X

Happy Birthday Prabhas: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..

Prabhas Birthday: దేశంలోని అన్ని భాషల్లో సూపర్ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న యంగ్ రెబల్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం..

FOLLOW US: 

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత స్టార్‌డమ్ ఉన్న హీరో, భారతీయ సినిమా బాహుబలి ప్రభాస్ నేడు 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. అభిమానులందరూ డార్లింగ్ అంటూ ప్రేమగా పిలుచుకునే ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు ఇప్పుడు ఇండియన్ సూపర్ స్టార్. కృష్ణంరాజు తమ్ముడి కొడుకు ప్రభాస్ అనే స్థాయి నుంచి.. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు అని చెప్పుకునే స్థాయికి ప్రభాస్ ఎలా ఎదిగాడు? అసలు ఈ ప్రయాణం ఎప్పుడు ప్రారంభం అయింది.


2002 సంవత్సరంలో ఈశ్వర్ అనే సినిమాతో ప్రభాస్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కాకపోయినా.. ప్రభాస్ మాత్రం ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 2004లో వచ్చిన వర్షంతో ప్రభాస్‌కు తాను కోరుకుంటున్న బ్రేక్ దొరికింది. అప్పటికే బాబీ లాంటి డిజాస్టర్ ఇచ్చినా.. దర్శకుడు శోభన్ తెచ్చిన కథను నమ్మిన ప్రభాస్ తన కెరీర్‌లో మొదటి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన అడవి రాముడు, చక్రం సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి.


అప్పుడు ప్రభాస్ కెరీర్‌నే పూర్తిగా మార్చేసిన ఛత్రపతి కథలో రాజమౌళి ప్రభాస్ దగ్గరకు వెళ్లాడు. 2005లో విడుదలైన ఛత్రపతి ప్రభాస్‌కు పూర్తిస్థాయి మాస్ హీరోను చేసింది. దీంతో ప్రభాస్‌కు మంచి స్టార్‌డం కూడా వచ్చింది. అయితే ఆ తర్వాత పౌర్ణమి, యోగి, మున్నాలతో మళ్లీ హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకున్నాడు.


అప్పుడు ప్రభాస్‌ను కొత్తగా చూపిస్తూ, అదే సమయంలో హీరోయిజం తగ్గకుండా పూరి జగన్నాథ్ బుజ్జిగాడిని మన ముందుకు తీసుకొచ్చాడు. ప్రభాస్‌లో ఇంతకుముందు ఎప్పుడూ చూడని కామెడీ టైమింగ్, హీరోయిజం ఎలివేషన్లు ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఈ సినిమాను తీర్చిదిద్దారు. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినా.. ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా బుజ్జిగాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఊతపదం డార్లింగ్ అప్పట్లో చాలా ఫేమస్ అయింది.


కోలీవుడ్‌లో అజిత్ నటించిన ‘బిల్లా’ సినిమాను అదే పేరుతో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెలుగులోకి రీమేక్ చేశాడు. ఈ సినిమా స్టైలిష్ ప్రభాస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసింది. ఒక పాత్రలో నెగిటివ్ షేడ్, మరో పాత్రలో కామిక్ షేడ్‌తో ప్రభాస్ నటన విమర్శకులను సైతం ఆకట్టుకుంది. మెహర్ రమేష్ కెరీర్‌లో యావరేజ్‌గా నిలిచిన చిత్రం ఇదొక్కటే. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే చేసిన ఏక్ నిరంజన్ కూడా ఫ్లాప్ అవ్వడంతో ప్రభాస్ రూట్ మార్చాడు.


కరుణాకరన్ దర్శకత్వంలో చేసిన పూర్తిస్థాయి ప్రేమకథ ‘డార్లింగ్’, దశరథ్ దర్శకత్వంలో చేసిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ ప్రభాస్‌కు అమ్మాయిలు, కుటుంబ ప్రేక్షకులను దగ్గర చేశాయి. ముఖ్యంగా డార్లింగ్‌లో ప్రభాస్ నటన, తన స్టైల్‌కు అమ్మాయిలందరూ ఫిదా అయిపోయారు. రెండు సంవత్సరాలు యాక్షన్‌కు దూరమైన అనంతరం రాఘవ లారెన్స్ దర్శకత్వంలో నటించిన ‘రెబల్’ పూర్తిగా నిరాశ పరిచింది. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన మొదటి సినిమా మిర్చి ప్రభాస్‌ను అల్ట్రా స్టైలిష్‌గా చూపించడంతో పాటు మంచి విజయాన్ని కూడా అందించింది.


మిర్చి తర్వాత ప్రభాస్ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలికి తన నాలుగేళ్ల కెరీర్‌ను పణంగా పెట్టాడు. భారతదేశ చరిత్రలో ఏ స్టార్ హీరో కూడా నాలుగేళ్లు ఒకే ప్రాజెక్టుకు కేటాయించలేదు. బాహుబలిలోనే కీలక పాత్రలు పోషించిన రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ.. అందరూ వేరే సినిమాలు చేస్తూ బాహుబలి చేయగా.. ప్రభాస్ పూర్తిగా బాహుబలి మీదనే కూర్చున్నాడు. 2013లో షూటింగ్ ప్రారంభం కాగా, 2015లో బాహుబలి: ది బిగినింగ్ విడుదలైంది.


ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో అనుమానాలు. తెలుగు సినిమా మార్కెట్‌కు రెట్టింపు బడ్జెట్ పెట్టేశారు. ఇండస్ట్రీ హిట్ అయినా సరే.. సినిమా మీద పెట్టిన పెట్టుబడి తిరిగిరాని పరిస్థితి రిలీజ్‌కు ముందు ఉంది. దీనికి తోడు మొదటిరోజు నెగిటివ్ టాక్ కూడా రావడంతో.. ప్రభాస్ కష్టం బూడిదలో పోసిన పన్నీరయిందని అందరూ ఫిక్సయిపోయారు. అయితే మొదటిరోజు సాయంత్రం నుంచి సినిమా పుంజుకుంది. ఎవ్వరూ ఊహించని విధంగా హిందీలో రూ.120 కోట్లను బాహుబలి కలెక్ట్ చేసింది. అంతకుముందు హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ సినిమా రోబో. ఈ సినిమా రూ.30 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. బాహుబలి దానికి నాలుగు రెట్లు ఎక్కువ వసూలు చేయడం విశేషం. అన్ని భాషల్లో కలిపి బాహుబలి రూ.600 కోట్ల వరకు వసూలు చేసింది.


కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న రెండో భాగంపై కూడా విపరీతంగా అంచనాలను పెంచింది. 2017 ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన బాహుబలి 2 అందరి అంచనాలను మించింది. మొదటి రోజే ఏకంగా రూ.217 కోట్లను వసూలు చేసింది. 10 రోజుల్లో రూ.1,000 కోట్లు వసూలు చేసిన బాహుబలి.. ఫుల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ ఏకంగా రూ.547 కోట్లను వసూలు చేసింది. ఈ రికార్డు ఇప్పటికే చెక్కు చెదరలేదు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో ఇప్పటికీ బాహుబలి 2నే ఇండస్ట్రీ హిట్. దీంతో ప్రభాస్ ఇమేజ్ ఆకాశాన్ని అంటింది.


అంత పెద్ద ఇండస్ట్రీ హిట్ తర్వాత.. ప్రభాస్ కోసం అగ్రదర్శకులు అందరూ క్యూ కట్టారు. పెద్ద బ్యానర్లు రూ.వందల కోట్ల పారితోషికంతో వెంటబడ్డారు. కానీ ఎప్పుడో ఇచ్చిన మాట కోసం ఒక సినిమా అనుభవం మాత్రమే ఉన్న సుజీత్‌తో సాహో సినిమాను ప్రభాస్ ప్రారంభించాడు. స్నేహితులు, దాదాపు సొంత బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. భారీతనం, యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఎక్కువ సమయం తీసుకున్న ఈ సినిమా 2019 ఆగస్టు 30వ తేదీన విడుదల అయింది. టీజర్లు, ట్రైలర్లు పూర్తిగా యాక్షన్‌తో నింపేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే కథ, కథనాలు బలహీనంగా ఉండటంతో.. సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ సాహో హిందీలో రూ.160 కోట్ల వరకు వసూలు చేసి ప్రభాస్ బాహుబలి స్టార్ కాదని నిరూపించింది. మొత్తంగా ఈ సినిమా రూ.440 కోట్ల వరకూ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. రాధేశ్యామ్ వచ్చే సంవత్సరం జనవరి 14వ తేదీన విడుదలకు సిద్ధం అవుతుండగా, ఆదిపురుష్ ఆగస్టు 11వ తేదీన విడుదల కానుంది. ఏప్రిల్ 14వ తేదీన విడుదల కానుందని ప్రకటించిన సలార్ వెనక్కి వెళ్లింది. ఈ సినిమా కూడా వచ్చే సంవత్సరమే విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా ప్రకటించారు. ఈ సినిమాలు అన్నిటి మార్కెట్ రూ.2 వేల కోట్లకు పైనే. దీంతోపాటు బాలీవుడ్ డైరెక్టర్ సిద్థార్థ్ ఆనంద్, ప్రశాంత్ నీల్(మరో సినిమా), రాజమౌళి కూడా ప్రభాస్‌తో సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ప్రభాస్ మరో పదేళ్ల పాటు సులభంగా భారతీయ సినీ పరిశ్రమను కచ్చితంగా ఏలే అవకాశం ఉంది.


మిగతా స్టార్ల కంటే ముందుంచే ప్రవర్తన
ప్రభాస్‌ను మిగతా స్టార్ల కంటే ఒక మెట్టు పైన ఉంచేది వ్యక్తిగత ప్రవర్తనే. తానో స్టార్ అనే గర్వం ప్రభాస్‌లో మచ్చుకైనా కనిపించదు. సెట్స్‌లో ఎవ్వరితో అయినా ఒకేలా ప్రవర్తిస్తాడు, అందరికీ ఒకేలా మర్యాద ఇస్తాడు అని ప్రభాస్ గురించి అందరూ చెప్పే మాట. దీంతోపాటు ఒక సినిమా హిట్ అవ్వగానే.. స్టార్ డైరెక్టర్ల వైపు చూసే హీరోలు ఉన్న ఈ రోజుల్లో.. కొత్తవారికి అవకాశం ఇవ్వడమే ప్రభాస్ ప్రత్యేకత. ఎప్పుడో తనకు వర్షం సినిమాతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ శోభన్‌ను గుర్తు పెట్టుకుని తన కొడుకు సంతోష్ శోభన్ (ఏక్ మినీ కథ ఫేం) చేసే ప్రతి సినిమాని ప్రమోట్ చేయడం ప్రభాస్ క్యారెక్టర్‌ను తెలియజేస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ చేసే డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్‌తో సహా ఎవ్వరూ నాలుగు సినిమాల కంటే ఎక్కువ చేయలేదు. ప్రభాస్ ఎప్పటికీ ఇలానే ఉండాలి.. తన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యి తెలుగు సినిమాని మాత్రమే కాకుండా, ఇండియన్ సినిమాని కూడా మరో స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రభాస్‌కు ఏబీపీ దేశం తరఫున హ్యాపీ బర్త్‌డే!


Also Read: అటు మహేష్.. ఇటు ప్రభాస్.. అబ్బో ఈ బ్యూటీ డిమాండ్ మాములుగా లేదుగా..


Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Prabhas Project K Radheshyam Salaar Spirit Prabhas Birthday Prabhas BirthDay Special Happy Birthday Prabhas

సంబంధిత కథనాలు

Akhanda: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ.. 

Akhanda: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ.. 

Bigg Boss 5 Telugu: సన్నీ, కాజల్ లకు మానస్ వార్నింగ్.. ఏడ్చేసిన కాజల్..

Bigg Boss 5 Telugu: సన్నీ, కాజల్ లకు మానస్ వార్నింగ్.. ఏడ్చేసిన కాజల్..

Vijay Setupathi: ఎయిర్ పోర్ట్ దాడి ఘటన.. విజయ్ ని విడిచిపెట్టేలా లేదు.. 

Vijay Setupathi: ఎయిర్ పోర్ట్ దాడి ఘటన.. విజయ్ ని విడిచిపెట్టేలా లేదు.. 

Rajinikanth: ర‌జ‌నీకాంత్‌తో త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ‌ భేటీ!

Rajinikanth: ర‌జ‌నీకాంత్‌తో త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ‌ భేటీ!

Vicky-Katrina love story: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ

Vicky-Katrina love story: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Tesla Car in Space: అంతరిక్షంలో వదిలిన ఎలన్ మస్క్ టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? భూమి వైపు దూసుకొస్తుందా?

Tesla Car in Space: అంతరిక్షంలో వదిలిన ఎలన్ మస్క్ టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? భూమి వైపు దూసుకొస్తుందా?

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Suicide Machine: ‘ఆత్మహత్య’కు అనుమతి.. నొప్పిలేకుండా చంపే యంత్రానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Suicide Machine: ‘ఆత్మహత్య’కు అనుమతి.. నొప్పిలేకుండా చంపే యంత్రానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!