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకొనే ముందు దాదాపు 80 నిమిషాల వీడియోను చిత్రీకరించాడు. అందులో అతను.. నేను సంపాదించే డబ్బు నా శత్రువులను మరింత బలోపేతం చేస్తోందని.. వారు దానిని వాడుకొనే నన్ను నాశనం చేస్తున్నారని అన్నారు. ఇది ఒక విష వలయంలా మారిందని.. అందుకే తాను చచ్చిపోవాలనుకుంటున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మరణానికి ముందు ఆయన ఏకంగా 40 పేజీల లేఖ రాసి ప్రాణాలు తీసుకున్నారు. దీన్ని బట్టి ఆయన ఎంతగా సతమతం అయ్యారో అర్థం చేసుకోవచ్చు. సుభాష్ కు అండగా దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.