రాశీ ఖన్నా చేతిలో తెలుగు సినిమాలు ఏవీ లేవు. అయితే, తెలుగు ప్రేక్షకులకు ఆమె ఎప్పుడూ దూరంగా లేరు.

సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలతో రాశీ ఖన్నా ఆకట్టుకుంటున్నారు.

ఇప్పుడు రాశీ ఖన్నా అబుదాబిలో ఉన్నారు. ఏడాది దేశమైనా రాశీ ఖన్నా గ్లామర్ తళుకులు తగ్గలేదు.

అబుదాబి నుంచి రాశీ ఖన్నా పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే... కొంచెం గ్లామర్ డోస్ పెంచినట్టే ఉన్నారు. 

అన్నట్టు... ఇంతకీ రాశీ ఖన్నా అబుదాబీ ఎందుకు వెళ్లారో తెలుసా? ఐఫా అవార్డ్స్ కోసం!

ఐఫా 2023లో రాశీ ఖన్నా గ్లామర్ తళుకులు హైలైట్ అయ్యాయి.

'ఫర్జి' వెబ్ సిరీస్ ఫిబ్రవరిలో విడుదలైంది. అందులో రాశీ ఖన్నా పాత్రకు పేరు వచ్చింది.

'ఫర్జి' కంటే ముందు 'రుద్ర' వెబ్ సిరీస్ చేశారు రాశీ ఖన్నా.

ప్రస్తుతం రాశీ ఖన్నా 'యోధ' అని ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. అందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో.

రాశీ ఖన్నా (All Images Courtesy : raashiikhanna / Instagram)