Anuskha Wishes Prabhas: డార్లింగ్ ప్రభాస్‌కు అందాల దేవసేన శుభాకాంక్షలు.. లవ్ సింబల్ లేకుండా జాగ్రత్త
ప్రభాస్-అనుష్క జంటగా చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. తన డార్లింగ్ ఫ్రెండ్ పుట్టినరోజుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది స్వీటీ.
ప్రభాస్-అనుష్క జంటకు ఎంతో మంది ఫ్యాన్స్. వీళ్లిద్దరూ జంటగా కనిపిస్తే చాలు కనులపండువలా ఫీలైపోయే వీరాభిమానులున్నారు. వీరిద్దరి మధ్యే ఎన్నో గాసిప్స్ వచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ ఎక్కడా ప్రభాస్, అనుష్క నోరు జారి ఒక్కమాట కూడా తమ రిలేషన్ గురించి మాట్లాడలేదు. తాము కేవలం మంచి స్నేహితులమని మాత్రమే చెప్పుకొచ్చారు. నిజమైన స్నేహితుల్లాగే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అప్పట్లో ఓసారి సాహో సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు ప్రభాస్. అందులో యాంకర్ మీకు అనుష్కతో రిలేషన్ ఉందా, డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తే, లేదని తేల్చి చెప్పేశాడు ప్రభాస్. తామిద్దరం చాలా ఏళ్లు కలిసిపనిచేశాం కాబట్టి ఆ ప్రేమ, ఆప్యాయత ఉంటుంది కానీ దానికి వేరే అర్థాలు తీయడం సరికాదని చెప్పాడు. ఓసారి అనుష్క తల్లి కూడా తమకు ప్రభాస్ లాంటి అల్లుడు కావాలని అనడం సంచలనం రేపింది. అయినా సరే వీరిద్దరూ మాత్రం స్నేహితులగానే కొనసాగుతూ వచ్చారు.
అక్టోబర్ 23న తన ప్రియమైన స్నేహితుడు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో అనుష్క ఎంతో ప్రేమగా స్పందించింది. తన ట్విట్టర్, ఇన్ స్టా ఖాతాలలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టింది. ‘జీవితంలో మీకు అంతా మంచి మాత్రమే జరగాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు, మీ అన్నీ సినిమా కథలు అందరి హృదయాలకు చేరాలని కోరుకుంటున్నాను. ఆనందం, ఆరోగ్యం దక్కాలని ఆశిస్తున్నాను’ అంటూ దేవసేన తన బాహుబలికి అందమైన సందేశాన్ని పంపింది. పోస్టు మధ్యలో ఎక్కడా కూడా ఒక లవ్ సింబల్ కూడా లేకుండా జాగ్రత్తపడింది. నిజానికి ప్రేమతో మెసేజ్ పెట్టేటప్పుడు ఆడా, మగా అనే తేడా లేకుండా లవ్ సింబల్స్ పెట్టడం ఇప్పుడు కామన్ అయింది. కానీ ప్రభాస్-అనుష్కలపై వస్తున్న పుకార్ల నేపథ్యంలోనే దేవసేన చాలా జాగ్రత్తగా పోస్టు పెట్టింది.
View this post on Instagram
Alos Read: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..
Also Read: డార్లింగ్ ప్రభాస్ కి ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఎవ్వరూ ఇచ్చి ఉండరు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి