అన్వేషించండి

Bigg Boss 5 Telugu: 'సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేయదు కానీ ఇంగ్లీష్ కిస్ పెట్టేవాడిని..' యానీ మాస్టర్ తో సన్నీ ఫన్.. 

ఏ ఒక్క పోటీదారుల బెలూన్ అయితే పగలకుండా ఉంటుందో వారే తదుపరి ఇంటి కెప్టెన్ అని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్ లో ఎవరు గెలిచారంటే..? 

ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో 'కోల్గెట్ స్మైల్ చేయండి.. స్టార్ట్ చేయండి..' అనే టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను తమ మరపురాని జీవితానుభావాలను పంచుకోమని బిగ్ బాస్ చెప్పడంతో.. ఇంటి సభ్యులంతా తమ కష్టాలు, కన్నీళ్లు తోటి సభ్యులతో షేర్ చేసుకున్నారు. సిరి తన అనుభవాలను పంచుకుంటూ.. 'అందరూ అన్నారు ఊళ్లో.. తల్లి ఏమైనా పద్దతిగా ఉందా కూతురు ఉండడానికి అన్నారు..  మా ఊళ్లో వాళ్లకి, మా చుట్టాలకి నేను చెబుతున్నదేంటంటే నేను పద్దతిగానే పెరిగాను, పద్దతిగానే ఉంటున్నాను' అంటూ ఎమోషనల్ అయింది. జెస్సీ మాట్లాడుతూ తనకు చిన్నప్పట్నించి గొంతు సమస్య ఉందని, తనకు వాయిస్ సరిగా రాదని చెప్పుకొచ్చాడు. అయినా గిన్నిస్ బుక్ ఎక్కానని, ఫ్యాషన్ ఐకాన్ గా మారానని, తన తల్లి మాత్రం తన కొడుకు మోడల్ అని చెప్పుకోదని అన్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం అందరి దగ్గరకు వెళ్లి గర్వంగా చెప్పుకుందని తెలిపాడు. ఇక సన్నీ తన తల్లి గురించి చెబుతూ ముగ్గురు అబ్బాయిలను ఒంటరిగా ఒక మహిళ పెంచడం ఎంత కష్టమో తనకు తెలుసునని ఎమోషనల్ అయ్యాడు.

Also Read: 'మా నాన్న పనైపోయిందని అన్నారు.. కానీ కాలర్ ఎగరేసేలా చేశారు..' పూరి కొడుకు స్పీచ్ అదిరిపోలా..!

ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా మానస్, విశ్వ, కాజల్, రవి, సన్నీ ఎంపికైన సంగతి తెలిసిందే. వీరికి బెలూన్ టాస్క్ ఒకటి ఇచ్చారు బిగ్ బాస్. ఏ ఒక్క పోటీదారుల బెలూన్ అయితే పగలకుండా ఉంటుందో వారే తదుపరి ఇంటి కెప్టెన్ అని బిగ్ బాస్ చెప్పారు. అలానే సందర్భానుసారం బజర్ మోగినప్పుడు పెడెస్టెల్ పై ఉన్న గుండుసూదిని హౌస్ మేట్స్ తీసి.. ఎవరికైతే మద్దతు తెలుపుతారో వారికి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్లు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడుతున్న సభ్యుల బెలూన్ ను పగలగొట్టొచ్చు. 

ముందుగా గుండుసూది జెస్సీకి దొరకడంతో అతడు కాజల్ చేతిలో పెట్టాడు. కాజల్ తన దగ్గరున్న పిన్ తో విశ్వ బెలూన్ ను పొడిచే ప్రయత్నం చేసింది. దానికి విశ్వ.. సరైన కారణం చెప్పి పొడవమని అనగా.. 'నువ్ రెండు సార్లు కెప్టెన్ అయ్యావ్' అని కాజల్ చెప్పగా.. కష్టపడి అయ్యానని బదులిచ్చాడు విశ్వ. ఆ తరువాత కాజల్ దగ్గర నుంచి విశ్వ పరుగెత్తగా.. యాక్సిడెంటల్ గా బెలూన్ పగిలిపోయింది. 

రెండోసారి బజర్ మోగిన వెంటనే పెడెస్టెల్ పై ఉన్న గుండుసూది కోసం పరుగెత్తుకుంటూ వెళ్లారు హౌస్ మేట్స్. ప్రియాంక, విశ్వ, లోబో ముందుగా వెళ్లగా.. ప్రియాంకను తోసుకుంటూ విశ్వ వెళ్లడంతో ఆమె కింద పడిపోయింది. దీంతో విశ్వపై ప్రియాంక మండిపడింది. 'ప్రతిదానికి నీకు కండబలం ఉంది.. అందరికీ లేదు' అని ప్రియాంక అనగా.. 'కండబలం అని ఎందుకు అంటున్నావ్' అంటూ ప్రియాంక మీద అరవగా.. ఆమె కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయింది. మగాడివి కాబట్టి బలం ఎక్కువగా ఉంటుందని అరుస్తుండగా..  'మగాడు.. గిగాడని మాట్లాడొద్దు.. ఇక్కడ అందరూ కంటెస్టెంట్స్' అంటూ అరిచాడు విశ్వ. ఆ తరువాత రవి.. మానస్ బెలూన్ ను పొడిచేశాడు. అనంతరం 'నేనవుతా రవి కెప్టెన్..' అంటూ కాజల్ చెప్పగా.. 'సంపాదించు.. అడుక్కోకు' అని డైలాగ్ వేశాడు రవి. 

మూడోసారి బజర్ మోగినప్పుడు లోబో గుండుసూది తీసుకొని రవి చేతిలో పెట్టగా.. ఆ పిన్ ని చూపిస్తూ కాజల్ తో మాట్లాడాడు రవి. 'ఈ పిన్ నీ చేతుల్లోకి వస్తే సన్నీ బెలూన్ పొడుస్తావా..? నా బెలూన్ పొడుస్తావా..?' అని ప్రశ్నించాడు రవి. దానికి సన్నీను పొడుస్తా.. అని చెప్పింది. అయినప్పటికీ కాజల్ బెలూన్ ను పొడిచేశాడు రవి. 

నాలుగోసారి బజర్ మోగినప్పుడు యానీ మాస్టర్ పిన్ తీసుకొని సన్నీకి ఇవ్వగా.. అతడు రవి బెలూన్ ను పేల్చి.. కెప్టెన్ గా నిలిచాడు. ఆ తరువాత యానీ మాస్టర్ తో కూర్చొని మాట్లాడాడు సన్నీ. 'సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేయదు కానీ ఇంగ్లీష్ కిస్ పెట్టేవాడిని' అంటూ కామెడీ చేసి నవ్వించాడు. యానీ మాస్టర్ తమకు సపోర్ట్ చేస్తానని చెప్పి సన్నీకి సపోర్ట్ చేయడంతో రవి, విశ్వ ఆమెని ప్రశ్నించారు. 

Also Read : ప్రధాని మోదీకి మొరపెట్టుకున్న నటి, క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్

Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget