అన్వేషించండి

Radheshyam Teaser: 'రాధే శ్యామ్' టీజర్: ప్రభాస్‌కు అన్నీ తెలుసు... కానీ చెప్పడు! ఎందుకంటే?

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు (శనివారం, 23-10-2021) 'రాధే శ్యామ్' టీజర్ రిలీజ్ చేశారు. అదెలా ఉంది? అందులో ఏముంది? ఈ టీజర్ రివ్యూ చదవండి. 

ప్రభాస్ ప్రేమకథ చేసి చాలా రోజులైంది. 'సాహో'తో అతడు ప్రేక్షకుల ముందుకొచ్చి రెండేళ్లు దాటింది. అది స్టయిలిస్ట్ యాక్షన్ సినిమా. అంతకు ముందు 'బాహుబలి' చేశాడు. అదీ వార్ డ్రామా. 'బాహుబలి' ముందు చేసిన 'మిర్చి' లాంటి యాక్షన్ ఫిల్మ్ చేశాడు. అందుకని, ప్రభాస్ ప్రేమకథ చేస్తుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో 'రాధే శ్యామ్' టీజర్ రిలీజ్ చేశారు. 

'రాధే శ్యామ్'లో ప్రభాస్ పాత్ర పేరు విక్రమాదిత్య. ఆల్రెడీ అతడి లుక్ ఎప్పుడో విడుదల చేశారు. ఈ రోజు విక్రమాదిత్య ఎవరు? అనేది ప్రేక్షకులకు పరిచయం చేశారు. సినిమాలో పామిస్ట్ (చేయి చూసి జాతకం) చెప్పే వ్యక్తిగా ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ లో ఆ విషయం వెల్లడించారు. ఏదో ఒక భాషకు పరిమితం కాకుండా అన్ని భాషల ప్రేక్షకులకు చేరువయ్యేలా టీజర్ లో ప్రభాస్ చేత ఇంగ్లిష్ లో డైలాగులు చెప్పించారు. 

'ఐ నో యు... బట్, నో. ఐ వోంట్ టెల్ యు' అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. 'నాకు తెలుసు. కానీ, చెప్పను' అంటున్నారు ప్రభాస్. హార్ట్ బ్రేక్, ఫెయిల్యూర్స్, చావు... అన్నీ తనకు తెలుసు అని విక్రమాదిత్య అంటున్నాడు. అయినా ఎవరీ చెప్పడంట! ఎందుకంటే... మనం అర్థం చేసుకునేదాని కంటే అతీతమైనదని వివరించాడు. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. టీజర్ లో విజువల్స్ చాలా బావున్నాయి.  రాధే శ్యామ్'ను ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. 

‘రాధేశ్యామ్’ టీజర్‌ను ఇక్కడ చూసేయండి:

టాప్ హెడ్ లైన్స్

Spy Thriller OTT : థియేటర్లలో మిక్స్‌డ్... ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ - టాప్ ప్లేస్‌లో కార్తి 'సర్దార్ 2'... ట్రెండింగ్‌లో అన్నా తమ్ముళ్ల మూవీస్
థియేటర్లలో మిక్స్‌డ్... ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ - టాప్ ప్లేస్‌లో కార్తి 'సర్దార్ 2'... ట్రెండింగ్‌లో అన్నా తమ్ముళ్ల మూవీస్
Sanjay Dutt: చేతులెత్తి మొక్కిన మున్నాభాయ్... దేశంలో శాంతి లేదా? క్లారిటీ ఇచ్చిన దత్
చేతులెత్తి మొక్కిన మున్నాభాయ్... దేశంలో శాంతి లేదా? క్లారిటీ ఇచ్చిన దత్
Crime Thriller OTT : వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఒకే రోజు ఆరు ఓటీటీల్లో కొత్త మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఒకే రోజు ఆరు ఓటీటీల్లో కొత్త మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Godavari Serial Today October 6th: 'గోదావరి' సీరియల్: జానుని గెంటేసిన నందు! సంజయ్ బెడ్‌రూంలో జాను!
'గోదావరి' సీరియల్: జానుని గెంటేసిన నందు! సంజయ్ బెడ్‌రూంలో జాను!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
Embed widget