Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?
‘కార్తికేయ 2’ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు మరో పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసారి స్పై థ్రిల్లర్ కథతో ఆకట్టుకోవడానికి సిద్దమవుతున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్ లు అందుకున్న ఈ హీరో తర్వాత వరుసగా ఫ్లాప్ లతో సతమతమయ్యాడు. అయితే చాలా సంవత్సరాల తర్వాత ‘స్వామి రారా’ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది ‘కార్తికేయ 2’ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు మరో పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసారి స్పై థ్రిల్లర్ కథతో ఆకట్టుకోవడానికి సిద్దమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటోను రిలీజ్ చేశాడు నిఖిల్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిఖిల్ రిలీజ్ చేసిన పోస్టర్ ను చూస్తే.. అందులో నిఖిల్ గన్ పట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. చూస్తుంటే పక్కా స్పై థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. దీంతో పాటు నిఖిల్ తన ఇంస్టా లో ఇలా రాసుకొచ్చాడు.. ‘‘ఇది అఫీషియల్ లీక్ ‘కార్తికేయ 2’ సినిమా తర్వాత మరో పాన్ ఇండియా మూవీతో మీ ముందుకు వస్తున్నా. మల్టీ లాంగ్వేజ్ లో తెరకెక్కుతోన్న ఈ స్పై థ్రిల్లర్ సినిమా ఈ వేసవిలో మీ ముందుకు రానుంది." అంటూ రాసుకొచ్చారు. దీంతో నిఖిల్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇలాంటి సినిమా కోసమే వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీకు గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన తొలి సినిమా. ఇంతకు ముందు ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్’, ‘పాగల్’, ‘హిట్ 2’ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు గ్యారీ. దీంతో ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ముందునుంచీ అంచనాలు ఉన్నాయి.
వాస్తవానికి నిఖిల్ కు ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. అయితే ‘కార్తికేయ 2’ సినిమా భారీ సక్సెస్ ను అందుకోవడంతో ఈ మూవీ ను ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో నిఖిల్ ఈ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు ఇదే నిఖిల్ స్పై సినిమాకు బాగా కలిసొస్తుంది. ఈ సినిమా తర్వాత నిఖిల్ నుంచి వచ్చిన ‘18 పేజెస్’ సినిమా కూడా హిట్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో ఈ కొత్త సినిమా పై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే సినిమా యాక్షన్ సన్నివేశాలను కూడా చాలా పగడ్బందీగా తెరకెక్కిస్తున్నారట మేకర్స్. అందుకు ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ విటేకర్ ఈ సినిమాకు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నాడట. అలాగే ఈ మూవీ లో నిఖిల్ సరసన అందాల భామ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా కనిపించనుండగా, ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
Read Also: ‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్
View this post on Instagram