Niharika vs Liger: లైగర్‌తో లేడీ టైగర్ నిహారిక ఫైట్, చివరికి పిల్లో ఫైట్‌కు ఫిక్స్ అయ్యారు!
మొన్న యశ్, నిన్న మహేష్ బాబుతో సందడి చేసిన నిహారిక.. నేడు లైగర్ మీద పంచులతో విరచుకు పడింది…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'లైగర్'.. ఈనెల 25న జనాల ముందుకు రాబోతుంది. రేపటితో ఈ సినిమా ఎలా ఉందో తేలిపోనుంది. అయితే దాదాపు నెల రోజుల నుంచి లైగర్ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. ప్రమోషన్ లో భాగంగా ఫైనల్ టచ్ ఇచ్చింది లైగర్ బృందం. సోషల్ మీడియా సెన్సేషనల్ స్టార్ ఎన్.ఎమ్.నిహారికతో అదిరిపోయే ప్రమోషన్ వీడియో రూపొందించింది. లైగర్ దుమ్మురేపేలా ఫైట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో విడుదల అయిన ఈ ఫైటింగ్ సీన్ ఫుల్ ట్రెండ్ అవుతోంది.
కామెడీ వీడియోలు చేస్తూ నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది నిహారిక. ఈమె చేసే వీడియోలను సెలబ్రిటీలు సైతం ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ కేజీఎఫ్, సర్కారు వారి పాట, రన్ వే 34, జెర్సీ(హిందీ), మేజర్ సహా పలు సినిమాల హీరోలతో కలిసి ప్రమోషనల్ వీడియోలు చేసింది. తాజాగా ఈ అమ్మడు లైగర్ తో ఫైట్ కు దిగింది. ఈ వీడియోలో తొలుత విజయ్ తో అదిరిపోయే ఫైట్ చేసిన నిహారిక.. చివరకు ఆయన కటౌట్ కు ఫిదా అవుతుంది. మొత్తంగా ఈ వీడియోను చాలా సరదాగా చూపించారు. అంతేకాదు.. సినిమాలో విజయ్ మాదిరిగానే ఆమె కూడా నత్తితో మాట్లాడే మాటలు కామెడీని పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లో నిలిచింది. పలువురు సెలబ్రిటీలు ఈ వీడియో మీద స్పందిస్తున్నారు. ఇలియానా, సుస్మితా కొణిదెల, సోనాల్ దేవ్ రాజ్, నిఖిల్ తనీజా.. సహా పలువురు ఈ వీడియోకు ఫిదా అయినట్లు చెప్పారు.
ఇక నిహారికకు దక్షిణాది భాషల మీద మంచి పట్టుంది. నిహారిక కాలిఫోర్నియాలో చదువుకుంది. ఇన్ స్టా వేదికగా ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఈ వీడియోలు జనాలను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తను సౌత్ అమ్మాయి కావడంతో ఇక్కడి కల్చర్ కు సంబంధించి తను చేసే వీడియోలు తెగ నవ్వు తెప్పిస్తాయి. తను మాట్లాడే ఇంగ్లీష్ సైతం సౌత్ యాసతో ఉంటుంది. తనకున్న క్రేజ్ ను సినిమా హీరోలు వాడుకుంటున్నారు. బాలీవుడ్ హీరో షహీద్ కపూర్, అజయ్ దేవగన్ సైతం ఆమెతో కలిసి ఫన్నీ వీడియో చేశారు. అంతేకాదు.. ఈ ముద్దుగుమ్మ చేసే వీడియోలు టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రెజినాలకు చాలా ఇష్టం. అందుకే వారు నిహారికను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. అటు నిహారికకు మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది.
ఇక లైగర్ సినిమాను దర్శకుడు పూరి జగన్నాథ్ పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించారు. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తుండగా.. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ టైసన్, రమ్యకృష్ణన్ కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ సినిమా ఈ నెలల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాను బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కమ్ నిర్మాత అయిన కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మించారు.
Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి
Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - విజయ్ దేవరకొండ
WAAAT LAGA DIYA. 🥲
— Niharika Nm (@JustNiharikaNm) August 23, 2022
But, hello Liger I’ll be your Tiger 😉 @TheDeverakonda #Liger #VijayDeverakonda pic.twitter.com/Wk6rchLMFn