US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి- ఐదుగురు మృతి
Shooting In US : అమెరికాలోని ఓ స్కూల్‌లో విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో నిందితుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
America Shooting News: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఈసారి ఓ పాఠశాలలో తుపాకీ పేలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. కాల్పులు జరిపింది ఓ విద్యార్థి కావడం ఆందోళన కలిగిస్తోంది.
అమెరికా విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లో అబండంట్ క్రైస్తవ పాఠశాలలో కాల్పులు జరిగాయి. అదే పాఠశాలలో చదువుతున్న 12వ తరగతి విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల్లో మృతి చెందిన వాళ్లు ఎవరనేది క్లారిటీ ఇవ్వడం లేదు. తొటి విద్యార్థులా లేకుంటే సిబ్బందా ఉపాధ్యాయులా అనేది పోలీసులు చెప్పడం లేదు. చనిపోయిన వారిలో నిందితుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
కాల్పులు జరిగిన పాఠశాలలో నాలుగు వందల మంది చదవుతున్నారు. కాల్పుల సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా స్కూల్‌కు ఫోన్లు చేశారు. మరికొందరు భయాందోళనతో స్కూల్‌కు వచ్చారు. ఆ స్కూల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఎవర్నీ లోనికి వెళ్లనీయలేదు. దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికాలో తుపాకీ సంస్కృతి బాగా పెరిగిపోయింది. ఎక్కడ ఏదో చోట తుపాకీ పేలుళ్ల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 322 ఘటనలు జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. స్కూల్స్‌లో హింసాత్మక ఘటనలు అందర్నీ కలచి వేస్తున్నాయి. ప్రస్తుతం జరిగిన ఘటనపై అధ్యక్షుడికి విషయాన్ని భద్రతా సిబ్బంది చేరవేశారు.
జార్జీయాలో 12 భారతీయులు మృతి
మరోవైపు జార్జియాలో 12 మంది భారతీయులు మృతి చెందారు. ఇండియన్ రెస్టారెంట్ గుడౌరి మౌంటెయిన్ రిసార్ట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. వీళ్లంతా అక్కడ రెస్టారెంట్‌లో పని చేస్తున్నారు. రాత్రి టైంలో కార్బన్ మోనోక్సైడ్ పీల్చి చనిపోయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో దర్యాప్తు జరుగుతున్నట్టు టిబ్లిసిలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. జార్జియా క్రిమినల్ కోడ్ 116 ప్రకారం కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేస్తున్నారు.
Also Read: జగన్నాథుని విగ్రహం ముందు శిరస్సు వంచిన కోడి - వైరల్ వీడియో