Double iSmart OTT Streaming: ఓటీటీలోకి 'డబుల్ ఇస్మార్ట్'... జస్ట్ మూడు వారాల గ్యాప్‌లో వచ్చేసింది
Double iSmart OTT Release: రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'డబుల్ ఇస్మార్ట్' సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఏ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది? వంటి వివరాల్లోకి వెళితే...

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni), డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కలయికలో తెరకెక్కిన సినిమా 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart Movie). 'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, ఆ సినిమాకు సీక్వెల్‌గా తీసిన చిత్రమిది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఏ ఓటీటీలోకి వచ్చింది? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
జస్ట్ మూడు వారాల వ్యవధిలో ఓటీటీలోకి!
Double Ismart OTT Release Date Telugu: ఆగస్టు 15న 'డబుల్ ఇస్మార్ట్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. మూడు అంటే మూడు వారాలు మాత్రమే... థియేటర్లలో విడుదలైన 21 రోజుల వ్యవధిలో ఓటీటీలోకి సినిమా వచ్చింది. ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'డబుల్ ఇస్మార్ట్' స్ట్రీమింగ్ అవుతోంది.
బాలీవుడ్ ఖల్ నాయక్, సీనియర్ హీరో సంజయ్ దత్ 'డబుల్ ఇస్మార్ట్'లో విలన్. బిగ్ బుల్ పాత్రలో ఆయన సందడి చేశారు. సంజు బాబాకు తోడు హీరో, దర్శకుడికి హిందీలో ఫాలోయింగ్ ఉండటంతో సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేశారు. కానీ, రిజల్ట్ అనుకున్న విధంగా రాలేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. కట్ చేస్తే... జస్ట్ 3 వీక్స్ గ్యాప్‌లో ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 'డబుల్ ఇస్మార్ట్' వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. హిందీ వెర్షన్ ఓటీటీ విడుదలకు కాస్త సమయం తీసుకునేలా ఉన్నారు.
కావ్య థాపర్ గ్లామర్... అలీ కామెడీ... వరస్ట్!
'ఇస్మార్ట్ శంకర్'లో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. 'డబుల్ ఇస్మార్ట్'కు వచ్చేసరికి కావ్య థాపర్ హీరోయిన్. సినిమా విడుదలకు ముందు 'మార్ ముంత చోడ్ చింత' పాటతో పాటు ప్రచార చిత్రాల్లో ఆమె గ్లామర్ షో హాట్ టాపిక్ అయ్యింది. సినిమా విడుదలైన తర్వాత కావ్యను కొన్ని సన్నివేశాల్లో పూరి జగన్నాథ్ చూపించిన తీరు పట్ల విమర్శలు వచ్చాయి. అవసరం లేని సన్నివేశాల్లోనూ ఆమెతో అందాల ప్రదర్శన చేయించారని నెటిజనులు విమర్శల వర్షం కురిపించారు.
పూరి జగన్నాథ్ సినిమాల్లో అలీ కామెడీ ట్రాక్ ప్రేక్షకులను నవ్వించడమే కాదు... ఆ సినిమాలను సూపర్ హిట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే... 'డబుల్ ఇస్మార్ట్'లో కామెడీ ట్రాక్ నవ్వుల పాలు అయ్యింది. తూటా లాంటి మాటలు, ఫన్ ట్రాక్స్ రాసే పూరి జగన్నాథ్ పెన్నులో పవర్ అయ్యిందని విమర్శలు వచ్చాయి. మరీ డబుల్ మీనింగ్ కామెడీ పూరి నుంచి ఆశించలేదని కొందరు కామెంట్లు చేశారు. 'డబుల్ ఇస్మార్ట్' సినిమాకు మణిశర్మ అందించిన పాటలు మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















