Raashii Khanna: డూప్ లేకుండా స్టంట్స్ చేసిన రాశీ ఖన్నా... సెట్‌లో అందాల భామకు గాయాలు
Raashii Khanna Injured: అందాల భామ రాశీ ఖన్నాకు గాయాలు అయ్యాయి. అది కూడా చిత్రీకరణలో! అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆవిడ క్షేమంగానే ఉన్నారు గాయాలైన ఫోటోలను ఆవిడే పోస్ట్ చేశారు.

హీరోయిన్లకు అరుదుగా స్టంట్స్ చేసే అవకాశం వస్తుంది. మాగ్జిమమ్ సినిమాల్లో హీరోలే ఫైట్స్ చేస్తారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో అయితే పాటలకు, రొమాంటిక్ సన్నివేశాలకు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అటువంటి అందాల భామలకు యాక్షన్ రోల్ దొరికితే అసలు వదులుకోరు రాశీ ఖన్నా కూడా అంతే. అయితే ఆవిడకు ఫైట్స్ చేసేటప్పుడు గాయాలైన వెనక్కి తగ్గలేదు.
అందాల భామ రాశీ ఖన్నాకు గాయాలు
అవును... రాశీ ఖన్నాకు గాయాలు అయ్యాయి. అది కూడా షూటింగ్ చేస్తున్న సమయంలో ఏ ప్రాజెక్టు షూటింగ్ అనేది ఆవిడ చెప్పలేదు. కానీ జనాలు అందరూ 'ఫర్జి' వెబ్ సిరీస్ సీజన్ 2 కోసం షూటింగ్ చేస్తున్న టైంలో గాయాలు అయ్యాయని భావిస్తున్నారు.
తన చేతి వేళ్లకు, బుగ్గలకు గాయాలైన ఫోటోలను రాశీ ఖన్నా స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొన్ని క్యారెక్టర్లు మనల్ని అడగవని, డిమాండ్ చేస్తాయని ఆవిడ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో తాను సొంతంగా యాక్షన్ సీక్వెన్సులు చేశానని తెలిపారు. మనమే ఒక తుఫాన్ అయినప్పుడు మనల్ని ఏ పిడుగు ఆపలేదంటూ ఆవిడ స్ట్రాంగ్ కొటేషన్ కూడా చెప్పారు.
View this post on Instagram
రాశీ ఖన్నా డెడికేషన్ చూసి ఆవిడ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం క్లాస్ కొడుతున్నారు. ఈ మధ్య రాశీ ఖన్నా కమర్షియల్ సినిమాలు చేయడం కంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం చేసే యాక్షన్ రోల్ కూడా అటువంటిది అయ్యి ఉండొచ్చు.
Also Read: అప్పుడు రామ్ చరణ్‌కు చెప్పలేదు... ఇప్పుడు ఎన్టీఆర్‌కు చెప్పాడు... బన్నీ రూటే సపరేటు
తెలుగులో రాశీ ఖన్నా చేస్తున్న సినిమాల విషయానికి వస్తే స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డకు జోడిగా నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న 'తెలుసు కదా' సినిమాలో నటిస్తున్నారు. అది కాకుండా మరొక హిందీ సినిమా ఆవిడ చేతిలో ఉంది.





















