Bigg Boss 5 Telugu: లాస్ట్ మినిట్ లో బిగ్ బాస్ ట్విస్ట్.. ప్రియా ఎలిమినేషన్ తప్పేలా లేదు..
ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.
బిగ్ బాస్ సీజన్ 5 షో రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి కాజల్, రవి, సిరి, ఆనీ, ప్రియ, శ్రీరామ్, జస్వంత్, లోబో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. నిజానికి వీరందరిలో రవికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలో కాస్త క్రేజ్ కూడా ఉండడంతో తన గేమ్ ని ఎంత కన్నింగా ఆడుతున్నా సేవ్ అయిపోతున్నాడు.
Also Read: 'పెద్దన్న' కోసం రంగంలోకి దిగిన వెంకీ.. మాస్ ని ఉర్రూతలూగించే టీజర్..
సిరికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. దీంతో ఆమెకి ఓట్లు బాగానే పడుతున్నాయి. శ్రీరామ్ కి నార్త్ నుంచి ఓట్లు పడుతున్నాయని టాక్. పైగా హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. జెస్సీకి మొదట్లో పెద్దగా ఫాలోయింగ్ లేనప్పటికీ.. రోజురోజుకీ తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. దీంతో అతడికి కూడా ఓట్లు పడుతున్నాయి.
లోబోకి ఎంటర్టైనర్ గా మంచి గుర్తింపు రావడంతో హౌస్ లో అతడు ఉండాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు. కాజల్ టీమ్ ఓట్లు కోసం సోషల్ మీడియాలో బాగానే ప్రచారం చేస్తున్నారు. తన ఆటతో ఆమె మెప్పిస్తుండడంతో కాజల్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారింది. ఇక ప్రియాకి ఉన్న డిమాండ్ గురించి చెప్పనక్కర్లేదు. అరిచో, కామెడీ చేసో, సన్నీతో గొడవ పడో ఏదొక విధంగా ఆమె వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఇక రెండు వారాలుగా యానీ మాస్టర్ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. సిరిపై ఆమె అరవడం, ఆమెని ఇమిటేట్ చేయడం వంటి పనులతో యానీ మాస్టర్ పై నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. అలానే ఆమె త్వరగా ఫ్లిప్ అయిపోతుంది. నిన్నటి టాస్క్ లో కూడా రవి, విశ్వలకు సపోర్ట్ చేస్తానని చెప్పి సన్నీకి మద్దతు తెలిపింది. గ్రూపులుగా ఆడుతున్నారంటూ అందరిపై ఫైర్ అవుతోంది. దీంతో ఆమె ఎలిమినేట్ అవ్వడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఈ విషయంలో బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. లాస్ట్ వరకు యానీ మాస్టర్ ను, ప్రియాను ఎలిమినేషన్ లో ఉంచి చివరిగా ప్రియాను ఎలిమినేట్ చేస్తున్నారని సమాచారం. ఆమె ఎలిమినేషన్ పక్కా అని అంటున్నారు.
Also Read: 'రాధే శ్యామ్' టీజర్: ప్రభాస్‌కు అన్నీ తెలుసు... కానీ చెప్పడు! ఎందుకంటే?
Also Read: డార్లింగ్ ప్రభాస్‌కు అందాల దేవసేన శుభాకాంక్షలు.. లవ్ సింబల్ లేకుండా జాగ్రత్త
Also Read: ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారంటే...!
Also Read: డార్లింగ్ ప్రభాస్ కి ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఎవ్వరూ ఇచ్చి ఉండరు..
Also Read: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..