ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడ ఉన్నారో తెలుసా? అబు దాబీలో! అక్కడికి ఎందుకు వెళ్లారని అనుకుంటున్నారా?
అబుదాబిలో ఐఫా అవార్డ్స్ 2023 షో జరుగుతోంది. ఆ ప్రోగ్రామ్ కోసం ఆవిడ వెళ్లారు.
ఐఫా 2023లో తెల్లటి దుస్తుల్లో రకుల్ ప్రీత్ సింగ్ దేవకన్యలా మెరిసిపోయారు.
వైట్ మీద తనకు ఉన్న ప్రేమతో ఈ డ్రస్ వేసుకున్నానని రకుల్ తెలిపారు.
శివ కార్తికేయన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్ 'అయలాన్'. దీపావళి కానుకగా విడుదల కానుంది.
'అయలాన్'లో శివ కార్తికేయన్ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఒక విధంగా సౌత్ లో ఆమె రీ ఎంట్రీ ఇది.
కమల్ హాసన్ 'ఇండియన్ 2'లో సిద్ధార్థ్ జోడీగా రకుల్ నటిస్తున్నారు.
రకుల్ తెలుగు సినిమా 'కొండపోలం' చేసి రెండేళ్లు, తమిళ సినిమా 'ఎన్.జి.కె' చేసి నాలుగేళ్లు అవుతుంది.
'అయలాన్', 'ఇండియన్ 2' సినిమాల తర్వాత దక్షిణాదిలో రకుల్ మళ్ళీ బిజీ అవుతానని ఆశిస్తున్నారు.