శోభితా ధూళిపాళ నటన కంటే వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. 'పొన్నియిన్ సెల్వన్'తో పాటు పలు హిట్ సినిమాల్లో శోభిత నటించారు. అయితే, ఆమె లవ్ లైఫ్ వాటిని వెనక్కి నెడుతోంది. అక్కినేని నాగ చైతన్యతో కలిసి శోభిత లండన్ వెళ్లారు. అక్కడి రెస్టారెంట్ చైతూతో షెఫ్ తీసుకున్న ఫోటోలో ఆమె కూడా కనిపించారు. సమంత నుంచి చైతూ విడాకులు తీసుకోవడంతో, శోభితకు దగ్గర అయ్యారని ఫిల్మ్ నగర్ ఇన్ సైడ్ టాక్. ఇటు శోభిత గానీ, అటు చైతూ గానీ తాము ప్రేమలో ఉన్నట్లు కన్ఫర్మ్ చేయలేదు. అలాగని ఖండించలేదు. వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై శోభితా ధూళిపాళ అసలు రియాక్ట్ కాలేదు. చైతూతో తనకు పరిచయమే లేనట్లు, గతంలో సోషల్ మీడియాలో ఎలా ఉండేవారో? ఇప్పుడూ అలాగే ఉంటున్నారు. ఇప్పుడు సమ్మర్ కూడా! 'ఇండియన్ సమ్మర్' అంటూ సోషల్ మీడియాలో శోభిత ఈ ఫోటోలు పోస్ట్ చేశారు. వేసవిలో వైట్ వేసుకోమని శోభితా ధూళిపాళ ఇన్ డైరెక్టుగా చెప్పినట్టు ఉన్నారు. శోభితా ధూళిపాళ (All Images Courtesy : sobhitad / Instagram)