Nani's Shyam Singha Roy: 'శ్యామ్ సింగ రాయ్' రెడీ... టీజర్ విడుదల ఎప్పుడంటే?
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా 'శ్యామ్ సింగ రాయ్' టీజర్ విడుదల తేదీ ఖరారైంది. టీజర్ ఎప్పుడు విడుదల చేస్తున్నారంటే?
![Nani's Shyam Singha Roy: 'శ్యామ్ సింగ రాయ్' రెడీ... టీజర్ విడుదల ఎప్పుడంటే? Nani's Shyam Singha Roy teaser release date cofirmed Teaser to be out on Nov 18th Nani's Shyam Singha Roy: 'శ్యామ్ సింగ రాయ్' రెడీ... టీజర్ విడుదల ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/11/be0fd9e134f79f79a19b1a31d5838df5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. డిసెంబర్ 24న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇటీవల సినిమాలో 'రైజ్ ఆఫ్ శ్యామ్' పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీజర్ విడుదల చేయడానికి సిద్ధమైంది.
Get ready for the Vigorous Action & Eruptive Rage of a Majestic Man! ✊🏻💥#ShyamSinghaRoy🔱 Teaser on Nov 18th!📝✨#SSRTeaser 🔥
— Niharika Entertainment (@NiharikaEnt) November 11, 2021
Natural 🌟 @NameisNani @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @MickeyJMeyer @Rahul_Sankrityn @NiharikaEnt @SSRTheFilm #SSRonDEC24th 💥 pic.twitter.com/HOjgiB83lY
ఈ నెల 18న 'శ్యామ్ సింగ రాయ్' టీజర్ విడుదల చేయనున్నట్టు ఈ రోజు చిత్రబృందం వెల్లడించింది. అందులో నాని సహా ఇతర పాత్రధారులు, హీరోయిన్లు ముగ్గురినీ పరిచయం చేస్తారేమో చూడాలి. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టిల్ ఆకట్టుకునేలా ఉంది.
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన 'శ్యామ్ సింగ రాయ్'లో రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సత్యదేవ్ జంగా కథ అందించిన ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
Also Read: సంతాపమా... ప్రచారమా? ఏంటిది తలైవా?? రజనీకాంత్‌పై నెటిజన్స్ ఫైర్
Also Read: 'పుష్పక విమానం' చూశాక... విమానం ఎక్కి విదేశాలు చెక్కేస్తున్న విజయ్ దేవరకొండ
Also Read: తిరిగిచ్చేద్దాం అన్న కేటీఆర్.. ఇలాంటోళ్లు ఉండాలన్న మహేశ్... ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్
Also Read: 'అఖండ' విడుదల తేదీ ఖరారు... బాలకృష్ణతో భారీ చిత్రాల సందడి మొదలు!
Also Read: భార్య పేరు కలిసి వచ్చేలా... ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన హీరో
Also Read: ప్రకటనల్లో నటించిన వారే అన్నింటికీ బాధ్యులా ? అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాల్సిందేనా ? సెలబ్రిటీల ప్రకటనలపై వివాదాలెందుకు ?
Also Read: 'క్రాక్' ఎక్కించిన టైమ్ లోనే 'కిక్' ఇవ్వనున్న 'ఖిలాడీ'..
Also Read: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)