News
News
X

New Year 2023: నాకు, సద్దాంకు మనస్పర్థలు వచ్చాయి: హైపర్ ఆది

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈటీవీలో ‘క్యాష్ వేర్ ఈజ్ ది పార్టీ’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మూడో ప్రోమోను విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈటీవీలో ‘క్యాష్ వేర్ ఈజ్ ది పార్టీ’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో బుల్లితెర కమెడియన్స్ తో పాటు పలు టీవీ సీరియల్స్ నటీనటులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి రెండు ప్రోమోలు వచ్చి ఆకట్టుకున్నాయి.  

తాజా ప్రోమోలో నరేష్, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ చేసిన స్కిట్ లు నవ్వులు పూయించాయి. టీవీ సీరియల్స్ నటీనటులు డాన్స్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. యాంకర్ సుమ పెట్టిన ఆటల పోటీలు కూడా అలరించాయి. ఈ ప్రోమో చూసి నెటిజన్స్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రోమో చివర్లో హైపర్ ఆది.. సద్దాం ను పిలిచి ‘‘ఈ ఏడాది మా ఇద్దరికీ కొన్ని మనస్పర్థలు వచ్చాయి. అవి ఈ కొత్త సంవత్సరంలో కంప్లీట్ గా పోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అని తెలిపాడు. తర్వాత ఇద్దరూ కేక్ తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమం డిసెంబర్ 31 రాత్రి ఈటీవీలో టెలికాస్ట్ కానుంది. చాలా మందికి సద్దాం కు హైపర్ ఆదికు మనస్పర్థలు వచ్చాయనే విషయం తెలియదు. ఈ ప్రోమోతో అది బయటకు వచ్చింది. అయితే ఆది అసలు ఏం జరిగిందనే విషయం చెప్తాడోొ లేదో చూడాలి. 

ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సుమ కనకాల బుల్లితెరపై తన యాంకరింగ్ జర్నీని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయింది. త్వరలో తాను యాంకరింగ్ కెరీర్ కొన్నాళ్లు విరామం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో సుమ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది? ఏమైంది? అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

సుమ మాటలు విని.. ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఆమె ఎందుకు యాంకరింగ్ కు బ్రేక్ ఇస్తుంది? పూర్తిగా యాంకరింగ్ నుంచి తప్పుకుంటుందా? బ్రేక్ ఇచ్చి తర్వాత ఏం ప్లాన్ చేస్తుంది అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇండస్ట్రీలో చాాలా మంది యాంకర్లు ఉన్నా సుమకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కొత్త యాంకర్లకు పోటీగా నిలుస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. స్టార్ మహిళ, క్యాష్ వంటి ప్రోగ్రాంలను ఎన్నో ఏళ్లు సక్సెస్ ఫుల్ గా నడిపించి ఆకట్టుకుంది. మరి ఇప్పుడు సుమ తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఆమె చేస్తోన్న షో లు నిలిచిపోతాయా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే పూర్తి ప్రోగ్రాం వచ్చే వరకూ వెయిట్ చేయాలస్సిందే.

ఇక ఆది ప్రస్తుతం టాలీవుడ్ లో కమెడియన్ గా కొనసాగుతున్నాడు. జబర్దస్త్ కామెడీ షో తో ఆది కాస్త హైపర్ ఆదిగా మారిపోయాడు. తన స్కిట్ లలో పంచ్ లతో జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా మారాడు. ఆ తర్వాత ఇతర షో లలో కూడా చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆదికు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే రవితేజ నటించిన ‘ధమాకా’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సద్దాం కూడా ప్రస్తుతం బుల్లితెర స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. తన యాటిట్యూడ్, టైమింగ్ పంచ్ లతో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు టివీ ప్రోగ్రాంలు, ఓటీటీ షోలతో పాటు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటున్నాడు సద్దాం.

Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ ఎలా ఉందంటే?

Published at : 29 Dec 2022 07:06 PM (IST) Tags: Suma Hyper Aadi Where is the Party Saddam Yadham Raju Ramprasad

సంబంధిత కథనాలు

Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?

Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?

Sundeep Kishan: ‘విక్రమ్’ నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్

Sundeep Kishan: ‘విక్రమ్’ నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్

Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?

Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?

Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన ‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?

Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ -  అంచనాలను మించిపోయిన ‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?

Pawan Kalyan - Sujeeth: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, పవన్ - సుజిత్‌ కొత్త మూవీ షురూ

Pawan Kalyan - Sujeeth: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, పవన్ - సుజిత్‌ కొత్త మూవీ షురూ

టాప్ స్టోరీస్

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!

BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!

Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని ఆదేశాలు

Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని ఆదేశాలు