Nani : 'నీ బర్త్ డేకి విషెస్ చెప్పాలనుకున్నా.. కానీ చెప్పను' ప్రభాస్ పై నాని కామెంట్
ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా యంగ్ హీరో నాని తనదైన స్టైల్ లో ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెప్పారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలంతా కూడా రెబల్ స్టార్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. 'రాధేశ్యామ్' యూనిట్ అయితే సినిమా టీజర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది. ఈ టీజర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ K' యూనిట్స్ అన్నీ కూడా ప్రభాస్ ని విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు.
Also Read: పేమెంట్స్ ఎగ్గొట్టి.. షో నుంచి తీసేసి.. తమన్నాను అవమానించిన 'మాస్టర్ చెఫ్'..
మెగాస్టార్ చిరంజీవి, అనుష్క లాంటి స్టార్లు కూడా ప్రభాస్ ని విష్ చేశారు. తాజాగా యంగ్ హీరో నాని తనదైన స్టైల్ లో ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెప్పారు. ''నీ బర్త్ డేకి విషెస్ చెప్పాలనుకున్నా ప్రభాస్ అన్నా.. but I won’t tell you'' అంటూ 'రాధేశ్యామ్' టీజర్ స్టైల్ లో చెప్పాడు. సినిమా టీజర్ లో ప్రభాస్ తనకు అన్నీ తెలుసనీ.. కానీ ఏదీ చెప్పనని అంటాడు. అందుకే నాని కూడా టీజర్ భాషలో ప్రభాస్ ని విష్ చేశాడు. దీనిపై ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అందరూ విషెస్ చెప్తారు కానీ నాని అన్న స్టైలే వేరంటూ పొగిడేస్తున్నారు.
ఇక నాని సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'టక్ జగదీష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ మధ్యనే 'శ్యామ్ సింగరాయ్' సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు నాని. ప్రస్తుతం 'అంటే సుందరానికి' అనే సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇక రీసెంట్ గా 'దసరా' అనే సినిమాను అనౌన్స్ చేశాడు. దసరా పండుగరోజు ఈ సినిమాను అనౌన్స్ చేసి.. ఒక పోస్టర్ ను విడుదల చేశారు. మాస్ లుక్ లో నాని చూసిన వారంతా షాకయ్యారు.
I want to tell you my wishes on your birthday Prabhas Anna but I won’t tell you ;)#HappyBirthdayPrabhas
— Nani (@NameisNani) October 23, 2021
Also Read: ఈ వారం ఆమె ఎలిమినేషన్ తప్పదా..? కారణాలివే..
Also Read: 'పెద్దన్న' కోసం రంగంలోకి దిగిన వెంకీ.. మాస్ ని ఉర్రూతలూగించే టీజర్..
Also Read: 'రాధే శ్యామ్' టీజర్: ప్రభాస్కు అన్నీ తెలుసు... కానీ చెప్పడు! ఎందుకంటే?
Also Read: డార్లింగ్ ప్రభాస్కు అందాల దేవసేన శుభాకాంక్షలు.. లవ్ సింబల్ లేకుండా జాగ్రత్త
Also Read: ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారంటే...!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి





















