Viral Video: జగన్నాథుని విగ్రహం ముందు శిరస్సు వంచిన కోడి - వైరల్ వీడియో
Odisha News: ఒడిశాలోని పూరీలో తాజాగా వింత సంఘటన జరిగింది. జగన్నాథుని విగ్రహం ముందు ఓ కోడి వంగి నమస్కరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Hen Bows Down Infront Of Jagannath Idol: మనుషులతో పాటు జంతువులు, పక్షులు సైతం దేవునిపై తమ భక్తిని చాటుకుంటాయి. శివాలయంలో శివలింగం చుట్టూ పాము పడగ విప్పడం, విఘ్నేశ్వరుని ఆలయంలో ఏనుగు మోకరిల్లడం వంటి ఘటనలు మనం చూశాం. తాజాగా, ఓ కోడి జగన్నాథుని విగ్రహం ముందు శిరస్సు వంచి మొక్కింది. ఈ వింత ఘటన ఒడిశాలో (Odisha) జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తాజాగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని పూరీలో కొలువైన జగన్నాథుడిని ఆ రాష్ట్ర ప్రజలే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు దర్శించుకుంటారు. అలాంటి ఒడిశాలో ఒకచోట ఎత్తైన పీటపై జగన్నాథ స్వామి విగ్రహం ఉండగా.. ఓ కోడి అక్కడకు వచ్చి జగన్నాథుని ముందు వంగి ప్రార్థించింది. ఈ వీడియో క్లిప్‌ను 'జగన్నాథ్ ధామ్ పూరి ఎక్స్‌పర్ట్' ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. నారాయణుడు అందరిలోనూ ఉంటాడని కొందరు.. విశ్వమంతా ఆయన ముందు తలవంచాలి అని మరికొందరు కామెంట్స్ చేశారు.
View this post on Instagram
Also Read: Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

