War 2 Teaser Decoding: ఎన్టీఆర్ vs హృతిక్ ఫేస్ ఆఫ్... కియారా గ్లామర్... పంచభూతాల కాన్సెప్ట్ ఫైట్స్ - 'వార్ 2' టీజర్‌లో వీటిని గమనించారా?
War 2 teaser highlights: ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ 'వార్ 2' టీజర్ విడుదలైంది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్ అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చింది. అయితే... అందులో ఈ ఐదు అంశాలు గమనించారా?

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe)కు ఒక క్రేజ్ ఉంది. 'ఏక్ థా టైగర్' నుంచి 'పఠాన్' వరకు అన్నీ సక్సెస్ సాధించాయి. 'టైగర్ 3' ఆశించిన రీతిలో ఆడలేదు. అయితే... 'వార్' సీక్వెల్ కావడం, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కావడంతో 'వార్ 2' మీద తెలుగులో కూడా క్రేజ్ నెలకొంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. అందులో హైలైట్స్ ఏంటి? హిడెన్ డీటెయిల్స్ ఏంటి?
ఎన్టీఆర్ కిల్లర్ లుక్స్... వాయిస్‌లో కమాండ్!
'వార్ 2' టీజర్‌లో ఎన్టీఆర్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నది ఆయన లుక్స్, కిల్లర్ వాయిస్! ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గారు. కొన్ని రోజుల క్రితం మరీ సన్నగా ఉన్నారనే మాటలు వినిపించినా... టీజర్ చూశాక ఆ అభిప్రాయం మార్చుకోవాలి. ఎన్టీఆర్ లుక్ స్టైలిష్‌గా ఉంది. టీజర్‌లో ఆయన కాస్ట్యూమ్స్ ఐదు కంటే ఎక్కువ ఉన్నాయి. అన్నీ బావున్నాయి. ఇక వాయిస్ & డైలాగ్ మీద ఎన్టీఆర్ కమాండ్ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. డైలాగ్ డెలివరీలో తన మార్క్ చూపించారు.
హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్... ఫేస్ ఆఫ్!
ఎన్టీఆర్ తర్వాత 'వార్ 2' టీజర్‌లో అందరినీ ఆకర్షించినది హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఫేస్ ఆఫ్. ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆ ఫైట్స్ థ్రిల్లింత ఇవ్వడం కన్ఫర్మ్. 
నింగీ... నేల... నీరు... నిప్పు... గాలి... ఫైట్స్‌లో!?
నింగీ, నేల, నిప్పు, నీరు, గాలి... పంచభూతాలు తెలుసుగా! 'వార్ 2' టీజర్ చూస్తే... పంచభూతాలు కాన్సెప్ట్ యాక్షన్ డిజైన్ చేసినట్టు ఉన్నారని అర్థం అవుతోంది. ఆకాశంలో ఫైటర్ జైట్స్ మీద ఒక ఫైట్ ఉంది. సముద్రంలో స్పీడ్ బోట్స్ మీద ఒక ఫైట్ తీశారు. టీజర్ జాగ్రత్తగా గమనిస్తే... ఒక ఎత్తైన భవనం నుంచి దూకే షాట్ ఉంటుంది. గాలిలోనూ యాక్షన్ డిజైన్ చేశారని అర్థం అవుతోంది. టీజర్‌లో ఎన్టీఆర్ ఇంట్రో చూస్తే గ్రానైడ్స్ పట్టుకుని వస్తారు. ఆ ఫైట్ సీన్ అంతా బ్లాస్ట్ బేస్డ్ ఉంటుందని టాక్. మంచు గుహలో మరొక ఫైట్ ఉంది. అయితే... ఆ వీఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం విమర్శలు వస్తున్నాయి.
బికినీలో కియారా అడ్వాణీ... గ్లామర్ హైలైట్!
కియారా అడ్వాణీ కనిపించినది కాసేపే... అయితే ఆవిడ బికినీ విజువల్స్ సోషల్ మీడియా అంతటా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ప్రజెంట్ ఆవిడ ప్రెగ్నెంట్. ఈ మూవీ షూట్ ఎప్పుడో జరగడం వల్ల బికినీ సీన్స్ తీయడానికి ఇబ్బంది కాలేదు. హృతిక్, కియారా మధ్య ఒక సాంగ్ తీశారు. ఆ విజువల్స్ కూడా కొంచెం చూపించారు.
చైనా బోర్డర్, ఆఫ్రికాలో యాక్షన్ సీన్స్ ఏమిటి?
టీజర్ ప్రారంభం గమనిస్తే... రెండు కొండల మధ్య చెక్కలతో కట్టిన బ్రిడ్జ్ తెగుతుంది. ఆ తర్వాత హృతిక్ రోషన్ ఫైట్ వస్తుంది. చైనా బోర్డర్ రాష్ట్రాల్లో అది తీసినట్టు ఉన్నారు. సాధారణంగా స్పై థ్రిల్లర్స్ అంటే యాక్షన్ సీన్స్ అన్నీ గన్స్, బాంబులతో నిండిపోతుంది. కానీ, ఈ సినిమా మాత్రం డిఫరెంట్. స్వార్డ్ ఫైట్ ఒకటి తీశారు. అలాగే, ఎన్టీఆర్ ఇంట్రో యాక్షన్ సీన్ చూస్తే ఆయన చేతిలో తన్నులు తినేది ఆఫ్రికన్స్. కథకు ఇండో - చైనా బోర్డర్, ఆఫ్రికాకు సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: అప్పుడు రామ్ చరణ్‌కు చెప్పలేదు... ఇప్పుడు ఎన్టీఆర్‌కు చెప్పాడు... బన్నీ రూటే సపరేటు






















