Meenakshi Chaudhary: అటు మహేష్.. ఇటు ప్రభాస్.. అబ్బో ఈ బ్యూటీ డిమాండ్ మాములుగా లేదుగా..
మొదటి సినిమాతోనే ప్లాప్ అందుకున్న ఏ హీరోయిన్ కి కూడా ఇంత డిమాండ్ ఉండదు. రెండో సినిమాకి ఛాన్స్ రావడమే గొప్ప. కానీ కొందరు హీరోయిన్లకు మాత్రం అదృష్టం కలిసొస్తుంటుంది.
తెలుగులో సుశాంత్ నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ రిజల్ట్ తో సంబంధం లేకుండా మీనాక్షికి వరుస అవకాశాలు రావడం విశేషం. 2018లో మిస్ ఇండియా అయిన ఈ నార్త్ బ్యూటీ మొదటి సినిమాలో నటిస్తోన్న సమయంలోనే రవితేజ సరసన 'ఖిలాడి' సినిమాలో రెండో హీరోయిన్ గా ఎంపికైంది. ఆ తరువాత అడివి శేష్ సరసన 'హిట్2' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఇవి రెండూ కూడా క్రేజీ సినిమాలే కావడం విశేషం.
Also Read: పవన్ బ్రేక్ తీసుకోవడం పక్కా.. మరి ఒప్పుకున్న సినిమాల సంగతేంటో..?
నిజానికి మొదటి సినిమాతోనే ప్లాప్ అందుకున్న ఏ హీరోయిన్ కి కూడా ఇంత డిమాండ్ ఉండదు. రెండో సినిమాకి ఛాన్స్ రావడమే గొప్ప. కానీ కొందరు హీరోయిన్లకు మాత్రం అదృష్టం కలిసొస్తుంటుంది. మీనాక్షి కూడా అదే కోవలోకి వస్తుంది. ఇప్పటికే రెండు సినిమా అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అవి ప్రభాస్, మహేష్ సినిమాలు కావడం విశేషం.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న 'సలార్' సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం మీనాక్షిని ఎన్నుకున్నారట. ఇందులో ఆమెది హీరోయిన్ రోల్ కానప్పటికీ ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించబోయే సినిమాలో కూడా మీనాక్షిని ఒక హీరోయిన్ గా తీసుకుంటున్నారని టాక్. కానీ ఈ విషయంలో స్పష్టం లేదు. ఈ వార్తలు గనుక నిజమైతే మీనాక్షి కెరీర్ కి ఇక ఢోకా ఉండదు. ఫ్యూచర్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడం ఖాయం.
Also Read: హాలీవుడ్ ట్రైలర్... 'అన్ ఛార్టెడ్': కుర్రకుంకా... పెద్దవాళ్లతో ఆటలా?
Also Read: 'నాట్యం' సమీక్ష: నృత్యం బావుంది! కానీ..
Also Read : ప్రధాని మోదీకి మొరపెట్టుకున్న నటి, క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్
Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?
Also Read: అఘోరాగా యువ హీరో...‘గామి’టీమ్‌కు బన్నీ ప్రశంసలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి