Happy Birthday Prabhas: ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారంటే...!
లవ్ యూ డార్లింగ్.. ఈ మాట వినగానే ప్రభాస్ కళ్లముందు కనిపిస్తాడు. ఇంతకీ ఇండస్ట్రీలో ఇంత మంది హీరోలుండగా యంగ్ రెబల్ స్టార్ మాత్రమే డార్లింగ్ అయ్యాడెందుకు...
'ప్రేమిద్దాం డార్లింగ్..మహా అయితే తిరిగి ప్రేమిస్తారు ' ఈ డైలాగ్ సినిమాలోదే అయినప్పటికీ రియల్ లైఫ్ లో కూడా యంగ్ రెబల్ స్టార్ ఇలాగే ఉంటాడట. అందుకే ఇండస్ట్రీ వర్గాల నుంచి అభిమానుల వరకూ అందరూ ప్రేమగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. ఈ టైటిల్ తో ప్రభాస్ ఓ సినిమానే తీశాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా అసలు డార్లింగ్ అనే పదం ఎప్పుడు..ఎలా స్టార్ట్ అయిందనే సరదా డిస్కషన్ ట్రెండ్ అవుతోంది. ఈ మధ్యే తనయుడు 'రొమాంటిక్ ' మూవీ ట్రైలర్ ప్రభాస్ లాంచ్ చేసిన సందర్భంగా మాట్లాడిన పూరీ ఈ పిలుపు గురించి చెప్పాడు.
`బుజ్జిగాడు` సినిమా సమయంలోనే పూరిని తాను చాలా ప్రేమిస్తున్నానని.. అతన్ని డార్లింగ్ అని పిలిచేవాడినని ప్రభాస్ చెప్పాడు. అది పూరీకి చాలా నచ్చడంతో అదే మాట సినిమాలో ఉపయోగించాడట. 'బుజ్జిగాడు' లో డార్లింగ్ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఓ రేంజ్ లో కనెక్టైంది. అప్పటి డార్లింగ్ అన్నది కామన్ వర్డ్ అయిపోయింది. ప్రభాస్ కి మరో పేరులా మారిపోయింది.
పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకుంటే వరుసగా నాలుగు పెద్ద ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్`..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`....బాలీవుడ్ దర్శకుడు ఓరౌంత్ తో కలిసి `ఆదిపురుష్` లో నటిస్తున్నారు. ఇవి గాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె` లోనూ నటిస్తున్నాడు. ఇంకా మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. మరోవైపు స్నేహితులతో కలసి మల్టీప్టెక్స్ బిజినెస్ లో ఉన్నాడు. మొత్తానికి ఓ వైపు సినిమాలు, మరోవైపు వ్యాపారాలతో డార్లింగ్ ఫుల్ బిజీ.
Also Read: డార్లింగ్ ప్రభాస్ కి ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఎవ్వరూ ఇచ్చి ఉండరు..
Also Read: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..
Also Read: లవ్ యూ డార్లింగ్ అంటూ ఫ్యాన్స్ హంగామా... ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ మామూలుగా లేవు
Also Read: 'సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేయదు కానీ ఇంగ్లీష్ కిస్ పెట్టేవాడిని..' యానీ మాస్టర్ తో సన్నీ ఫన్..
Also Read: మహర్షి మహేష్ యోగి ఆశ్రమంలో సమంత.. ఫ్యాన్ గర్ల్ అంటూ పోస్ట్..
Also Read: 'మా నాన్న పనైపోయిందని అన్నారు.. కానీ కాలర్ ఎగరేసేలా చేశారు..' పూరి కొడుకు స్పీచ్ అదిరిపోలా..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి