Supritha Naidu: సుప్రీతా నాయుడుకు మరో సినిమా ఛాన్స్... 'అమరావతికి ఆహ్వానం'లో సురేఖ వాణి కుమార్తె
Amaravati Ki Aahwanam Movie: సురేఖ వాణి కుమార్తె, నటి సుప్రీతా నాయుడు మరో సినిమా అంగీకరించారు. శివ కంఠమనేని కొత్త సినిమా 'అమరావతికి ఆహ్వానం'లో ఆమె నటిస్తున్నారు.

సురేఖ వాణి కుమార్తె, నటి సుప్రీతా నాయుడు (Supritha Naidu)కు సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. మొదట ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. 'షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె'లో చేశారు. టీవీ షోస్ చేశారు. ఇప్పుడు ఆవిడ సినిమాల్లోనూ చేస్తున్నారు. ఆల్రెడీ అమర్ దీప్ చౌదరి హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్ రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మరో సినిమా యాక్సెప్ట్ చేశారు.
'అమరావతికి ఆహ్వానం'లో సుప్రీతా నాయుడు
Supritha Naidu in Amaravati Ki Aahwanam: శివ కంఠమనేని కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'అమరావతికి ఆహ్వానం'. ఇందులో ఎస్తేర్, ధన్యా బాలకృష్ణ హీరోయిన్లు. ఇందులో సుప్రీతా నాయుడు కీలక పాత్ర చేశారు. హరీష్ మరో ప్రధాన పాత్రధారి. జివికె దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ మీద కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'అమరావతికి ఆహ్వానం' కొంత చిత్రీకరణ చేశారు. తాజాగా మధ్య ప్రదేశ్‌లో షెడ్యూల్ కంప్లీట్ చేశారు. చింద్వార జిల్లాలోని తామ్య హిల్స్, పాతాళ్ కోట్, బిజోరి, చిమ్ తీపూర్ ప్రదేశాలలో సుమారు 20 రోజుల పాటు చిత్రీకరణ చేశారు.
Also Read: 'థగ్ లైఫ్' ట్రైలర్ రివ్యూ... షాక్ ఇచ్చిన త్రిష రోల్ - కమల్ & శింబు రోల్స్ రివీల్ చేశారుగా

హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ... ''మా టైటిల్‌కి ఆడియన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజెంట్ ట్రెండ్ దృష్టిలో పెట్టుకుని మా దర్శకుడు జీవీకే చక్కటి హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు'' అని అన్నారు. జీవీకే మాట్లాడుతూ... ''ఇదొక సరికొత్త హారర్ థ్రిల్లర్. సినిమాటోగ్రాఫర్ జె ప్రభాకర్ రెడ్డి, 'హనుమాన్' ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్, పద్మనాబ్ భరద్వాజ్ స్వరాలు - నేపథ్య సంగీతం మా సినిమాకు ప్లస్ అవుతాయి. ఏపీ, తెలంగాణ, మధ్య ప్రదేశ్... మూడు రాష్ట్రాల్లో షెడ్యూల్స్ పూర్తి చేశాం'' అని అన్నారు. 'అమరావతికి ఆహ్వానం' నిర్మాతలు మాట్లాడుతూ... ''మధ్య ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి చేయడంలో మాకు పూర్తి సహకారం అందించిన ఐఏఎస్ అధికారి శీలంధర్ గారికి, ఎస్పీ అజయ్ పాండే గారికి, జిల్లా సీఈవో ఎజి కుమార్ గారికి స్పెషల్ థాంక్స్'' అని అన్నారు.
Also Read: మిస్టిక్ థ్రిల్లర్ 'వృష కర్మ'లో హీరో నాగ చైతన్య రోల్ తెలుసా... హీరోయిన్ మీనాక్షి చౌదరి రోల్ ఏమిటంటే?
శివ కంఠంనేని హీరోగా, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రితా నాయుడు హీరోయిన్లుగా నటిస్తున్న 'అమరావతికి ఆహ్వానం'లో అశోక్ కుమార్, హరీష్, భద్రమ్, 'జెమినీ' సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: సాయిబాబు తలారి, ఫైట్స్: అంజి మాస్టర్, నృత్య దర్శకత్వం: రాజ్ కృష్ణ, సాహిత్యం: ఉమా వంగూరి, ఛాయాగ్రహణం: జె ప్రభాకర్ రెడ్డి, సంగీతం: పద్మనాబ్ భరద్వాజ్, నిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్, నిర్మాతలు: కెఎస్ శంకర్ రావు - ఆర్ వెంకటేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: వై. అనిల్ కుమార్ - కె. శ్రీనివాస్ రావు, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: జీవీకే.





















