అన్వేషించండి

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

Telangana News: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో భూమి లేని పేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. తొలి విడతగా రూ.6 వేలు ఈ నెల 28న ఇస్తామని తెలిపింది.

Telangana Cabinet Key Decisions: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. భూమి లేని పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుమారు 5 గంటలకు పైగా కేబినెట్ భేటీ జరిగింది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28న ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఏడాదిలో 2 విడతలుగా అందించే ఈ డబ్బులో తొలి విడతగా రూ.6 వేల మొత్తాన్ని ఆ రోజున లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రకటించారు. తెలంగాణలో దాదాపు 50 లక్షలకు పైగా భూమి లేని కుటుంబాలు ఉండగా వారికి సంవత్సరానికి రూ.12,000 వేలు చొప్పున రెండు విడతల్లో ఇవ్వనున్నారు. అలాగే, వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రైతులకు, వ్యవసాయం కోసం నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందన్నారు.

సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు

సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా 36 లక్షల మందికి ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. అర్హులకు ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్‌లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు చెప్పారు.

ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణ

ఈ - ఫార్ములా రేస్ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది. న్యాయ నిపుణుల సలహా మేరకు గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని సర్కారు పేర్కొంది. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ - కార్ రేస్ వ్యవహారంలో చట్టప్రకారమే దర్యాప్తు కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేటీఆర్‌‌ను విచారించేందుకు అనుమతి ఇప్పటికే లభించిందని, గవర్నర్ అనుమతి ఇస్తూ జారీ చేసిన దస్త్రాన్ని సోమవారం రాత్రి, లేదా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి పంపిస్తారని అన్నారు. చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుందన్నారు.

'గవర్నర్ అనుమతిపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఈ వ్యవహారంలో జరిగిన దోపిడీపై కేబినెట్‌లో చర్చించాం. కేటీఆర్ అరెస్టుపై నేనేమీ చెప్పలేను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇటీవల బీఆర్ఎస్ నేతలు బాంబు తుస్సుమందని వ్యాఖ్యానించారు. అది తుస్సుమనేదైతే.. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేశారు.?. అసెంబ్లీలో ఎమ్మెల్యేల్లా కాకుండా గూండాల్లా ప్రవర్తించారు. మాట్లాడడానికి అంశం లేనందుకే ప్లకార్డులు, నినాదాలతో సభకు ఆటంకం కలిగించారు. ఈ సమావేశాల్లో ఆర్వోఆర్ బిల్లు ప్రవేశపెడతాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదు. ప్రధానమైన అవినీతిని ప్రజల ముందు ఉంచుతున్నాం.' అని మంత్రి పేర్కొన్నారు. కాగా, 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహణకు సంబంధించి రూ.55 కోట్ల చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: KTR Arrest News: కేటీఆర్ అరెస్టుపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది - పొంగులేటి వ్యాఖ్యలు - హింట్ ఇచ్చినట్లేనా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Varanasi - Puri Jagannadh: 'వారణాసి'లో పూరి జపం... 'పోకిరి' వెంట టోటల్ టీమ్!
'వారణాసి'లో పూరి జపం... 'పోకిరి' వెంట టోటల్ టీమ్!
Madanapalle Kidney Scam: కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్.. 4 రాష్ట్రాలను జల్లెడ పడుతున్న పోలీసులు
కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్.. 4 రాష్ట్రాలను జల్లెడ పడుతున్న పోలీసులు
Mahesh Babu : లుక్ చూస్తే నందిపై 'రుద్ర' - 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేష్ బాబు... రాజమౌళి ప్లాన్ ఏంటి?
లుక్ చూస్తే నందిపై 'రుద్ర' - 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేష్ బాబు... రాజమౌళి ప్లాన్ ఏంటి?
Visakha CII Summit: విశాఖ సీఐఐ సదస్సులో 613 ఎంఓయూలు, రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు.. 16 లక్షల ఉద్యోగాలు
విశాఖ సీఐఐ సదస్సులో 613 ఎంఓయూలు, రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు.. 16 లక్షల ఉద్యోగాలు
Advertisement

వీడియోలు

Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం
Ravindra Jadeja IPL 2026 | జడేజా ట్రేడ్ వెనుక వెనుక ధోనీ హస్తం
Rishabh Pant Record India vs South Africa | చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌
Sanju Samson Responds on IPL Trade | సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
VARANASI Trailer Decoded | Mahesh Babu తో నీ ప్లానింగ్ అదిరింది జక్కన్నా SS Rajamouli | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Varanasi - Puri Jagannadh: 'వారణాసి'లో పూరి జపం... 'పోకిరి' వెంట టోటల్ టీమ్!
'వారణాసి'లో పూరి జపం... 'పోకిరి' వెంట టోటల్ టీమ్!
Madanapalle Kidney Scam: కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్.. 4 రాష్ట్రాలను జల్లెడ పడుతున్న పోలీసులు
కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్.. 4 రాష్ట్రాలను జల్లెడ పడుతున్న పోలీసులు
Mahesh Babu : లుక్ చూస్తే నందిపై 'రుద్ర' - 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేష్ బాబు... రాజమౌళి ప్లాన్ ఏంటి?
లుక్ చూస్తే నందిపై 'రుద్ర' - 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేష్ బాబు... రాజమౌళి ప్లాన్ ఏంటి?
Visakha CII Summit: విశాఖ సీఐఐ సదస్సులో 613 ఎంఓయూలు, రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు.. 16 లక్షల ఉద్యోగాలు
విశాఖ సీఐఐ సదస్సులో 613 ఎంఓయూలు, రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు.. 16 లక్షల ఉద్యోగాలు
Varanasi Title Glimpse : మహేష్ బాబు, రాజమౌళి 'వారణాసి' మూవీ - 'రామాయణం'లో ముఖ్య ఘట్టం... గ్లింప్స్ వచ్చేసింది
మహేష్ బాబు, రాజమౌళి 'వారణాసి' మూవీ - 'రామాయణం'లో ముఖ్య ఘట్టం... గ్లింప్స్ వచ్చేసింది
GlobeTrotter Event : ప్రియాంక చోప్రానే హీరోయిన్ - మహేష్ బాబు విశ్వరూపం చూస్తాం... 'వారణాసి'పై ఈవెంట్‌లో మూవీ టీం లీక్స్
ప్రియాంక చోప్రానే హీరోయిన్ - మహేష్ బాబు విశ్వరూపం చూస్తాం... 'వారణాసి'పై ఈవెంట్‌లో మూవీ టీం లీక్స్
Varanasi Movie Release Date : మహేష్ బాబు, రాజమౌళి మూవీ 'వారణాసి' - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
మహేష్ బాబు, రాజమౌళి మూవీ 'వారణాసి' - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Yamaha XSR 155 లేదా KTM 160 డ్యూక్ బైక్‌లలో ఏది పవర్‌ఫుల్.. ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Yamaha XSR 155 లేదా KTM 160 డ్యూక్ బైక్‌లలో ఏది పవర్‌ఫుల్.. ధర, ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Embed widget