Tamannaah: పేమెంట్స్ ఎగ్గొట్టి.. షో నుంచి తీసేసి.. తమన్నాను అవమానించిన 'మాస్టర్ చెఫ్'..
తమన్నా 'మాస్టర్ చెఫ్' షో నిర్వాహకులపై లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకుంది. దానికి కారమేంటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోయింది. మధ్యలో ఆమెకి అవకాశాలు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా కథ నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన 'మ్యాస్ట్రో' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో చాలా బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా 'మాస్టర్ చెఫ్' అనే షోతో బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. సౌత్ ఇండియాలో మొదలుపెట్టిన ఈ షో కోసం ఒక్కో భాషలో ఒక్కో తారను హోస్ట్ గా తీసుకోగా.. తెలుగు నుంచి తమన్నాను తీసుకున్నారు.
Also Read: ఈ వారం ఆమె ఎలిమినేషన్ తప్పదా..? కారణాలివే..
ఆగస్టు 27 నుంచి ఈ షోని టెలికాస్ట్ చేస్తున్నారు. తమన్నా హోస్ట్ చేస్తోన్న ఈ షోకి సంజయ్ తుమ్మ, చలపతి రావు, మహేష్ పడాల జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కుకింగ్ షోకి తమన్నా పెద్ద ఫ్యాన్. అదే షోని హోస్ట్ చేసే ఛాన్స్ రావడంతో మిల్కీబ్యూటీ చాలా ఎగ్జైట్ అయింది. కానీ రీసెంట్ గా ఈ షోలో కొన్ని మార్పులు జరిగాయి. దీంతో తమన్నా 'మాస్టర్ చెఫ్' షో నిర్వాహకులపై లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకుంది.
దానికి కారమేంటంటే.. తమన్నాకు ఇవ్వాల్సిన పేమెంట్స్ ను బాకీ పెట్టారట. అలానే తనను సడెన్ గా షో నుంచి తప్పించి.. కమ్యూనికేషన్ కట్ చేశారట. పేమెంట్స్ ఎగ్గొట్టడంతో పాటు అన్ ప్రొఫెషనల్ గా ప్రవర్తించడంతో తమన్నా సీరియస్ అయింది. దీంతో 'మాస్టర్ చెఫ్' షోను నిర్వహిస్తోన్న ఇన్నోవేటివ్ ఫిలిం అకాడమీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తమన్నా తరఫు న్యాయవాది ఓ మీడియా హౌస్ తో వెల్లడించారు. దీంతో విషయం బయటకొచ్చింది.
నిజానికి ఈ షో కోసం తమన్నా ఇతర కమిట్మెంట్స్ ను కాదనుకుందట. మొత్తం షోని పూర్తి చేసే విధంగా కాల్షీట్స్ కేటాయించింది. అయినప్పటికీ తనకు చెప్పకుండా షో నుంచి తప్పించడంతో లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకుంది. మొదట తమన్నాను తప్పించి అనసూయను తీసుకుంటే.. తమన్నా బిజీగా ఉండడం వలన అలా చేసి ఉంటారని అందరూ భావించారు. కానీ కావాలనే తమన్నాను తప్పించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇక కొత్త హోస్ట్ అనసూయ ఇప్పటికే ఈ షోకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంది. బెంగుళూరులో ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది.
Also Read: 'పెద్దన్న' కోసం రంగంలోకి దిగిన వెంకీ.. మాస్ ని ఉర్రూతలూగించే టీజర్..
Also Read: 'రాధే శ్యామ్' టీజర్: ప్రభాస్‌కు అన్నీ తెలుసు... కానీ చెప్పడు! ఎందుకంటే?
Also Read: డార్లింగ్ ప్రభాస్‌కు అందాల దేవసేన శుభాకాంక్షలు.. లవ్ సింబల్ లేకుండా జాగ్రత్త
Also Read: ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారంటే...!
Also Read: డార్లింగ్ ప్రభాస్ కి ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఎవ్వరూ ఇచ్చి ఉండరు..
Also Read: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















