Jr NTR Birthday: అప్పుడు రామ్ చరణ్‌కు చెప్పలేదు... ఇప్పుడు ఎన్టీఆర్‌కు చెప్పాడు... బన్నీ రూటే సపరేటు
Allu Arjun On NTR Birthday: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారు. దాంతో మరోసారి ఎన్టీఆర్ - బన్నీ బాండింగ్, చరణ్ - అర్జున్ మధ్య దూరం బయటపడింది.

మే 20వ తేదీ వస్తే... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు పండగే. తమ ఫేవరెట్ హీరో పుట్టినరోజు కావడంతో కొత్త సినిమా లుక్కులు, టీజర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సినిమా కబుర్లతో పాటు ఎన్టీఆర్ అభిమానులు వెయిట్ చేసే మరొక విషయం... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పే బర్త్ డే విషెస్ కోసం!
హ్యాపీ బర్త్ డే బావ...
ఎన్టీఆర్‌కు బన్నీ విషెస్!
ఒకరినొకరు బావ బావ అని పిలుచుకోవడం ఎన్టీఆర్ అల్లు అర్జున్‌కు అలవాటు. ప్రతి ఏడాది హ్యాపీ బర్త్ డే బావ అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో విషస్ చెబుతారు అల్లు అర్జున్. ఈసారి కూడా అలాగే చెప్పారు. మరోసారి ఎన్టీఆర్ బన్నీ మధ్య బాండింగ్ బయటపడింది. అదే సమయంలో రామ్ చరణ్ అల్లు అర్జున్ మద్య దూరం డిస్కషన్ పాయింట్ అవుతోంది.
Also Read: కమల్‌ను చూసి చిరు, బాలయ్య నేర్చుకోవాలా? 'థగ్ లైఫ్'లో ఆ ముద్దులేంటి? రొమాన్స్ ఏంటి?
Happy Birthday Bava @tarak9999 !
— Allu Arjun (@alluarjun) May 20, 2025
Wishing you all the success , Joy & Happiness 🖤
చరణ్ పుట్టినరోజుకు చెప్పలేదు!
మే 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్ డే అయితే... మార్చి 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు. అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ చూస్తే... ఆ రోజు బావ కోసం ఎటువంటి పోస్ట్ చేయలేదు. ఈ ఏడాది మాత్రమే కాదు... లాస్ట్ ఇయర్ కూడా అల్లు అర్జున్ నుంచి రామ్ చరణ్‌కు ఎలాంటి విషెస్ లేవు.
Also Read: సుప్రీతా నాయుడుకు మరో సినిమా ఛాన్స్... 'అమరావతికి ఆహ్వానం'లో సురేఖ వాణి కుమార్తె
Bava birthday ki wishes matram miss cheyav pic.twitter.com/OZ94rZeJ3C
— R🅰️J🅰️ 🐉 (@AA_veraabhimani) May 20, 2025
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజుకు గ్లోబల్ స్టార్ నుంచి కూడా విషెస్ చెబుతూ ఎటువంటి ట్వీట్ లేదు. దాంతో అసలైన బావ బామ్మర్దుల మధ్య దూరం పెరిగితే... ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య స్నేహం మరింత పెరుగుతోందని ఇటు ఫిలిం ఇండస్ట్రీ ఆఫ్ ద రికార్డ్ మాటల్లో, అటు ఆడియన్స్‌లో డిస్కషన్ జరుగుతోంది.





















