Samantha: మహర్షి మహేష్ యోగి ఆశ్రమంలో సమంత.. ఫ్యాన్ గర్ల్ అంటూ పోస్ట్..
తాజాగా సమంత మహర్షి మహేష్ యోగి ఆశ్రమంకు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ విషయాలను అభిమానులతో పంచుకుంది.
![Samantha: మహర్షి మహేష్ యోగి ఆశ్రమంలో సమంత.. ఫ్యాన్ గర్ల్ అంటూ పోస్ట్.. Samantha Shares Pictures from Her Visit to Maharishi Mahesh Yogi Ashram Samantha: మహర్షి మహేష్ యోగి ఆశ్రమంలో సమంత.. ఫ్యాన్ గర్ల్ అంటూ పోస్ట్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/22/4853a7c425fe40cc936d2d6e646e9559_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత వరుస ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి తన సినిమాల షూటింగ్స్ మొదలుకానున్నాయి. దీంతో ఈ గ్యాప్ లో తన స్నేహితురాలితో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంది. ప్రస్తుతం ఆమె ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్రకు వెళ్లింది. తాజాగా సమంత మహర్షి మహేష్ యోగి ఆశ్రమంకు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ విషయాలను అభిమానులతో పంచుకుంది.
Also Read: అటు మహేష్.. ఇటు ప్రభాస్.. అబ్బో ఈ బ్యూటీ డిమాండ్ మాములుగా లేదుగా..
ఆశ్రమంకు దగ్గర్లో ఉన్న ఒక ప్లేస్ లో నుంచొని ఫోటో తీసుకుంది సమంత. అక్కడే తన ఫేవరేట్ అమెరికన్ మ్యూజిక్ బ్యాండ్ బీటిల్స్ కూడా ఒకప్పుడు నుంచుందని చెప్పింది. వారు అక్కడే అతీంద్రియ ధ్యానం ప్రాక్టీస్ చేశారని.. దాదాపు 48 పాటలను రాశారని చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ కి ఫ్యాన్ గర్ల్ ఫర్ ఎవర్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించింది. అలానే ఆశ్రమంలో ఉన్న బీటిల్స్ గ్రూప్ ఫోటోలను షేర్ చేసింది.
చైతూతో విడిపోయిన తరువాత సమంత మానసికంగా చాలా కుంగిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. ఆ బాధలోంచి బయటపడడానికి సమంత ఇలా తన స్నేహితురాలితో కలిసి సమయాన్ని గడుపుతోంది. ట్రిప్ నుంచి రాగానే ఇక సినిమాలతో బిజీ అయిపోవాలని నిర్ణయించుకుంది. ఇక ఈ బ్యూటీ నటించిన 'శాకుంతలం' సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
Also Read : ప్రధాని మోదీకి మొరపెట్టుకున్న నటి, క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్
Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)